లాభాల్లో మార్కెట్లు: భారతీ, ఐడియా జంప్
Published Thu, Feb 23 2017 10:00 AM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM
ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు వారాంతంలో పాజిటివ్ నోట్తో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 61.36 పాయింట్ల లాభంలో 28,926 వద్ద, నిఫ్టీ 19.30 పాయింట్ల లాభంలో 8946 వద్ద ట్రేడవుతోంది. టెలినార్ ఇండియాను కొనుగోలు చేయబోతున్నట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 10 శాతం పైకి దూసుకెళ్లాయి. ఈ కొనుగోలు ఒప్పందంతో 1,800 మెగాహెడ్జ్ బ్యాండ్ లో కంపెనీకి అదనపు స్పెక్ట్రమ్ లభించనుంది. మరోవైపు ఐడియా షేర్లు 7 శాతం పైకి రివ్వున ఎగిరాయి.
వొడాఫోన్-ఐడియా విలీనంలో సాప్ట్ బ్యాంకు మైనారిటీ స్టాక్ ను అంటే 15-20 శాతం స్టాక్ ను కొనుగోలచేయనున్నట్టు తెలియడంతో ఐడియా షేర్లు రయ్ మని దూసుకెళ్లాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా 66.96వద్ద ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 103 నష్టంతో 29,198 వద్ద ట్రేడవుతోంది. కాగ, మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్లు సెలవును పాటించనున్నాయి.
Advertisement