Olympic Medallist
-
IPL 2022: ప్రారంభ వేడుకల్లేవు.. ఈసారి వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
BCCI To Felicitate Tokyo Olympics Medallists: వరుసగా నాలుగో ఏడాది ప్రారంభ వేడుకలు లేకుండానే క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షురూ కానుంది. అయితే, ఈసారి ఓపెనింగ్ సెర్మనీ స్థానంలో టోక్యో ఒలింపిక్స్ 2020 పతక విజేతలను (భారత) ఘనంగా సత్కరించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయమై ఇదివరకే ఒలింపిక్ విజేతలకు ఆహ్వానాలు పంపింది. జావెలిన్ త్రో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాతో పాటు రెజ్లర్లు బజరంగ్ పూనియా (కాంస్యం), రవి దాహియా (రజతం), వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (రజతం), బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ (కాంస్యం), షట్లర్ పీవీ సింధు (కాంస్యం), భారత పురుషుల హాకీ జట్టు సభ్యులు (కాంస్యం) ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కు సత్కారంతో పాటు కోటి రూపాయల నజరానా కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. No #IPL Opening ceremony for the 4th consecutive year. Last time it was held in 2018Instead BCCI will felicitate few of the Olympians ahead of #CSKvKKRGold Medalist Neeraj Chopra will attend the CEREMONY and will recieve 1 Crore from BCCI pic.twitter.com/B9tFWxkeoq— Abhijeet ♞ (@TheYorkerBall) March 26, 2022 మార్చి 26న ముంబైలోని వాంఖడేలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్‌కు ముందు టోక్యో ఒలింపిక్స్ విజేతల సన్మాన కార్యక్రమం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఎందుకు లేవంటే.. 2008 నుంచి 2018 వరకు పదేళ్లపాటు నిర్విరామంగా జరిగిన ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు 2019 సీజన్లో బ్రేక్ పడింది. ఆ ఏడాది భారత సైనికులపై ఉగ్రదాడి (పూల్వామా మారణకాండ) జరిగిన కారణంగా ఐపీఎల్ వేడుకలు రద్దు చేశారు. ఇక 2020, 2021 సీజన్లలో కరోనా కారణంగా ఓపెనింగ్ సెర్మనీ ఊసే లేదు. చదవండి: IPL 2022: చెన్నై, కేకేఆర్ ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ అరుదైన రికార్డులేంటో చూద్దాం..! -
క్వార్టర్స్‌లో దినేశ్
న్యూఢిల్లీ: గీబీ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ దినేశ్ డాగర్ శుభారంభం చేశాడు. ఫిన్లాండ్లో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల 69 కేజీల విభాగం తొలి రౌండ్లో దినేశ్ 3–2తో 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎవాల్డస్ పెట్రాస్కాస్ (లిథువేనియా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 64 కేజీల విభాగంలో అంకిత్ ఖటానా 0–5తో ల్యూక్ మెక్కార్మక్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు), గోవింద్ సాహ్ని (49 కేజీలు)లకు నేరుగా సెమీఫైనల్లోకి ‘బై’ లభించడంతో కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి.ఈ టోర్నీలో 15 దేశాల నుంచి 100 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. -
ఒలింపిక్ ప్లేయర్‌ను ఓడించిన రాందేవ్
-
ఒలింపిక్ ప్లేయర్‌ను ఓడించిన రాందేవ్
యోగా గురువు బాబా రాందేవ్ తాను విసిరిన సవాల్లో నెగ్గి భళా అనిపించుకున్నారు. 2008 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన ఆండ్రీ స్టాడ్నిక్‌ను తనతో తలపడి గెలవాల్సిందిగా బాబా రాందేవ్ సవాలు విసిరారు. తాను ప్రతిరోజు వ్యాయామం చేస్తానని, దానివల్ల ఎంతో శక్తి చేకూరుతుందని ముందుగానే హెచ్చరించిన రాందేవ్ బుధవారం రాత్రి ఆండ్రీ స్టాడ్నిక్ తో జరిగిన కుస్తీ పోటీలో గెలుపొందారు. ఈ బౌట్లో 12-0 పాయింట్లతో ఒలింపిక్ ప్లేయర్ ను ఓడించారు. నాలుగు పాయింట్లతో ఖాతా తెరచిన రాందేవ్, వరుస పాయింట్లు సాధిస్తూ 7-0 ఆధిక్యంలోకి వెళ్లి.. బౌట్ ముగిసేసరికి మరో ఐదు పాయింట్లు సాధించడంతో పాటు ఒలింపిక్ ప్లేయర్‌కు కనీసం ఒక్క పాయింట్‌ను కూడా కోల్పోకపోవడం గమనార్హం. మ్యాచ్ ముగియగానే రాందేవ్‌ను విన్నర్‌గా ప్రకటించగానే భారత్ మాతా కి జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ముందుగా