బీఓబీ డెబిట్‌ కార్డ్‌ ఈఎంఐ సౌలభ్యత | BoB launches debit card EMI facility for its customers | Sakshi
Sakshi News home page

బీఓబీ డెబిట్‌ కార్డ్‌ ఈఎంఐ సౌలభ్యత

Published Thu, Jan 26 2017 1:34 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

బీఓబీ డెబిట్‌ కార్డ్‌ ఈఎంఐ సౌలభ్యత

బీఓబీ డెబిట్‌ కార్డ్‌ ఈఎంఐ సౌలభ్యత

ముంబై: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) తన డెబిట్‌ కార్డ్‌ వినియోగదారులకు ఈఎంఐ సౌలభ్యతను కల్పించింది. దీనివల్ల బ్యాంక్‌ వినియోగదారులకు డెబిట్‌ కార్డ్‌ ఈఎంఐ సౌలభ్యత ద్వారా ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్స్, వినియోగ వస్తువులను కొనుగోలు చేయగలుగారు. ’డెబిట్‌ కార్డ్‌ ఈఎంఐ పేరుతో ఈ ప్రొడక్ట్‌ను ప్రారంభించాం. దీని ద్వారా మా వినియోగదారులు తమ అధిక విలువైన కొనుగోలు లావాదేవీలను తేలికపాటి నెలవారీ చెల్లింపు (ఈఎంఐ)గా మార్చుకోగలుగుతారు.

ఈ కామర్స్‌ లేదా షాపింగ్‌ పోర్టల్స్‌ ద్వారా ప్రొడక్ట్‌ కొనుగోలుకు ఈ సౌలభ్యం దోహదపడుతుంది’’ అని ’’అని బ్యాంక్‌ ఒక  ప్రకటనలో వివరించింది.  రూ.50,000 వరకూ ఈ డెబిట్‌ కార్డ్‌ ఈఎంఐ సౌలభ్యతను కస్టమర్లు పొందవచ్చని బ్యాంక్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ–కామర్స్‌ మర్చెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కిస్త్‌’పై ఈ సౌలభ్యతను ప్రారంభిస్తున్నట్లు బ్యాంక్‌ వివరించింది. తదుపరి ఈ ప్రొడక్ట్‌ ప్రత్యక్షంగా ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ వంటి ఆన్‌లైన్‌ పోర్టళ్లు, ఇతర ప్రముఖ మర్చెంట్లకు అనుసంధానం అవనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement