స్వల్పకాలిక రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేటును 7.1 నుంచి 7.6 శాతం వరకూ ఆఫర్ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, ఇతరులకు 7.1 శాతం రేటు వర్తిస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది.
‘బీఓబీ360’ పేరుతో ప్రారంభించిన ఈ తాజా బల్క్ డిపాజిట్ స్కీమ్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంక్ ప్రస్తుత లేదా కొత్త కస్టమర్లు ఈ బల్క్ డిపాజిట్ స్కీమ్‌ను ఏదైనా బ్రాంచ్‌లో, ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా తెరవవచ్చు. కాగా, రెండు వారాల క్రితమే బీఓబీ రూ.2 కోట్ల లోపు స్వల్పకాలిక స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1%) వరకూ పెంచింది.
7–14 రోజుల డిపాజిట్ రేట్లు అత్యధికంగా 3 శాతం నుంచి 1.25% పెరిగి 4.25 శాతానికి చేరింది. 15–45 రోజుల డిపాజిట్ రేటు 1 శాతం పెరిగి 4.50%కి చేరింది. 271 రోజుల బల్క్ డిపాజిట్లపై బ్యాంక్ 6.25 శాతం వడ్డీరేటును ఆఫర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment