ముంబై: దేనా బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా విక్రయించనుంది. ఇక్కడి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని హెడ్ క్వార్టర్స్‌ను విక్రయించడానికి రూ. 530 కోట్లు రిజర్వ్ ప్రైస్ నిర్ణయించింది. అమ్మకం, వేలం కోసం బిడ్లను ఆహా్వనిస్తోంది. వార్తాపత్రికలలో గురువారం ప్రచురించిన ఆఫర్ పత్రం ప్రకారం.. ఈ–వేలం ద్వారా కార్యాలయాన్ని విక్రయానికి ఉంచనున్నట్లు స్పష్టమైంది. అక్టోబర్ 18న వేలం నిర్వహించనుంది. కదిలించగలిగే ఫర్నిచర్ వంటివి ఆస్తిలో భాగం కాదని ప్రకటనలో వివరించింది. కార్యాలయం 2,878.36 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. బిల్ట్ అప్ ఏరియా 9,953.73 చదరపు మీటర్ల విస్తీర్ణంగా ఉంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment