అనుమానం.. పెనుభూతమై.. | Husband kills wife | Sakshi
Sakshi News home page

అనుమానం.. పెనుభూతమై..

Published Tue, Feb 3 2015 2:22 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

అనుమానం.. పెనుభూతమై.. - Sakshi

అనుమానం.. పెనుభూతమై..

భార్యను హతమార్చిన భర్త
మృతురాలి బంధువుల ఆందోళన
పోలీసుల రాకతో సద్దుమణిగిన గొడవ

 
ధర్మాపురం(దేవరుప్పుల) : అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని ధర్మాపురంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మండలంలోని ధర్మాపురం శివారు పడమటితండాకు చెందిన జాటోత్ సుగుణ బీకోజీ కూతురు భారతి(31)కి  16 ఏళ్ల క్రితం ఇదే తండా సమీపంలోని లకావత్‌తండాకు చెందిన జక్కమ్మ, హర్యానాయక్ కుమారుడు కబీర్‌తో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు జన్మించగా ఇటీవల కుటుంబ కలహాలు మొదలయ్యూరుు. భారతికి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ఆరోపిస్తూ భార్యతో తరచూ గొడవకు దిగుతున్నట్లు  తండావాసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి తల్లిగారింటికి వెళ్లొచ్చిన భారతి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కబీర్ మళ్లీ గొడవకు దిగాడు. కొడవలితో  కడుపు చీరగా పేగులు బయటపడి విలవిలలాడుతూ మృతిచెందినట్లు ప్రత్యక్ష సాక్షి ఎనిమిదేళ్ల కొడుకు శ్రవణ్ ఏడ్చుకుంటూ చెప్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

భార్యను హతమార్చిన కబీర్‌తోపాటు అత్తమామలు తెల్లారేసరికే పరారీ కావడంతో మృతురాలి బంధువులు చేరుకుని ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేశారు. ఎస్సై కె.సూర్యప్రసాద్ చేరుకుని శాంతింపజేసే యత్నం చేసినా మహిళలు ప్రతీకార చర్య తీసుకుంటామని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పాలకుర్తి సీఐ తిరుపతి పాలకుర్తి, కొడకండ్ల ఎస్సైలు ఉస్మానీ అలీ, శ్రీనివాస్‌తో చేరుకుని బాధితులను శాంతింపజేశారు. మూడు గంటల ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం మృతురాలి తల్లిదండ్రులు సుగుణ,బీకోజీ ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు. తల్లి మృతదేహాన్ని చూసి కూతుర్లు స్వాతి, జ్యోతి, కుమారుడు శ్రవణ్  రోదిస్తున్న తీరు గ్రామస్తులను కలచివేసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement