న్యూఢిల్లీ : తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లకు కేంద్రం 2014-15 ఏడదిలో రూ.6,990 కోట్ల పెట్టుబడులను అందించింది. కేపిటల్ బేస్ పటిష్టత లక్ష్యంగా ఈ నిధులను అందించినట్లు బ్యాంకులు బీఎస్‌ఈకి తెలిపాయి. వీటిలో ఎస్‌బీఐ(రూ. 2,970 కోట్లు), పీఎన్‌బీ(870 కోట్లు), బీఓబీ(1,260 కోట్లు), కెనరా బ్యాంక్ (570 కోట్లు), సిండికేట్ బ్యాంక్ (460 కోట్లు), అలహాబాద్ బ్యాంక్ (320 కోట్లు), ఇండియన్ బ్యాంక్(280 కోట్లు) దేనా బ్యాంక్ (140 కోట్లు), ఆంధ్రాబ్యాంక్(120 కోట్లు) ఉన్నాయి. బాసెల్-3 ప్రమాణాల ప్రకారం 2018 నాటికి పీఎస్‌బీలకు కేంద్రం ఈక్విటీగా రూ.2.4 లక్షల కోట్లు సమకూర్చాల్సి ఉంటుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు.