ఇంజినీరింగ్ కళాశాలపై నుంచి పడి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు.
ఘట్‌కేసర్: ఇంజినీరింగ్ కళాశాలపై నుంచి పడి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన ఘట్‌కేసర్‌లోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. కళాశాలలో రెండో సంవత్సరం(మెకానికల్) చదువుతున్న దినేష్(19) భవనం పై నుంచి పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు పడ్డాడా అనే కోణంలో దృష్టి సారించారు. దినేష్ నగరంలోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.