Vijaya Bank
-
ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్అలర్ట్!
ఏప్రిల్ 1 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. తద్వారా వివిధ ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారనున్నాయి. ఈ మార్పులు వల్ల ఆయా బ్యాంకు యూజర్లు ప్రభావితం కానున్నారు. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అలా విలీనం అయిన బ్యాంకుల్లో దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి చెల్లవు. ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనం కావడం వల్ల పాత బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు నిలిపివేయనున్నారు. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం అయ్యాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి)లో, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. పిఎన్‌బి, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం అయిన బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి సంబంధిత బ్యాంకులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. పాత బ్యాంకుల బ్యాంకింగ్ ఆధారాలు 2021 మార్చి 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉన్నందున పాస్‌బుక్, చెక్‌బుక్, ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనవి 2021 ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు అని వారు సమాచారం ఇచ్చారు. సిండికేట్ బ్యాంకు యూజర్లకు ఊరట అదేవిధంగా, ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి మారిన ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి పొందాల్సి ఉంటుంది. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం అయినసంగతి తెలిసిందే. అయితే, ఇతర బ్యాంకుల్లా కాకుండా సిండికేట్ బ్యాంక్ తమ కస్టమర్లకు కొంత ఊరటనిచ్చింది. ఈ బ్యాంకు కస్టమర్లు తమ పాస్‌బుక్ లావాదేవీలను జూన్ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం వారి ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కెనరా బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. చదవండి: జాతీయ రహదారుల వెంట ప్రపంచ స్థాయి సౌకర్యాలు! సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
రెండేళ్లలో అనుసంధానం పూర్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు విలీనం కాగా, వీటి మధ్య అనుసంధానత రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు బ్యాంకు ఆఫ్ బరోడాలో విలీనమై ఒక్కటిగా మారిన విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అనుసంధానానికే 12 నెలల వరకు సమయం తీసుకోవచ్చని, ఇతర వ్యవస్థల మధ్య అనుసంధానతకు మరో ఏడాది పట్టొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ సమయంలో ఖాతాదారులకు అసౌకర్యాన్ని పరిమితం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విలీనం వల్ల ఏర్పడే అదనపు వ్యయాలను దృష్టిలో ఉంచుకుని, నియంత్రణపరమైన అవసరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5,042 కోట్ల నిధులు సమకూర్చినట్టు ఆ అధికారి తెలిపారు. విలీన ప్రభావం మొదటి త్రైమాసికమైన ఏప్రిల్–జూన్ కాలంలో కార్యకలాపాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు. విలీనానంతర బ్యాంకుకు రూ.8.75 లక్షల కోట్ల డిపాజిట్లు, రూ.6.25 లక్షల కోట్ల రుణ పుస్తకం ఉంటాయి. విలీనం తర్వాత బీవోబీ ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగులు, 12 కోట్ల ఖాతాదారులు బ్యాంకుకు ఉన్నారు. -
బీవోబీలో బ్యాంకుల విలీనం నేటి నుంచే అమల్లోకి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం.. నేటి నుంచే (ఏప్రిల్ 1) అమల్లోకి రానుంది. తద్వారా దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకు ఏర్పడనుంది. ఇకనుంచి విజయా బ్యాంక్, దేనా బ్యాంకు శాఖలన్నీ బీవోబీ శాఖలుగా పనిచేయనున్నాయి. ‘విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ ఖాతాదారులను ఏప్రిల్ 1 నుంచి బీవోబీ ఖాతాదారులుగా పరిగణించడం జరుగుతుంది’ అని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. మూలధనంపరంగా విలీన ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు బీవోబీకి రూ. 5,042 కోట్ల మేర అదనంగా నిధులివ్వాలని కేంద్రం గత వారం నిర్ణయం తీసుకుంది. విలీన ప్రతిపాదన ప్రకారం విజయా బ్యాంక్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు గాను బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అలాగే, దేనా బ్యాంక్ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 1,000 షేర్లకు బీవోబీ షేర్లు 110 లభిస్తాయి. ఈ మూడింటి విలీనంతో దేశీయంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రభుత్వ రంగంలోనిది), ఐసీఐసీఐ బ్యాంక్ (ప్రైవేట్ రంగంలోనిది) తర్వాత మూడో అతి పెద్ద బ్యాంకుగా బీవోబీ ఏర్పడుతుంది. దీని వ్యాపార పరిమాణం రూ. 14.82 లక్షల కోట్లుగాను, నికర మొండిబాకీల నిష్పత్తి 5.71గాను ఉంటుంది. ఈ విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గుతుంది. -
బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో కేంద్రానికి ఊరట లభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో విజయా బ్యాంక్, దేనాబ్యాంక్ విలీనాన్ని నిలుపుచేయాలని దాఖలైన పిటిషన్లను అతున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. న్యాయమూర్తి ఆర్ఎఫ్ నారీమన్, న్యాయమూర్తి వినీత్ శరణ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్, ఈ అంశంపై తక్షణం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇది పూర్తిగా ఆర్థికవిధానాలనకు సంబంధించిన అంశంగా పేర్కొంది. బ్యాంకుల తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తంగ్ వాదనలు వినిపించారు. మార్గదర్శకాల ప్రకారమే విలీన నిర్ణయం జరిగిందని తెలిపారు. మరోవైపు ఈ విలీన నిర్ణయాల్లో పలు తప్పులు జరిగాయని బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్ వాదించారు. విజయా, దేనా బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కానున్నాయి. దీనితో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ తర్వాత మూడవ అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించనుంది. కాగా ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్లు ఈ పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంకుల విలీనంతో ఉద్యోగాల కోత ఉండదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలకు నష్టం వాటిల్లదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు. ప్రభుత్వ రంగంలోని విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంకు ఆఫ్ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్ ఈ వారం మొదట్లో ఆమోదం తెలిపింది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో ఎస్బీఐ మాదిరిగా పెద్ద బ్యాంకు అవతరిస్తుందని జైట్లీ చెప్పారు. రుణాలపై వ్యయాలు కూడా తగ్గుతాయన్నారు. ప్రభుత్వ రంగంలోని 21 బ్యాంకులకు గాను 11 బ్యాంకులు ఆర్బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ పరిధిలో (పీసీఏ) ఉన్నట్టు లోక్‌సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా జైట్లీ చెప్పారు. అధిక ఎన్పీఏలతో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ పీసీఏను అమల్లోకి తెచ్చింది. రూ.3 లక్షల కోట్లను వ్యవస్థలోకి తిరిగి తీసుకొచ్చేందుకు దివాలా చట్టం సాయపడినట్టు మంత్రి తెలిపారు. ఎస్బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహణ పరంగా లాభాల్లోనే ఉన్నప్పటికీ, మొండి బకాయిలకు కేటాయింపులు చేయడం వల్లే నష్టాలను చవిచూస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల కోసం రూ.65,000 కోట్లను బడ్జెట్లో కేటాయిం చగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి రూ. 51,533 కోట్ల నిధుల సాయం చేసినట్టు తెలిపారు. -
మరో మెగా బ్యాంక్ రెడీ..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరో భారీ బ్యాంక్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారయ్యింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో ఉద్యోగుల సర్వీస్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, సిబ్బంది తొలగింపు చర్యలుండవని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు చెప్పారు. ‘ఈ విలీనంతో ఉద్యోగుల సర్వీస్ కండీషన్స్‌పై ప్రతికూల ప్రభావం ఉండదు. ] అలాగే, ఉద్యోగుల తొలగింపు చర్యలూ ఉండవు. కస్టమర్ల సంఖ్య పెరగడంతో పాటు మార్కెట్, నిర్వహణ సామర్థ్యాలు, పథకాల విస్తృతి, కస్టమర్లకు సేవలు గణనీయంగా మెరుగుపడతాయి. నెట్వర్క్, చౌక డిపాజిట్లు మొదలైనవి విలీన బ్యాంకుకు లాభిస్తాయి‘ అని ఆయన వివరించారు. అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా బీవోబీని తీర్చిదిద్దే లక్ష్యంతో 3 బ్యాంకుల విలీన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ మూడింటి విలీనం అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల సంఖ్య 19కి తగ్గుతుంది. విలీన స్కీమును ఈ శీతాకాల సమావేశాల్లోనే సభ్యుల పరిశీలనకు పార్లమెంటు ముందు 30 రోజులు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపా యి. ఈ సమావేశాలు జనవరి 8తో ముగుస్తాయి. ప్రభుత్వ రంగంలో రెండో పెద్ద బ్యాంక్.. విలీనానంతరం ఏర్పడే కొత్త బ్యాంక్ రూ.14.82 లక్షల కోట్ల వ్యాపార పరిమాణంతో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది. ప్రభుత్వ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకుగా నిలుస్తుంది. విలీన బ్యాంక్ నికర మొండిబకాయిల నిష్పత్తి 5.71% స్థాయిలో ఉండనుంది. మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల సగటు 12.13 శాతంగా ఉంది. ఇక క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి (సీఏఆర్) కూడా నియంత్రణ సంస్థ నిర్దేశిత 10.87 శాతం కన్నా అధికంగా 12.25 శాతం స్థాయిలో ఉంటుంది. అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనంతో ఎస్బీఐ ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా మారిన సంగతి తెలిసిందే. అదే కోవలో బీవోబీని కూడా మెగా బ్యాంక్‌గా తీర్చిదిద్దే ఉద్దేశంతో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను అందులో విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ప్రత్యామ్నాయ యంత్రాంగం గతేడాది సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. మైనారిటీ షేర్‌హోల్డర్ల అభ్యంతరాలేమైనా ఉంటే పరిష్కరించేందుకు ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రమోద్ కడే సారథ్యంలో ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. షేర్ల స్వాప్ నిష్పత్తి ఖరారు.. విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను విలీనం చేసుకోనున్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. తాజాగా షేర్ల మార్పిడి నిష్పత్తిని నిర్ణయించింది. విలీన ప్రతిపాదన ప్రకారం.. విజయ బ్యాంక్ షేర్హోల్డర్లకు సంబంధించి ప్రతి 1,000 షేర్లకు బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అటు దేనా బ్యాంక్ విషయానికొస్తే.. ప్రతి 1,000 షేర్లకు 110 బీవోబీ షేర్లు లభిస్తాయి. బీవోబీ, దేనా బ్యాంక్‌ల బోర్డులు షేర్ల స్వాప్ నిష్పత్తి ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశాయి. బుధవారం బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 3.16 శాతం క్షీణించి రూ. 119.40 వద్ద, దేనా బ్యాంక్ షేరు 0.28 శాతం క్షీణించి రూ.17.95 వద్ద ముగియగా.. విజయ బ్యాంక్ షేరు స్వల్పంగా 0.29 శాతం లాభపడి రూ. 51.05 వద్ద క్లోజయ్యింది. ఈ ధరల ప్రకారం చూస్తే.. దేనా బ్యాంక్ షేర్హోల్డర్లకు రూ.17,950 విలువ చేసే షేర్లకు బదులుగా రూ.13,134 విలువ చేసే బీవోబీ షేర్లు లభిస్తాయి. అలాగే విజయ బ్యాంక్ షేర్హోల్డర్లకు రూ.51,050 విలువ చేసే 1,000 షేర్లకు గాను రూ.47,998.80 విలువ చేసే బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. ఎగుమతి వర్తకులకు వడ్డీ రాయితీ.. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించే క్రమంలో ఎగుమతి వర్తకులకు 3 శాతం మేర వడ్డీ రాయితీ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.600 కోట్ల మేర వ్యయం కానుంది. దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా లఘు, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థల ఉత్పత్తులు, వ్యవసాయ, హస్తకళలు, జౌళి, తోలు, యంత్రపరికరాల సంస్థలు తయారు చేసే సుమారు 416 ఉత్పత్తులు ఈ పరిధిలోకి వస్తాయి. వడ్డీ రాయితీ స్కీములో ఎగుమతి వర్తకుల్ని కూడా చేర్చడంతో వారు మరింతగా ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రోత్సాహం లభించగలదని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా ఎంఎస్ఎంఈల్లో ఉత్పత్తి పెరిగి, మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. తయారీ ఎగుమతిదారుల కోసం 2015 ఏప్రిల్‌లో వడ్డీ రాయితీ పథకాన్ని అయిదేళ్ల వ్యవధికి కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే, ఇందులో వర్తక ఎగుమతిదారులకు చోటు కల్పించలేదు. తాజాగా వీరిని కూడా ఈ స్కీమ్‌లో చేర్చింది. రుణాలు తక్కువ వడ్డీకే లభించడం వల్ల ఎగుమతిదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భారతీయ ఎగు మతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. మరోవైపు, తయారీ ఎగుమతిదారుల తరహాలోనే ఎగుమతుల వృద్ధిలో కీలకపాత్ర పోషించే వర్తక ఎగుమతిదారులను కూడా ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉందని ఫరీదా గ్రూప్ చైర్మన్ రఫీక్ అహ్మద్ పేర్కొన్నారు. -
బీఓబీ, దేనా, విజయా బ్యాంకుల విలీనం..
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంక్‌ల విలీన ప్రక్రియకు సంబంధించిన స్కీమ్ ఈ నెలాఖరు కల్లా ఖరారు కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందు కూడా దీన్ని ఉంచే అవకాశం ఉందని వివరించాయి. జనవరి 8 దాకా ఈ సమావేశాలు జరగనున్నాయి. స్కీమ్‌పై ప్రస్తుతం కసరత్తు జరుగుతుండగా, తర్వాత మూడు బ్యాంకుల బోర్డులు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. షేర్ల మార్పిడి నిష్పత్తి, ప్రమోటరు సమకూర్చాల్సిన అదనపు మూలధనం వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విలీన బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కాగలవని ప్రభుత్వం భావిస్తోంది. రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో విలీన బ్యాంకు దేశీయంగా ప్రభుత్వ రంగ ఎస్బీఐ, ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ల తర్వాత మూడో స్థానంలో ఉండనుంది. -
మూడు బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఆమోద ముద్ర వేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా శుక్రవారం ఈ విషయం వెల్లడించింది. విలీన ప్రతిపాదనకు ఏఎం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం సమాచారమిచ్చిందని బీవోబీ తెలియజేసింది. అంతర్జాతీయ స్థాయిలో పటిష్టమైన బ్యాంక్ ఏర్పాటు దిశగా ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ఏఎం గతంలో నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ 29న బీవోబీ బోర్డు కూడా ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. మిగతా రెండు బ్యాంకుల బోర్డులు విలీన ప్రతిపాదనలకు ఇప్పటికే ఓకే చెప్పాయి. మూడు బ్యాంకుల విలీనంతో ఏర్పాటయ్యే కొత్త సంస్థ కార్యకలాపాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. విలీన బ్యాంకు వ్యాపార పరిమాణం దాదాపు రూ.14.82 లక్షల కోట్లుగా ఉంటుంది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత స్థానాన్ని ఇది దక్కించుకుంటుంది. విలీన బ్యాంక్ మొండిబాకీల నిష్పత్తి 5.71 శాతంగా ఉండనుంది. పీఎస్‌బీల సగటు 12.13 శాతం కన్నా ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. విలీన ప్రతిపాదనకు ఏఎం అనుమతుల నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో బీవోబీ షేరు .. 0.30 శాతం పెరిగి రూ. 115.20 వద్ద క్లోజయ్యింది. -
దీర్ఘకాలంలో మంచిదే.. కానీ..
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనంతో స్వల్పకాలికంగా మొండిబాకీలు ఎగియడం వంటి సవాళ్లు ఉంటాయని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. అయితే, దీర్ఘకాలంలో మాత్రం ఈ విలీనంతో ప్రయోజనాలు ఉండగలవని వివరించింది. ప్రతిపాదిత విలీనానికి లాంఛనంగా ఆమోదముద్ర వచ్చిన తర్వాత.. రేటింగ్‌ను మదింపు చేస్తామని ఇండియా రేటింగ్స్ తెలిపింది. దేనా బ్యాంక్‌కు తక్కువ మూలధన నిల్వలు ఉన్నప్పటికీ.. విజయా బ్యాంక్ వద్ద అధిక స్థాయిలో ఉన్నందున.. ఆ మేరకు సర్దుబాటు జరుగుతుందని పేర్కొంది. విలీన బ్యాంక్‌కు మాత్రం అదనంగా మూలధనం అవసరమవుతుందని వివరించింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన చూస్తే నిర్వహణ వ్యయాలు .. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం, రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు పటిష్టం కావడం వంటి సానుకూల ప్రయోజనాలు ఉంటాయని ఇండియా రేటింగ్స్ వివరించింది. మరిన్ని బ్యాంకులను విలీనం చేసుకోలేం... ప్రస్తుతం మరిన్ని బ్యాంకులను టేకోవర్ చేసే పరిస్థితిలో ఎస్బీఐ లేదని ఆ బ్యాంకు చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. అనుబంధ బ్యాంకుల విలీనంతో చేకూరిన ప్రయోజనాలు కనిపించడానికి కనీసం 2–3 సంవత్సరాలైనా పడుతుందని ఆయన వివరించారు. ఎస్బీఐకి 23 శాతం మార్కెట్ వాటా ఉందని, మరిన్ని బ్యాంకులను చేర్చుకోవడం వల్ల గుత్తాధిపత్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని రజనీష్ కుమార్ తెలిపారు. అయితే, మెరుగైన నిర్వహణ కోసం విలీనాల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం మాత్రం ఉందన్నారు. -
మరో మెగా బ్యాంకు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాటలోనే మరో మెగా బ్యాంకు ఏర్పాటుకు కేంద్రం తెరతీసింది. రుణ వృద్ధి, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే దిశగా మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు..బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌లను విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో.. మొత్తం రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్ ఏర్పాటు కానుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఈ విషయం ప్రకటించారు. ఈ విలీనంతో బ్యాంకులు మరింత పటిష్టంగా మారడంతో పాటు రుణ వితరణ సామర్థ్యాన్ని కూడా పెంచుకోగలవని చెప్పారు. పెరుగుతున్న మొండిబాకీలతో చాలా బ్యాంకులు దుర్బలంగా మారాయని జైట్లీ చెప్పారు. ‘‘బ్యాంకుల రుణ వితరణ కార్యకలాపాలు బలహీనపడ్డాయి. దీంతో కార్పొరేట్ పెట్టుబడులు కూడా దెబ్బతింటున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మూడు బ్యాంకుల విలీనంతో ఏర్పడే సంస్థతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలుంటాయి’’ అని ఆయన వివరించారు. నాలుగు నుంచి ఆరు నెలల్లోగా విలీన ప్రక్రియ పూర్తి కావొచ్చని బీవోబీ సీఈవో పీఎస్ జయకుమార్ అభిప్రాయపడ్డారు. అయిదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా విలీనం చేసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపర్చేందుకే.. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యల అధ్యయనానికి జైట్లీ సారథ్యంలో ఏర్పాటైన ప్రత్యామ్నాయ యంత్రాంగం ఈ మేరకు సిఫార్సు చేసింది. విలీన ప్రతిపాదనను పరిశీలించాలంటూ మూడు బ్యాంకుల బోర్డులకు సూచించినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ‘ఆయా బ్యాంకులు నిర్వహణ సామర్థ్యాన్ని, కస్టమర్ సేవలను మెరుగుపర్చుకోవడానికి ఈ విలీనం తోడ్పడుతుంది. విలీన సంస్థ దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంకుగా ఆవిర్భవిస్తుంది. నెట్వర్క్, చౌక డిపాజిట్లు, అనుబంధ సంస్థల పరంగా ఈ మూడింటికి సానుకూలాంశాలు ఉన్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలు, బ్రాండ్ ఈక్విటీకి పరిరక్షణ ఉంటుంది’’ అని కుమార్ వివరించారు. విలీన సంస్థకు ప్రభుత్వం నుంచి మూలధనపరమైన మద్దతు కొనసాగుతుందని ఆయన చెప్పారు. విలీనానంతరం కూడా మూడు బ్యాంకులు స్వతంత్రంగానే కొనసాగుతాయన్నారు. ‘విలీన ప్రక్రియ పూర్తి కావడానికి ఎన్నాళ్లు పడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ గత విధానాలను, అనుభవాలను బట్టి చూస్తే.. 4–6 నెలలు పట్టొచ్చు. పరిస్థితిని బట్టి మరింత వేగంగా కూడా పూర్తి కావొచ్చు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు. 5.71 శాతం ఎన్పీఏలు.. మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) ఎదుర్కొంటున్న బ్యాంకుల్లో దేనా బ్యాంక్ కూడా ఉంది. దీంతో దేనా రుణ కార్యకలాపాలపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ప్రకటించిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విజయ బ్యాంకు కూడా ఒకటి కావడం గమనార్హం. విలీన బ్యాంకు నికర మొండిబాకీలు 5.71 శాతం మేర ఉండనున్నాయి. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 12.25 శాతంగాను, టియర్1 క్యాపిటల్ 9.32 శాతంగాను ఉంటుంది. విలీన బ్యాంకుకు మొత్తం 9,500 శాఖలుంటాయి. ’మొండి’ పీఎస్‌బీలు .. దేశీయంగా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఉండగా.. వీటిలో ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది. ఇక దేశీ బ్యాంకింగ్ రంగంలో మూడింట రెండొంతుల వాటా పీఎస్‌బీలదే ఉంటోంది. అలాగే, బ్యాంకింగ్ రంగాన్ని పట్టి పీడిస్తున్న మొండిబాకీల్లో కూడా వీటి వాటా భారీగా ఉంది. దీంతో అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలను అందుకునేందుకు వచ్చే రెండేళ్లలో ఈ బ్యాంకులు కోట్ల కొద్దీ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సి వస్తోంది. పురోగామి చర్య: ఫిక్కీ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పురోగామి చర్యగా పరిశ్రమవర్గాలు అభివర్ణించాయి. బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనంగా ఉంటుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ రశేష్ షా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి.. పటిష్టమైన బ్యాంకింగ్ రంగం అత్యంత అవసరమని, ఈ దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మెగా మెర్జర్ : మూడు బ్యాంకులు విలీనం
సాక్షి, న్యూఢిల్లీ: ఎనలిస్టులు అంచనా వేసినట్టుగానే మెగా మెర్జర్‌కు కీలక అడుగు పడింది. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన మేరకు దెనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు విలీనానికి సర్వం సిద్దమైంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ సోమవారం వెల్లడించారు. ఈ మూడు బ్యాంకుల విలీనం అనంతరం దేశంలోని మూడవ అతిపెద్ద బ్యాంక్‌గా విలీన బ్యాంకు అవతరించనుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో విదేశీ కార్యకలాపాల హేతుబద్ధత బాగా పుంజుకుందని చెప్పారు. బ్యాంకుల క్యాపిటల్ అవసరాలపై ప్రభుత్వం శ్రద్ధ వహించడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఈ విలీన ప్రక్రియలో ఈ మూడు బ్యాంకుల ఉద్యోగుల భద్రతను కాపాడతామన్నారు. ఈ సందర్భంగా ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం సందర్భంగా ఎలాంటి ఉద్యోగ నష్టం జరగ లేదని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా విలీన ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఈ మూడు బ్యాంకులు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అనంతరం ఈ విలీన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వివరించారు. ఇప్పటికే బలహీనంగా ఉన్నబ్యాంకులను విలీనం చేయడం కాకుండా , రెండు విజయవంతమైన బ్యాంకుల విలీనం ద్వారా మరో దృఢమైన అతిపెద్ద బ్యాంకును అందుబాటులోకి తేనున్నామని, ఈ విలీన బ్యాంకుకు మూలధన మద్దతును కూడా అందిస్తామని తెలిపారు. దీనిపై ఆయా బ్యాంకుల బోర్డుల తుది ఆమోదం తర్వాత విలీనం అమల్లోకి వస్తుందని చెప్పారు. అలాగే మూడు బ్యాంకులకు చెందిన ఉద్యోగలు, ఖాతాదారుల భద్రతపై పూర్తి హామీ ఇచ్చారు. -
బ్యాంక్ మేనేజర్‌కు జైలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకును మోసగించిన కేసులో హైదరాబాద్ అమీర్‌పేటలోని విజయా బ్యాంకు మేనేజర్ కె.దేవేందర్‌రావు, మరోవ్యక్తి ఎం.వెంకటేశ్వరరావుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోర్టు అదనపు ప్రత్యేక జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంక్ మేనేజర్ ఫోర్జరీ సంతకాలు, బోగస్ పత్రాల ఆధారంగా 12 మందికి ఇళ్ల రుణాలు మంజూరు చేశారు. రుణాల నిమిత్తం ఇచ్చిన బ్యాంక్ డ్రాఫ్ట్‌లను నగదుగా మార్పు చేసి రుణాలు పొందిన వారికి ఆ మొత్తాలను అందజేయడంలో వెంకటేశ్వరరావు సహకరించారు. ఫలితంగా బ్యాంకుకు రూ.90 లక్షలు నష్టం వచ్చిందంటూ 2006 జనవరి 4న సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ అనంతరం సీబీఐ కోర్టు బ్యాంక్ మేనేజర్ దేవేందర్‌రావు, వెంకటేశ్వరరావుకు ఐదేళ్ల కఠిన కారాగారం తోపాటుగా వీరిద్దరికీ వరుసగా రూ.3 లక్షలు, రూ.1.5లక్షల జరిమానాను విధించింది. అది చెల్లించకపోతే 6 నెలలు సాధారణ జైలు గడపాలని పేర్కొంటూ; 17 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. -
విజయా బ్యాంక్‌తో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఒప్పందం
న్యూఢిల్లీ: బీమా సంస్థ హెచ్డీఎఫ్సీ లైఫ్ విజయా బ్యాంక్ ద్వారా తన సేవలను మరింత విస్తరించనుంది. దేశవ్యాప్తంగా 2,129 శాఖలను కలిగిన విజయా బ్యాంక్ తమ ఖాతాదారులకు హెచ్డీఎఫ్సీ బీమా సేవలను అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు విజయా బ్యాంక్ సీఈఓ ఆర్ఏ శంకర నారాయణన్ చెప్పారు. దీర్ఘకాలంలో ఇరు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
విజయ బ్యాంక్ లాభం 43% డౌన్
న్యూఢిల్లీ: మొండిబాకీల పరిస్థితి మెరుగుపడినప్పటికీ... ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2018–19, క్యూ1)లో ప్రభుత్వ రంగ విజయ బ్యాంక్ నికర లాభం 43 శాతం మేర క్షీణించింది. క్యూ1లో రూ.144.34 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ1లో ఇది రూ.254.69 కోట్లు. తాజాగా తొలి త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 3,510 కోట్ల నుంచి రూ. 3,936 కోట్లకు పెరిగింది. మొండిబాకీలు మొదలైన వాటికి ప్రొవిజనింగ్ ఏకంగా రూ. 423 కోట్ల నుంచి రూ. 659 కోట్లకు పెరిగింది. ఇందులో నికార్సుగా ఎన్పీఏల కోసం కేటాయించినది రూ.548 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో వీటికి ప్రొవిజనింగ్ రూ.411 కోట్లు. మరోవైపు, జూన్ త్రైమాసికంలో స్థూల మొండిబాకీలు 7.3 శాతం నుంచి 6.19 శాతానికి, నికర ఎన్పీఏలు 5.24 శాతం నుంచి 4.10 శాతానికి తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో విజయా బ్యాంకు షేరు సుమారు 5 శాతం పెరిగి రూ. 52.15 వద్ద ముగిసింది. -
విజయా బ్యాంక్ లాభం రూ.207 కోట్లు
న్యూఢిల్లీ: విజయా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.207 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.204 కోట్ల నికర లాభం వచ్చిందని, 2% వృద్ధి సాధించామని బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,505 కోట్ల నుంచి రూ.3,728 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.345 కోట్ల నుంచి రూ.553 కోట్లకు పెరిగాయి. ఒక్కో షేర్‌కు రూ.1.20 డివిడెండ్‌ను బ్యాంకు ప్రకటించింది. తగ్గిన మొండి బకాయిలు... ఇక 2016–17లో రూ.750 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.727 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.14,031 కోట్ల నుంచి రూ.14,190 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 6.59 శాతం నుంచి 6.34 శాతానికి, నికర మొండి బకాయిలు 4.36 శాతం నుంచి 4.32 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో విజయా బ్యాంక్ షేర్ 2% లాభంతో రూ.61 వద్ద ముగిసింది. -
విజయా బ్యాంకు ఫలితాలు ఒకే!
సాక్షి, ముంబై: విజయ బ్యాంకు క్యూ4లో నష్టాలనుంచి కోలుకుని మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. గతేడాది(2017-18) చివరి త్రైమాసికంలో విజయా బ్యాంకు నికర లాభం స్వల్పంగా 1.6శాతం పుంజుకుని రూ. 207 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 3,728 కోట్లకు పెరింగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో విజయా బ్యాంకు వెల్లడించింది. గత ఏడాది ఇది 3504 కోట్ల రూపాయలుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) కూడా 21 శాతం పుంజుకుని రూ. 1196 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు రూ. 345 కోట్ల నుంచి రూ. 553 కోట్లకు ఎగశాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.17 శాతం నుంచి 6.34 శాతానికి స్వల్పంగా పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 3.99 శాతం నుంచి 4.32 శాతానికి పెరిగాయి. మరోవైపు ప్రతి ఈక్విటీ షేరుకు 1.20 రూపాయల డివిడెండ్ చెల్లించాలని బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించారని కంపెనీ వెల్లడించింది. ఈ ఫలితాల నేపథ్యంలో విజయా బ్యాంకు షేరు 2శాతం లాభపడి 61 రూపాయల వద్ద ముగిసింది. -
టీటీడీలో డిపాజిట్ల గోల్మాల్
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో డిపాజిట్ల గోల్మాల్ బయటపబడింది. నిబంధనలకు విరుద్ధంగా రూ. 4 వేల కోట్లను టీటీడీ ఆర్థికశాఖ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. సీల్డ్ కవర్ టెండర్లను ఆహ్వానించకుండా, అధికారులు ఫోన్‌తో సంప్రదింపులు జరిపారని సమాచారం. 7.66 శాతం వడ్డీ పేరుతో ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో వెయ్యి కోట్లు డిపాజిట్ చేశారు. అంతే కాకుండా 7.33 శాతం వడ్డీ ఇస్తామన్న విజయాబ్యాంక్‌ని కాదని 7.32 శాతానికి ఆంధ్రా బ్యాంకును ఒప్పించిన టీటీడీ అధికారులు రూ. 3 వేల కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీంతో టీటీడీలో జరిగిన ఈ గోల్‌మాల్‌పై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఘటనపై ఇంటిలెన్స్ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. -
నకిలీ ధృవపత్రాల కేసు.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్ : నకిలీ ధృవపత్రాల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. నారాయణగూడ విజయ బ్యాంక్‌ను మోసం చేసిన ఐదుగురు దోషులకు ఐదేళ్ల చొప్పున శిక్షలను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది. విజయ బ్యాంక్ మేనేజర్ రాజగోపాల్‌రెడ్డితోపాటు ఉదయ్ శంకర్, రామంజిరావు, సాయి సీతారాం, అబ్బరాజు వెంకటసుబ్బారావులు నకిలీ పత్రాలతో బ్యాంకుకు కోటి రూపాయలు టోకరా వేసినట్లు ఆరోపణలు ఎదుర్కున్నారు. అవి రుజువైనందున సీబీఐ కోర్టు ఈ తీర్పును ఖరారు చేసింది. -
ఏలూరులో తీవ్ర కలకలం
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని అంబికా కెమికల్ ప్రొడక్ట్స్ సంస్థను సీజ్ చేయటానికి విజయ బ్యాంకు అధికారులు రావడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ ఏలూరు మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అంబికా కృష్ణకు చెందిన అంబికా కెమికల్ ప్రొడక్ట్స్ కంపెనీ చెన్నైలోని విజయా బ్యాంకుకు భారీగా బకాయి పడ్డారని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లింపులు చేయకపోవడంతో చెన్నై విజయా బ్యాంకు అదనపు జీఎం రాధాకృష్ణ నేతృత్వంలోని బ్యాంకు అధికారుల బృందం ఫ్యాక్టరీని సీజ్ చేయడానికి ఏలూరు వచ్చారు. బకాయిలపై ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపి రేపటి వరకు గడువు ఇచ్చారు. ఈనెల 18వ తేదీలోపు బకాయిలు చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు జప్తు ఆలోచనను తాత్కాలికంగా విరమించుకుని బ్యాంకు అధికారులు వెనుదిరిగారు. అంబికా గ్రూపు సంస్థలను అంబికా కృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. విజయా బ్యాంకుకు అంబికా సంస్ధలు దాదాపుగా రూ. 28 కోట్ల వరకు బకాయిలు పడ్డట్టు సమాచారం. బకాయిల వ్యవహారంపై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించలేదు. -
విజయా బ్యాంక్ లాభం 20% అప్
న్యూఢిల్లీ: విజయా బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 20 శాతం పెరిగింది. అంతే కాకుండా మొండి బకాయిలు తగ్గి రుణ నాణ్యత మెరుగుపడింది. అయితే మొత్తం ఆదాయం స్వల్పంగా తగ్గగా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ2లో రూ.155 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.185 కోట్లకు పెరిగిందని విజయా బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,517 కోట్ల నుంచి రూ.3,501 కోట్లకు పడిపోయింది. మొత్తం వ్యయాలు రూ.2,946 కోట్ల నుంచి 6 శాతం తగ్గి రూ.2,767 కోట్లకు చేరుకున్నాయి. స్థూల మొండి బకాయిలు రూ.6,812 కోట్ల నుంచి రూ.6,649 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.4,784 కోట్ల నుంచి రూ.4,473 కోట్లకు తగ్గాయని బ్యాంకు తెలియజేసింది. శాతాల పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 7.07 శాతం నుంచి 7.06 శాతానికి, నికర మొండి బకాయిలు 5.1 శాతం నుంచి 4.86 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం రూ.828 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.1,008 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 2.93 శాతం నుంచి 3.04 శాతానికి పెరిగిందని, కేటాయింపులు కూడా పెరిగాయని బ్యాంకు వివరించింది. గతేడాది క్యూ2లో రూ.390 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ2లో రూ.458 కోట్లకు ఎగిశాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో విజయా బ్యాంక్ షేర్ గురువారం తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. బుధవారం రూ.66 వద్ద ముగిసిన ఈ షేర్ గురువారం రూ.62, రూ.70 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. చివరకు 4 శాతం లాభంతో రూ.63 వద్ద ముగిసింది. -
విజయాబ్యాంకు లాభం 3 రెట్లు
విజయ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మూడు రెట్లదాకా పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.71 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.204 కోట్లకు పెరిగిందని బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.3,228 కోట్ల నుంచి రూ.3,505 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.8,305 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో 23 శాతం తగ్గి రూ.6,382 కోట్లకు చేరాయి. కేటాయింపులు 34 శాతం క్షీణించి రూ.553 కోట్లకు తగ్గాయి. ఒక్కో షేర్‌కు రూ.1.50(15 శాతం) డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. మెరుగుపడిన రుణ నాణ్యత..: ఇక 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.382 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపై రూ.750 కోట్లకు పెరిగింది. కేటాయింపులు తక్కువగా ఉండడం, ఇతర ఆదాయం అధికంగా రావడం వంటి కారణాల వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. -
విజయా బ్యాంక్ లాభం 4 రెట్లు అప్
క్యూ3లో రూ.230 కోట్లు.. బెంగళూరు: విజయా బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో నాలుగు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.53 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.230 కోట్లకు పెరిగిందని విజయా బ్యాంక్ తెలిపింది. ట్రేడింగ్ లాభాలు అధికంగా ఉండటం, రిటైల్ రుణాలు 22 శాతం వృద్ధి చెందడం తదితర కారణాల వల్ల ఈ స్థాయి నికర లాభం సాధించామని విజయా బ్యాంక్ ఈడీ, బి.ఎస్. రామారావు చెప్పారు. మొత్తం ఆదాయం రూ.3,237 కోట్ల నుంచి రూ.3,714 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు 4.32 శాతం నుంచి 6.98 శాతానికి, నికర మొండి బకాయిలు 2.98 శాతం నుంచి 4.74 శాతానికి పెరిగాయని తెలిపారు. ఫలితంగా మొండి బకాయిలకు కేటాయింపులు రూ.279 కోట్ల నుంచి రూ.424 కోట్లకు పెంచామని పేర్కొన్నారు. నికర లాభం జోరుతో బీఎస్ఈలో విజయ బ్యాంక్ షేర్ 20 శాతం పెరిగి రూ.64 వద్ద ముగిసింది. ఇది ఏడాది గరిష్ట స్థాయి. -
విజయా బ్యాంకు లాభంలో 34 శాతం వృద్ధి
హైదరాబాద్: ప్రభుత్వ రంగ విజయా బ్యాంకు జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే 34% వృద్ధితో రూ.154.5 కోట్లుగా నమోదైంది. బ్యాంకు మొత్తం వ్యాపారం గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2,10,312 కోట్లు ఉండగా, అది తాజాగా రూ.2,19,606 కోట్లకు వృద్ధి చెందినట్టు బ్యాంకు డిప్యూటీ జీఎం, హైదరాబాద్ రీజినల్ హెడ్ కె.సత్యనారాయణరాజు వెల్లడించారు. డిపాజిట్లు 3.65%, రుణాలు 5.51% పెరిగినట్టు చెప్పారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలో డిపాజిట్లు రూ.3,854 కోట్లు, రుణాలు రూ.5,151 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రాధాన్య రుణాలు రూ.1,410 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. విజయా బ్యాంకు ఏటీఎం ద్వారా చేసే ప్రతీ లావాదేవీపై 50 పైసలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వినియోగించనున్నట్టు తెలిపారు. -
12 నుంచి శ్రీవారి ఆర్జిత సేవల పునరుద్ధరణ
- విజయా బ్యాంకులో టికెట్ల కేటాయింపు - చంటి బిడ్డ తల్లిదండ్రులు, వికలాంగులు, వృద్ధులకూ సుపథం ప్రవేశం - ఈవో, జేఈవో వెల్లడి తిరుమల: తిరుమల ఆలయంలో శ్రీవారి ఆర్జిత సేవలు బుధవారం పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 11వ తేదీ మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగియనున్నాయి. ఈ తొమ్మిది రోజులూ అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశారు. మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు ముగియనున్నాయి. ఆ తర్వాత బుధవారం నుండి ఆలయంలో ఆయా రోజుల్లో నిర్వహించే ఆర్జిత సేవలు యథావిధిగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుండే ఇక్కడి విజయాబ్యాంకులో అందుబాటులోని వివిధ ఆర్జిత సేవా టికెట్లు భక్తులు పొందవచ్చు. ఇక్కడే లక్కీడిప్ కింద కేటాయించే టికెట్లు కూడా మంగళవారం నుండే విజయా బ్యాంకులో కేటాయించనున్నారు. ఇప్పటికే ఇంటెర్నెట్ ద్వారా ముందస్తు రిజర్వు చేసుకున్న ఆర్జిత సేవా గృహస్తులు యథావిధిగా ఆయా సేవల్లో స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే వికలాంగులు, వృద్ధులు, చంటి బిడ్ద తల్లిదండ్రులకు సుపథం ప్రవేశ మార్గంలో బుధవారం నుంచి పునః ప్రారంభించి శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. -
రైతు రుణాలే ప్రాధాన్యం
-
రైతు రుణాలే ప్రాధాన్యం
పెందుర్తి, భోగాపురంలో విజయా బ్యాంకు కొత్త శాఖలు విశాఖపట్నం: విజయా బ్యాంక్ కొత్తగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏర్పాటు చేసిన రెండు బ్రాంచ్‌లను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్.రామారావు సోమవారం ప్రారంభించారు. విశాఖ జిల్లా పెందుర్తి, విజయనగరం జిల్లా భోగాపురంలోని ఈ శాఖల్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతుల అవసరాలకు తగ్గట్టు రుణ సదుపాయాలు కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం తమ బ్యాంకు ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రామీణుల కోసం, ముఖ్యంగా రైతు కుటుంబాల అభివృద్ధి కోసమే 1931లో బ్యాంకును స్థాపించారని చెప్పారు. బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 189 బ్రాంచీలు, 162 ఏటీఎం కేంద్రాలున్నాయి. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రూ.8,847 కోట్ల వ్యాపారం చేసినట్లు చెప్పారు. 21 లక్షల మంది ఖాతాదారులను 3 ప్రధాన సాంఘిక సంక్షేమ పథకాల్లో (ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన) చేర్చినట్లు చెప్పారు. సామాజిక బాధ్యతగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు పి.శ్రీనివాసరెడ్డి, వై.మురళీకృష్ణ, బి.రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయ బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం
ఉండి : కోలమూరు విజయబ్యాంకును దోచుకునేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కోలమూరులోని విజయబ్యాంకులో శుక్రవారం రాత్రి దొంగలు దోపిడీకి యత్నించారు. బ్యాంకు వెనక వైపున ఉన్న కిటికీని బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించేందకు యత్నించారు. వీలుకాకపోవడంతో వదిలి వెళ్లిపోయారు. శనివారం బ్యాంకు మేనేజర్ తిర్కువల్లూరి మోహ¯Œæలక్షీ్మనారాయణ కిటీకీలు బద్దలు కొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఈ బ్యాంకు సమీపంలోనే ఉన్న ఉండి కో–ఆపరేటివ్ రూరల్ బ్యాంకు బ్రాంచి పక్క ఇంటిలో దుండగులు రూ.45వేల విలువైన బంగారువస్తువులు దోచుకెళ్లారు. దీంతో ఇంటి యజమానురాలు పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎం.రవివర్మ తెలిపారు. -
విజయ బ్యాంక్ లాభం 26 శాతం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని విజయ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 26 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.97 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2015-16) క్యూ4లో రూ.71 కోట్లకు తగ్గిందని విజయ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,408 కోట్ల నుంచి రూ.3,228 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.382 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.439 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.13,152 కోట్ల నుంచి రూ.12,957 కోట్లకు తగ్గాయని వివరించింది. స్థూల మొండి బకాయిలు 2.78 శాతం నుంచి 6.64 శాతానికి, నికర మొండి బకాయిలు 1.92 శాతం నుంచి 4.81 శాతానికి పెరిగాయని విజయ బ్యాంక్ వెల్లడించింది. -
డిపాజిట్ రేటు తగ్గించిన విజయాబ్యాంక్
ఇదే బాటన యాక్సిస్ బ్యాంక్ బెంగళూరు: ప్రభుత్వ రంగ విజయాబ్యాంక్ డిపాజిట్లపై వడ్డీరేటును పావుశాతం తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) విధానాన్ని ఏప్రిల్ 1 నుంచీ అమలు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా బ్యాంక్ డిపాజిట్ రేటును సవరించింది. 91 రోజుల నుంచి ఐదేళ్లపైన మెచ్యూరిటీల వరకూ కొత్త డిపాజిట్ రేట్లు ఏప్రిల్ 12 నుంచీ అమలవుతాయని తెలిపింది. ఏడాది మెచ్యూరిటీపై ఆకర్షణీయమైన 7.5 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నట్లు కూడా బ్యాంక్ తెలిపింది. రుణ రేటును తన పోటీ బ్యాంకులకు అనుగుణంగా తగ్గించినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఎంసీఎల్ఆర్కు అనుగుణంగా ఓవర్‌నైట్ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు పేర్కొంటూ... దీనితో రుణ రేటు 8.95 శాతానికి తగ్గినట్లు తెలిపింది. తాజా 15 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఏప్రిల్ 18 నుంచీ అమల్లోకి వస్తుందని తెలిపింది. బ్యాంక్ తన బేస్ రుణ రేటు కూడా 0.05 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.45 శాతం తగ్గింది. -
నకిలీనోట్లతో బ్యాంకుకు వెళ్లిన మహిళ
పెద్దేముల్ (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ విజయా బ్యాంకులో ఒక మహిళ తన అకౌంట్లో జమచేసేందుకు నకిలీ నోట్లు తీసుకురావడంతో బ్యాంకు సిబ్బంది కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పెద్దేముల్లో పాలిష్ కంపెనీలో పనిచేస్తున్న అలివేలు అనే మహిళ తన అకౌంట్లో జమ చేసేందుకు రూ. 40 వేలు విలువైన వెయ్యిరూపాయల నోట్లు తెచ్చింది. వాటిని పరిశీలించిన బ్యాంకు అధికారులు అవి నకిలీవని గుర్తించారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు తాను పనిచేసే యజమాని ఈ నోట్లు ఇచ్చాడని అలివేలమ్మ పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయాబ్యాంక్ బేస్ రేటు కోత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని విజయాబ్యాంక్ కనీస (బేస్) రుణ రేటు స్వల్పంగా 0.15 శాతం తగ్గింది. దీనితో ఈ రేటు 10 శాతం నుంచి 9.85 శాతానికి చేరింది. బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో బ్యాంక్ ఈ విషయాన్ని తెలియజేసింది. సెప్టెంబర్ 4 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీ రేటు- రెపో ఈ ఏడాది ముప్పావు శాతం తగ్గింది (ప్రస్తుతం 7.25 శాతం). ఈ ప్రయోజనంలో దాదాపు సగ భాగాన్ని ఇప్పటికే పలు బ్యాంకులు ‘బేస్ రేటు’ తగ్గింపు రూపంలో కస్టమర్లకు బదలాయించాయి. బేస్ రేటు తగ్గింపు వల్ల దానికి అనుసంధానమయ్యే గృహ, వాహన, విద్యా రుణాలపై నెలవారీ చెల్లింపుల భారం తగ్గుతుంది. తదుపరి రెపో కోత ప్రకటించాలంటే... మొదట ఈ ఏడాది తగ్గించిన రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు పూర్తిగా బదలాయించాలని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదేపదే చెబుతున్నారు. కాగా కొన్ని బ్యాంకులు రుణ రేటు తగ్గింపునకు మార్గం సుగమం చేసుకుంటూ ‘మార్జిన్లు కాపాడుకోవడం ప్రధాన లక్ష్యంగా’ తొలుత డిపాజిట్ రేటు తగ్గింపుపైనా కసరత్తు చేస్తున్నాయి. -
బ్యాంక్ స్ట్రీట్... క్యూ1పై మొండి బకాయిల భారం!
దాదాపు ఆరు బ్యాంకులు గురువారం తమ క్యూ1 ఫలితాలను ప్రకటించగా, ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ మాత్రమే నికర లాభంలో వృద్ధి నమోదు చేసింది. దీని నికర లాభం రూ.74 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.94 కోట్లకు పెరిగింది. మిగిలిన బ్యాంకులపై మొండిబకా యిల భారం పడింది. వివరాలివీ... బ్యాంక్ ఆఫ్ బరోడా... ‘జన’ ఖాతాలకు కొత్త సంస్థ న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,052 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.1,362 కోట్లు)తో పోలిస్తే 23 శాతం క్షీణిత నమోదైందని బ్యాంక్ తెలిపింది. వేతన సవరింపు, మొండి బకాయిలకు అధిక కేటాయింపులు, ట్రెజరీ ఆదాయం పడిపోవడం వంటి కారణాల వల్ల నికర లాభం క్షీణించిందని బ్యాంక్ సీఈఓ రంజన్ ధావన్ చెప్పారు. గత క్యూ1లో రూ.11,683 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.12,244 కోట్లకు పెరిగిందని వివరించారు. స్థూల మొండి బకాయిలు 3.11 శాతం నుంచి 4.13 శాతానికి, నికర మొండి బకాయిలు 1.58 శాతం నుంచి 2.07 శాతానికి పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది టైర్ వన్, టైర్ టూ బాండ్ల ద్వారా రూ4,000-5,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నామని చెప్పారు. జనధన యోజన కింద ప్రారంభించిన బ్యాంక్ ఖాతాల నిర్వహణ కోసం అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం పొందామని, ఈ సంస్థ చెల్లింపు, సూక్ష్మ రుణ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు.ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంక్ షేర్ 10 శాతం వృద్ధితో రూ.169కి ఎగసింది. విజయ బ్యాంక్... కేటాయింపులతో కుదేల్ న్యూఢిల్లీ: విజయ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 12 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.161 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.143 కోట్లకు తగ్గిందని విజయ బ్యాంక్ పేర్కొంది. మొండి బకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.3,190 కోట్ల నుంచి రూ.3,289 కోట్లకు పెరిగిందని వివరించింది. స్థూల మొండి బకాయిలు 2.68 శాతం నుంచి 3.39 శాతానికి, అలాగే నికర మొండి బకాయిలు 1.77% నుంచి 2.45 శాతానికి పెరిగాయని పేర్కొంది. ఫలితాల నేపధ్యంలో బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 2% వృద్ధితో రూ.40కు పెరిగింది. ఓబీసీ.. ఆదాయమూ తగ్గింది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 29 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.365 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.258 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.5,576 కోట్ల నుంచి రూ.5,569 కోట్లకు పడిపోయింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.478 కోట్ల నుంచి రూ.596 కోట్లకు పెరిగాయి. స్థూల మొండి బకాయిలు 4.33 శాతం (రూ.5,983 కోట్ల)నుంచి 5.85(రూ.8,577 కోట్లు), నికర మొండి బకాయిలు 3.11 శాతం నుంచి 3.76 శాతానికి (4,228 కోట్ల నుంచి 5,358 కోట్లకు) పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం రూ.1,243 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.1,329 కోట్లకు వృద్ధి చెందింది. ఫలితాల నేపథ్యలో ఈ బ్యాంక్ షేర్లు బీఎస్ఈలో 4 శాతం వృద్ధితో రూ.164 వద్ద ముగిశాయి. 81 శాతం పడిన దేనా బ్యాంక్ లాభం గత క్యూ1లో రూ.82 కోట్లుగా ఉన్న దేనా బ్యాంక్ నికర లాభం ఈ క్యూ1లో 81 శాతం తగ్గి, రూ.15 కోట్లకు పడిపోయింది. మొండి బకాయిలు బాగా పెరగడమే దీనికి కారణమని బ్యాంక్ తెలిపింది. ఆదాయం రూ.2,825 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.2,915 కోట్లకు, స్థూ మొండి బకాయిలు 4.21 శాతం నుంచి 6.2 శాతానికి, నికర మొండి బకాయిలు 2.94 శాతం నుంచి 4.24 శాతానికి, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.228 కోట్ల నుంచి రూ.325 కోట్లకు పెరిగాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాం షేర్ 4 శాతం లాభపడి రూ.44 వద్ద ముగిసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్... ఐఎన్జీ వైశ్యా ఎఫెక్ట్ ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 26 శాతం క్షీణించి రూ.517 కోట్లకు తగ్గింది. ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీనం తర్వాత కోటక్ బ్యాంక్ వెలువరించిన తొలి ఆర్థిక ఫలితాలు ఇవి. ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ నిరర్థక ఆస్తులు, ఆ బ్యాంక్ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. స్డాండోలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.429 కోట్ల నుంచి రూ.190 కోట్లకు పడిపోయిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్మన్, ఎండీ, ఉదయ్ కోటక్ వెల్లడించారు. -
విస్తరణపై విజయా బ్యాంక్ దృష్టి
సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాల్లో కార్యకలాపాలు ♦ ఉత్తరాదిలో మరో 2 రీజనల్ శాఖలు ♦ ఈ ఏడాది వ్యాపారంలో 14% వ్యాపార వృద్ధి లక్ష్యం ♦ క్యూ3లో రూ. 500 కోట్ల క్విప్ ఇష్యూ ♦ బ్యాంక్ ఎండీ, సీఈవో కిషోర్ సాన్సే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగానూ, విదేశాల్లోనూ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నట్లు ప్రభుత్వరంగ విజయా బ్యాంక్ ప్రకటించింది. సింగపూర్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర మధ్యప్రాచ్య దేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆర్బీఐ అనుమతి కోరినట్లు విజయా బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో కిషోర్ సాన్సే తెలిపారు. ఈ అనుమతులు రావడానికి 12 నుంచి 15 నెలల సమయం పడుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాన్సే మాట్లాడుతూ దక్షిణాది బ్యాంక్ ముద్రను చెరిపేసుకొని పాన్ ఇండియా విస్తరణపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రానున్న తొమ్మిది నెలల్లో ఉత్తర భారత దేశంలో కొత్తగా రెండు రీజినల్ ఆఫీసులను ప్రారంభించడంతో పాటు కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన మూడు నెలల కొత్తగా 74 శాఖలను ఏర్పాటు చేయగా వచ్చే తొమ్మిది నెలల్లో మరో 150 శాఖలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. దీంతో వచ్చే మార్చినాటికి మొత్తం శాఖల సంఖ్య 1,627 నుంచి 1,840కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ శివార్లలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు శాఖలను సాన్సే శనివారం ప్రారంభించనున్నారు. 14 శాతం వృద్ధి లక్ష్యం ఈ ఏడాది వ్యాపారంలో 14 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు విజయా బ్యాంక్ తెలిపింది. మార్చినాటికి బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ. 2.14 లక్షల కోట్లుగా ఉంది. ఇంకా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోకపోవడంతో రుణాల మంజూ రులో ఆచితూచి అడుగులు వేస్తున్నామని, ప్రధానంగా రిటైల్, వ్యవసాయ రుణాలపై దృష్టిసారిస్తున్నట్లు సాన్సే తెలిపారు. వ్యాపార విస్తరణకు ఈ ఏడాది రూ. 500 కోట్ల మూలధనం సమకూర్చాల్సిందిగా కేం ద్రాన్ని కోరినట్లు తెలిపారు. కేంద్ర నిర్ణయాన్ని బట్టి మూడో త్రైమాసికంలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ ద్వారా రూ. 400 నుంచి రూ. 500 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్యాంకులో కేంద్రానికి 74 శాతం వాటా ఉంది. ప్రస్తుతం వెలువడుతున్న గణాంకాలు ఒక స్పష్టతను ఇవ్వలేకపోయాయని, దీంతో ఆగస్టు సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. -
నేడు అందుబాటులో టీటీడీ సేవా టికెట్లు
తిరుమల: లక్కీడిప్ ద్వారా భక్తులకు కేటాయించటానికి మేల్చాట్ వస్త్రం, అభిషేకం టికెట్లు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ పేర్కొంది. శుక్రవారం నిర్వహించే సేవలో మేల్చాట్ వస్త్రం-01, సుప్రభాతం-100, కల్యాణోత్సవం-80 టికెట్లను గురువారం మధ్యాహ్నం స్థానిక విజయా బ్యాంక్‌లో లక్కీడిప్ ద్వారా కేటాయిస్తారు. భక్తులు తమ సెల్ నంబర్, ఫొటోతో పాటు వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలి. సాయంత్రం 5 గంటల తర్వాత కంప్యూటర్ ద్వారా ర్యాండం పద్ధతిలో ఎంపిక చేసి సెల్‌ఫోన్‌కు సందేశాన్ని పంపిస్తారు. సెల్ ఫోన్ లో సమాచారం అందుకున్న భక్తులు విజయాబ్యాంక్లో టికెట్లు పొంది శుక్రవారం సేవల్లో పాల్గొనవచ్చని టీటీడీ పేర్కొంది. -
శ్రీవారి సుప్రభాత సేవ పునఃప్రారంభం
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ టికెట్లను బుధవారం మంజూరుచేశారు. ధనుర్మాసం బుధవారం సాయంత్రం పూర్తి కావడంతో గురువారం వేకువజామున ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది. బుధవారం ఉదయం విజయ బ్యాంక్‌లో కరెంట్ బుకింగ్ ద్వారా 75 టికెట్లను విక్రయించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి బుధవారం 6 గంటల సమయం పడుతోంది. సంక్రాంతి పండుగ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం వేకువజాము నుండి సాయంత్రం 6 గంటల వరకు 36,282 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 12 కంపార్ట్మెంట్లలో సర్వదర్శనం భక్తులు వేచి ఉన్నారు. కాగా కాలినడకన తిరుమలకు వచ్చిన భక్తులు 4 కంపార్ట్మెంట్లలో ఉన్నారు. వీరికి 3 గంటల దర్శనం సమయం పడుతోంది. గదులు సులభంగానే లభిస్తున్నాయి. -
2018కల్లా 5 లక్షల కోట్ల వ్యాపార లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ విజయా బ్యాంక్ వ్యాపార విస్తరణపై ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం భారీ ఎత్తున కొత్త శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ (కాసా)పై దృష్టిసారిస్తున్నట్లు విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్.రామారావు తెలిపారు. హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన 1,550 శాఖను రామారావు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ వచ్చే నాలుగు నెల్లో మరో 150 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మార్చి నాటికి మొత్తం శాఖల సంఖ్యను 1,700కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రస్తుతం 135 శాఖలు ఉండగా, వచ్చే 16 నెలల్లో కొత్తగా 65 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో రూ. 15,000 కోట్లుగా ఉన్న వ్యాపారం ఈ ఏడాది చివరి నాటికి రూ. 17,000 కోట్లకు చేరుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న శాఖలు, సగటున ఏటా పదవీ విరమణ చేస్తున్న 600 మందిని దృష్టిలో పెట్టుకుంటే 1500 నుంచి 2,000 మంది కొత్త సిబ్బందిని తీసుకోవాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూలధన ఇబ్బందులు లేవు బాసెల్ 3 నిబంధనల ప్రకారం మూలధనానికి ఎటువంటి ఇబ్బందులు లేవని, త్వరలోనే టైర్-1, టైర్-2 క్యాపిటల్ కింద రూ.1,100 కోట్లు సమీకరించనున్నట్లు రామారావు తెలిపారు. బాగా పతనమైన షేరు ధర కొద్దిగా పెరిగిన తర్వాత క్విప్ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. గత నెలలో టైర్ 2 బాండ్స్ కింద రూ. 500 కోట్లు సేకరించింది. కిందటి నెలలో బ్యాంకులో ప్రభుత్వ వాటా 74 శాతం ఉంటే టైర్-2 బాండ్స్ ఇష్యూ తర్వాత 68 శాతానికి తగ్గిందని, ఇది క్విప్ ఇష్యూ తర్వాత 58 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకోనున్నట్లు ప్రకటించడంతో, వారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఫాలోఆన్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గినా ఆర్బీఐ వెంటనే వడ్డీరేట్లు తగ్గిస్తుందని భావించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించడం, కాసా అకౌంట్లపై దృష్టిపెట్టడం ద్వారా లాభదాయకతను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 19 శాతంగా ఉన్న కాసా డిపాజిట్లు మార్చి, 2015 నాటికి 22 శాతానికి చేరుకుంటుందన్నారు. పీఎస్‌యూ బ్యాంకుల్లోనే అత్యల్ప ఎన్పీఏలు కలిగి ఉన్న బ్యాంకుగా విజయాబ్యాంకు రికార్డులకు ఎక్కిందని, ప్రస్తుతం రూ. 2,239 (2.85%) కోట్లుగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులను ఈ ఆర్థిక ఏడాది చివరి నాటికి రూ. 2,100 కోట్లకు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కింద అందరికీ బ్యాంక్ అకౌంట్లను కల్పించడంపై దృష్టిసారించడంతో పీఎస్‌యూ బ్యాంకుల మధ్య విలీనాలకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. -
ముచ్చటగా మూడోసారి..!
తాండూరు/పెద్దేముల్: విజయా బ్యాంకులో దోపీడీ యత్నం నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతోంది. ఈ ఘటనలో అటు పోలీసులతో పాటు ఇటు బ్యాంకు అధికారుల ఉదాసీన వైఖరి తేటాతెల్లమవుతోంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించడం గత రెండేళ్లలో ఇది మూడోసారి. పెద్దేముల్ పోలీసుస్టేషన్‌కు అతిదగ్గరలోనే విజయబ్యాంకు ఉంది. ఇద్దరు దొంగలు రాత్రి తాపీగా బ్యాంకుకు కన్నం వేసి దోపిడీకి యత్నిస్తున్న విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోవడం గమనార్హం. మండల కేంద్రంలో.. అందునా పీఎస్‌కు అతి సమీపంలోనే గస్తీ ఇలా ఉంటే ఇక గ్రామాల రక్షణ పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన మోసీన్, మునీర్లు అనే యువకులు బ్యాంకు నుంచి శబ్దం వస్తుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఒకవేళ వారి ద్దరూ ఆ సమయంలో అటువైపుగా వెళ్లకుంటే కచ్చితంగా బ్యాంకులో దోపీడీ జరిగేదని స్థాని కులు చెబుతున్నారు. రాత్రిపూట పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నా.. అది నామామాత్రంగా మారడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తాండూరు-జహీరాబాద్ మా ర్గంలో దారిదోపిడీ జరిగింది. ఏకంగా రోడ్డుకు అడ్డుగా చెట్టు పెట్టి దుండగులు పెళ్లి బృందాన్ని దోచుకున్నారు. గత ఏడాది ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులపై అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. గతంలో విజయాబ్యాంకులో జరిగిన రెండు చోరీ యత్నాల కేసుల్లోనూ పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరి.. ఇక విజయబ్యాంకు అధికారులు బ్యాంకు భద్రతపై ఊదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే రెండుసార్లు ఈ బ్యాంకులో దోపిడీ యత్నాలు జరిగినా కనీసం సెక్యురిటీ గార్డును కూడా ఏర్పాటుచేయకపోవడం బ్యాంకు అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. రోజు లక్షల్లో లావాదేవీలు కొనసాగించే ఈ బ్యాంకు వద్ద భద్రత చర్యలు శూన్యమనే చెప్పాలి. రెండేళ్ల క్రితం కిటికీల ఇనుప చువ్వలు తొలగించి బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించారు. అలాగే మూడు నెలల క్రితమే బ్యాంకుకు కన్నం వేసి దోపిడీ యత్నం జరిగింది. బ్యాంకులోని ఏటీఎంను దొంగలు ధ్వంసం చేశారు. కానీ డబ్బులు పోలేదు. బ్యాంకు తీసే వరకు పోలీసులకు, బ్యాంకు అధికారులు ఈ దోపిడీ యత్నం జరిగిన విషయం తెలియరాలేదు. బ్యాంకులో ఉన్న ఒకే ఒక్క సీసీ కెమెరా కూడా 24 గంటలపాటు పనిచేయదు. కేవలం బ్యాంకు పని వేళల్లోనే అది పని చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలోనే రెండు సార్లు దోపిడీ యత్నాలు జరిగినా ఎందుకు తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని మంగళవారం బ్యాంకును పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజకుమారి బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించడం గమనార్హం. ఇకమీదనైనా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని బ్యాంకు అధికారులకు ఎస్పీ సూచించారు. ఇకపై మరింత పకడ్బందీగా గస్తీ.. పెద్దేముల్: రాత్రి గస్తీని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఎస్పీ దోపిడీ యత్నం జరిగిన విజయ బ్యాంకును సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దులో పెద్దేముల్ మండలం ఉన్నందున గస్తీని ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు. అనుమానిత వ్యక్తుల సమాచారం ఇచ్చి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. స్థానిక యువకుల సమాచారంతోనే బ్యాంకు దోపిడీ యత్నానికి పాల్పడిన దొంగలను పట్టుకున్నామన్నారు. పటిష్ట రక్షణ చర్యలు తీసుకుంటాం పెద్దేముల్‌లోని విజయబ్యాంక్లో వెంటనే సీసీ కెమెరాలు, నైట్ వాచ్‌మన్‌ను ఏర్పాటు చేస్తామని విజయబ్యాంక్ డీజీఎం వినోద్‌కుమార్‌రెడ్డి అన్నారు. బ్యాంకులో డోపిడీ యత్నం జరిగిన విషయాన్ని తెలుసుకున్న డీజీఎం విజయబ్యాంక్‌ను సందర్శించారు. దోపిడియత్నం గురించి స్థానిక బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్యాంక్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని లబ్ధిదారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. -
విజయా బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పెదవేములలోని విజయా బ్యాంక్‌లో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంక్‌లోని గోడకు రంధ్రం పెట్టి లోపలకు వెళ్లేందుకు దుండగులు యత్నించారు. రంజాన్ సందర్భంగా చుట్టుపక్కలవారు ఈరోజు తెల్లవారుజామునే ప్రార్థన్ల కోసం వెళుతుండగా బ్యాంక్‌లో అలికిడి వినిపించింది. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ... దుండగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బ్యాంక్‌లో ఉన్నవారిని ఎట్టకేలకు బయటకు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో ఈ దుండగులు ఇదే బ్యాంక్‌లో రెండుసార్లు చోరీకి యత్నించినట్లు సమాచారం. ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడించారు. దాంతో పోలీసులు బ్యాంక్‌లో భద్రతపై ఆరా తీస్తున్నారు. -
విజయా బ్యాంక్ లాభం 39 శాతం డౌన్
బెంగళూరు: ప్రభుత్వ రంగ సంస్థ విజయా బ్యాంక్ నికర లాభం జనవరి-మార్చి(క్యూ4) కాలంలో 39%పైగా క్షీణించి రూ. 136 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 224 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మార్క్ట్ మార్కెట్(ఎం టు ఎం) నష్టాలవల్ల లాభాలు దెబ్బతిన్నట్లు బ్యాంకు చైర్మన్ వి.కన్నన్ చెప్పారు. మొండి బకాయిలకు కేటాయింపులు రూ. 149 కోట్ల నుంచి రూ. 99 కోట్లకు తగ్గినప్పటికీ పునర్వ్యవస్థీకరించిన రుణాల ప్రొవిజన్లు రూ. 42 కోట్ల నుంచి రూ.96 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. ఎంటుఎం నష్టాలు రూ. 71 కోట్లుగా చెప్పారు. కాగా, ఈ కాలంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 2,680 కోట్ల నుంచి రూ. 3,029 కోట్లకు ఎగసింది. రూ. 526 కోట్ల నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) లభించగా, నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.21% నుంచి 1.92%కు క్షీణించాయి. నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.3% నుంచి 1.55%కు పెరిగాయి. పూర్తి ఏడాదికి(2013-14) ఆదాయం రూ. 9,659 కోట్ల నుంచి రూ. 11,416 కోట్లకు పుంజుకుంది. నికర లాభం 29% క్షీణించి రూ. 417 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం రూ. 586 కోట్ల లాభం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంకు షేరు యథాతథంగా రూ. 41 వద్దే ముగిసింది. -
విజయబ్యాంక్లో 43 లక్షలు మాయం
-
విజయా బ్యాంక్ వ్యవ‘సాయం’
డిమాండ్ లేకపోవడంతో కార్పొరేట్ నుంచి రిటైల్‌కు సంపన్న వర్గాల కోసం ‘విజయ సమృద్ధి’ బ్రాంచీలు విజయాబ్యాంక్ ఈడీ రామారావు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కరెంట్, సేవింగ్స్ అకౌంట్ (కాసా)పై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రభుత్వరంగ విజయా బ్యాం క్ ప్రకటించింది. ప్రస్తుతం డిపాజిట్లలో కాసా వాటా కేవలం 18%గా ఉందని, దాన్ని వచ్చే మార్చినాటికి 22 శాతానికి పెంచడంతో పాటు వచ్చే మూడేళ్లలో 30 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్. రామారావు తెలిపారు. ఇందుకోసం వచ్చే 15 నెలల్లో కొత్తగా 250 శాఖలను ప్రారంభించడంతో పాటు కాసా అకౌంట్స్‌పై ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఒక్కో శాఖ నుంచి కనీసం 440 తగ్గకుండా మొత్తం ఆరు లక్షల కాసా అకౌంట్స్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం విజయా బ్యాంక్‌కి దేశవ్యాప్తంగా 1,483 శాఖలు ఉండగా మార్చి నాటికి ఈ సంఖ్య 1,500కి చేరనుంది. అధికాదాయవర్గాల వారి కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘విజయ సమృద్ధి’ శాఖను రామారావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ రుణాలకు ఇంకా డిమాండ్ పెరగలేదని, దీంతో ప్రధానంగా వ్యవసాయం, రిటై ల్, ఎస్ఎంఈ రంగాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొత్తం రుణాల్లో 52%గా ఉన్న కార్పొరేట్ రుణాల వాటాను మూడేళ్లలో 48 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తు తం 14%గా ఉన్న వ్యవసాయం, 33%గా ఉన్న రిటైల్ రుణాలపై అధికంగా దృష్టిపెడుతున్నామన్నారు. ఎన్పీఏలు పరిశ్రమ సగటుకంటే తక్కువగానే ఉన్నట్లు తెలి పారు. ఈ ఏడాదిలో వ్యాపారంలో 25% వృద్ధిని అంచనా వేస్తున్నామని, గత మార్చిలో రూ.1.67 లక్షల కోట్లుగా ఉన్న వ్యాపార పరిమాణం 2014 మార్చి నాటికి రూ.2.10 లక్షల కోట్లకు చేర్చాలన్నది లక్ష్యమన్నారు. ‘విజయ సమృద్ధి’ విస్తరణ... అధికాదాయ వర్గాల కోసం ప్రవేశపెట్టిన ‘విజయ సమృద్ధి’ శాఖలకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌సహా ఇప్పటివరకు 4 శాఖలను ప్రారంభించామని, త్వరలో మరో 5 పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ శాఖలో ఖాతా కనీస నిల్వ రూ.3 లక్షలు. అదే కరెంట్ అకౌంట్ అయితే రూ.5 లక్షలు ఉండాలి. ఈ శాఖలో ఖాతాలు కలిగి వున్న వారికి లాకర్ల ఫీజులో 50% తగ్గింపుతో పాటు పలు ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. -
విజయా బ్యాంక్ ఈడీగా బీఎస్ రామారావు బాధ్యతలు
హైదరాబాద్: ప్రభుత్వరంగ విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బీఎస్ రామారావు బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లాకి చెందిన రామారావు.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ చేశారు. 1978లో ఆంధ్రాబ్యాంక్ విజయవాడ బ్రాంచీ లో పీఓగా కెరియర్ ప్రారంభించారు. ఏజీఎంగా అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్ తదితర జోనల్ కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఏప్రిల్ నుంచి ఆంధ్రా బ్యాంక్‌లో జీఎంగా చేసిన ఆయన తాజాగా విజయా బ్యాంక్ ఈడీగా నియమితులయ్యారు. -
బ్యాంక్‌ను మోసగించిన కేసులో మాజీ బ్యాంక్ అధికారికి జైలు
న్యూఢిల్లీ: ఓ ప్రభుత్వ బ్యాంక్‌ను రూ. 2.63 కోట్ల మేరకు మోసగించిన ఓ మాజీ బ్యాంక్ అధికారి సహా నలుగురికి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి గుర్విందర్ పాల్ సింగ్ ‘‘నిందితులు విపుల్ శర్మ, అతని భార్య రజిని, రాజేశ్‌కుమార్, విజయ బ్యాంక్ మాజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హెచ్‌జీ పాయ్ కుమ్మక్కై జాతీయబ్యాంక్ కు భారీ నష్టం కలిగించారు. వీరి కుట్ర కారణంగా ఢిల్లీ కంటోన్మెంట్ విజయబ్యాంక్ రూ. 2.63 కోట్లు నష్టం చవిచూసింది. ఎలాంటి పూచికత్తు లేకుండా భారీ మొత్తాన్ని నిందితులకు ఇవ్వడం వలన ఈ నష్టం సంభవించింది’’ అని తీర్పులో పేర్కొన్నారు. ‘‘ఎవరైనా ఉద్రిక్తతకు లోనైనప్పుడు హత్యలు చేసే అవకాశం ఉండొచ్చు. ఆర్థిక నేరాలు చేసేవారు మాత్రం వ్యక్తిగత స్వార్థం కోసం కచ్చితమైన ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తారు. ఇది సమాజానికి, దేశానికి హాని కలిగిస్తుంది’’ అని జడ్జి స్పష్టం చేశారు. దోషులకు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.75 వేల జరిమానా విధించారు.