బౌట్ ప్రారంభానికి ముందు రాందేవ్ సూర్య నమస్కారాలు చేశారు. ప్రత్యర్థి స్టాడ్నిక్‌ను ఆశీర్వదించి కుస్తీ ప్రారంభించారు యోగా గురువు. బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఓడించిన స్టాడ్నిక్ ఈ గేమ్‌లో ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. రాందేవ్ బాబా మ్యాట్‌పై చాలా చురుగ్గా కదులుతూ ప్రత్యర్థిని తికమక పెట్టారు. యోగా గురువు వరుస పాయింట్లు సాధిస్తున్నా.. స్టాడ్నిక్ మాత్రం ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. బుధవారం రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కి ముందు ఆండ్రీ స్టాడ్నిక్, రాందేవ్‌ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ వీక్షకులకు వినోదాన్ని పంచింది. జాతీయ ఆటగాళ్లను ఓడించిన రాందేవ్, ఓ అంతర్జాతీయ స్థాయి ఆటగాడిని ఓడించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. బౌట్ ముగిసిన అనంతరం రాందేవ్ బాబా మాట్లాడుతూ.. రాబోయో రోజుల్లో భారత్‌లో రెజ్లింగ్‌కు ప్రాముఖ్యం ఏర్పడుతుందని, అత్యంత ఆదరణ ఉన్న ఆటగానూ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఒలింపిక్ కుస్తీయోధుడికి రాందేవ్ చాలెంజ్
ప్రస్తుతం పతంజలి ప్రోవీటా ప్రో రెజ్లింగ్ లీగ్ జరుగుతోంది. ఇందులో హర్యానా హేమర్స్, జైపూర్ నింజాస్ తమ తొలి సెమీ ఫైనల్లో బుధవారం తలపడతారు. అయితే.. దీనికంటే ఆసక్తికరమైన విషయం మరోటి ఉంది. 2008 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన ఆండ్రీ స్టాడ్నిక్‌ను తనతో తలపడి గెలవాల్సిందిగా బాబా రాందేవ్ సవాలు చేశారు. ఇది అందరికీ పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. బక్క పలచగా ఉండే బాబా రాందేవ్ ఏంటి.. అసలు రెజ్లింగ్ చేయడం ఏంటని అంతా అనుకుంటున్నారు. యోగాలో అంటే ఆయనకు తిరుగులేదు గానీ, రెజ్లింగ్ గురించి తెలుసా అని చర్చించుకుంటున్నారు. బుధవారమే జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కి ముందు ఆండ్రీ స్టాడ్నిక్, రాందేవ్‌ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ ఒకటి జరగనుంది. తాను ప్రతిరోజూ వ్యాయామం చేస్తానని, తన శక్తిని పెంచుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, అలాగే సమయం చిక్కినప్పుడల్లా అఖాడాకు వెళ్లి రెజ్లింగ్ కూడా చూస్తానని రాందేవ్ చెబుతున్నారు. తాను ఇంతకుముందు జాతీయస్థాయి రెజ్లర్లతో తలపడ్డానని, కానీ ఒక అంతర్జాతీయ క్రీడాకారుడితో తలపడితే మరింత ఎగ్జయిటింగ్‌గా ఉంటుందని అన్నారు. ఈ మ్యాచ్‌లో యోగా రియల్ పవర్ ఏంటో చూస్తారని కూడా ఊరిస్తున్నారు. ఈ చాలెంజ్ విషయం తెలియగానే ఆండ్రీ ముందు ఆశ్చర్యపోయాడు. కానీ, బాబా రాందేవ్ సిద్ధమవుతున్న విషయం తెలిసి, ఎలాగైనా ఆయనతో తలపడాల్సిందేనని సిద్ధమయ్యాడు. అయితే.. రాందేవ్ ఇలా రెజ్లర్లతో పోరాడటం ఇది మొదటిసారి ఏమీ కాదు. గత సంవత్సరం హరిద్వార్‌లో తమ ఆశ్రమం 20వ వార్షికోత్సవం సందర్భంగా రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్‌ను చాలెంజ్ చేశారు. ఆ మ్యాచ్ తర్వాత.. బాబా నిజంగానే రెజ్లింగ్‌ను సీరియస్‌గా తీసుకుంటే ఆయన దేశంలోనే అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరు అయ్యేవారని సుశీల్ చెప్పాడు! మరిప్పుడు ఆండ్రీ ఏమంటాడో చూడాలి. -
క్రీడామంత్రిగా ఒలింపిక్ పతక విజేత
ఒలింపిక్ క్రీడల్లో నాలుగు సార్లు మెడల్స్ సాధించిన కార్లోస్ ఎస్పినోలాను అర్జెంటీనా ప్రభుత్వం క్రీడామంత్రిగా నియమించింది. సెయిలింగ్ క్రీడలో అర్జెంటీనాకు కార్లోస్ నాలుగు పతకాలు సాధించిపెట్టాడు. కార్లోస్ ను క్రీడా మంత్రిగా నియమిస్తూ అర్జెంటీనా అధ్యక్షుడు క్రిస్టినా ఫెర్నాండెజ్ ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వ గెజిట్ లో ప్రచురించారు. మేయర్ గా కొర్రిఎంటెస్ పదవి కాలం గత డిసెంబర్ లో ముగిసింది. గత సంవత్సరం కొరిఎంటెస్ గవర్నర్ గా పోటీ చేసి కార్లోస్ ఓటమి పాలైయ్యారు. అర్జెంటినా దేశానికి సెయిలింగ్ క్రీడలో అత్యధిక ఒలింపిక్ పతకాలను సాధించిన క్రీడాకారుడిగా కార్లోస్ కు గుర్తింపు ఉంది. 1996 లో అట్లాంటా, 2000 సిడ్నీ, 2004, 2008 సంవత్సరాల్లో జరిగిన ఒలంపిక్ క్రీడల్లో పతకాలను సాధించారు.