బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్‌ | SC refuses to Stay Merger of Vijaya, Dena banks with Bank of Baroda | Sakshi
Sakshi News home page

బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్‌

Published Fri, Mar 29 2019 2:58 PM | Last Updated on Fri, Mar 29 2019 3:00 PM

SC refuses to Stay Merger of Vijaya, Dena banks with Bank of Baroda - Sakshi

ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో కేంద్రానికి ఊరట లభించింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)లో విజయా బ్యాంక్‌, దేనాబ్యాంక్‌ విలీనాన్ని నిలుపుచేయాలని దాఖలైన పిటిషన్లను అతున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. న్యాయమూర్తి ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, న్యాయమూర్తి వినీత్‌ శరణ్‌ నేతృత్వంలోని డివిజనల్‌ బెంచ్‌, ఈ అంశంపై తక్షణం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇది పూర్తిగా ఆర్థికవిధానాలనకు సంబంధించిన అంశంగా పేర్కొంది.

బ్యాంకుల తరపున  సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోహ్‌తంగ్‌ వాదనలు వినిపించారు. మార్గదర్శకాల ప్రకారమే  విలీన నిర్ణయం జరిగిందని తెలిపారు. మరోవైపు ఈ విలీన నిర్ణయాల్లో పలు తప్పులు జరిగాయని బ్యాంక్‌ ఆఫీసర్ల అసోసియేషన్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వకేట్‌ శ్యామ్‌ దివాన్‌  వాదించారు.

విజయా, దేనా బ్యాంకులు ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం కానున్నాయి. దీనితో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దేశంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ  తర్వాత మూడవ అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించనుంది.  కాగా ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు బ్యాంక్‌ ఆఫీసర్ల అసోసియేషన్లు ఈ పిటిషన్లను దాఖలు చేసిన సంగతి  తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement