‘బీఓబీ’లో 190 స్వీపర్-కమ్-ప్యూన్ పోస్టులు | 190 sweeper-cum-pyun posts in BOB | Sakshi
Sakshi News home page

‘బీఓబీ’లో 190 స్వీపర్-కమ్-ప్యూన్ పోస్టులు

Published Wed, Nov 30 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

190 sweeper-cum-pyun posts in BOB

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తెలుగు రాష్ట్రాల్లోని తమ శాఖల్లో ఖాళీగా ఉన్న ఫుల్ టైమ్ స్వీపర్-కమ్-ప్యూన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. సుమారు రూ.20,000 వరకు  వేతనం అందుకునేఅవకాశం ఉన్న ఈ సబార్డినేట్ కేడర్/సబ్ స్టాఫ్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు.
 
 మొత్తం ఖాళీలు: 190 
 ఆంధ్రప్రదేశ్‌లో: 143+1 (ఎస్సీ-23, ఎస్టీ-12, ఓబీసీ-38, ఓసీ-70). ఇందులో దివ్యాంగులకు 8, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 34 పోస్టులను రిజర్వ్ చేశారు.
 
 + గుర్తు తర్వాత ఉన్న ఒక పోస్టు(ప్యూన్)ను ఎస్టీలకు రిజర్వ్ చేశారు.
 
 తెలంగాణలో: 46 (ఎస్సీ-7, ఎస్టీ-3, ఓబీసీ-13, ఓసీ-23). ఇందులో దివ్యాంగులకు 4, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 12 పోస్టులను రిజర్వ్ చేశారు. 
 
 వేతనం: రూ.9,560-18,545 పేస్కేల్+డీఏ+హెచ్‌ఆర్‌ఏ+ఇతర
 అలవెన్సులు.
 
 విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాష (తెలుగు) చదవడం, రాయడం రావాలి. ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
 
 వయసు: 2016, డిసెంబర్ 16 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టం 26 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
 
 ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
 
 రాత పరీక్ష: రెండు గంటల (120 నిమిషాల) వ్యవధిలో జరిగే పరీక్షలో 100 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ప్రశ్నలు ఐదు సబ్జెక్టుల నుంచి వస్తాయి. అవి..
 
 గమనిక: ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కుల్లో ఐదు శాతం సడలింపు ఉంటుంది. ఇంగ్లిష్ మినహా మిగిలిన సబ్జెక్టుల ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటాయి.
 
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. 
 
 దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లు రూ.100; ఓసీ, ఓబీసీలు రూ.400 చెల్లించాలి. 
 చివరి తేదీ: డిసెంబర్ 16, 2016.
 
 వెబ్‌సైట్: http:// bengaluru.bobcareers.in (OR) www.bankofbaroda.co.in 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement