
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పలు సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మహిళా ఖాతాదార్లకు ఆఫర్లు ప్రకటించింది.
బీఓబీ మహిళా శక్తి సేవింగ్స్ ఖాతా లేదా బీఓబీ వుమెన్ పవర్ కరెంట్ ఖాతాలను జూన్ 30లోగా తెరిచి, డిసెంబరు 31 వరకు రుణం పొందేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ఖాతాలు తెరిచిన మహిళలకు అందించే రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల (0.25%) వరకు వడ్డీ రాయితీ ఇవ్వనుంది.
ఇదీ చదవండి: రూ.75కే సినిమాలు.. దేశంలోనే తొలి ఓటీటీ ప్రారంభించిన ప్రభుత్వం
ద్విచక్ర వాహన రుణాలకైతే 0.25%, విద్యా రుణాలకైతే 0.15%, వాహన, గృహ, తనఖా రుణాలపై 0.1% వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు బీఓబీ ప్రకటించింది. రిటైల్ రుణాలపై (వ్యక్తిగత రుణాలతో సహా) ప్రాసెసింగ్ రుసుమును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వార్షిక సురక్షిత డిపాజిట్ లాకర్ ఛార్జీలపై 50% రాయితీ ఇవ్వనున్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment