నష్టాలకు చెక్: దూసుకొచ్చిన మార్కెట్లు
Published Tue, Apr 18 2017 9:49 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి వస్తున్ననష్టాలకు స్టాక్ మార్కెట్లు బ్రేక్ వేశాయి. నష్టాల నుంచి తేరుకుని, భారీ లాభాల దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంలోకి ఎగిసి 29662 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ తన కీలకమార్కు 9200ను అధిగమించి ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ మద్దతుతో మార్కెట్లు ర్యాలీ జరుపుతున్నాయి. గెయిల్ 2 శాతం మేర లాభాలను పండిస్తోంది. గెయిల్ తో పాటు హిందాల్కో, టాటా స్టీల్, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీలు లాభాల్లో నడుస్తున్నాయి.
కోల్ ఇండియా, మహింద్రా అండ్ మహింద్రా, సిప్లా, భారతీ ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నేడు మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఫలితాలను ప్రకటించనుంది. నార్త్ కొరియా ప్రయోగించిన క్షిపణి పరీక్ష విఫలమవ్వడం, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్సు ఆసియా టూర్ లో బిజిబిజిగా కావడంతో అటు ఆసియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా 64.50వద్ద ప్రారంభమైంది.
Advertisement