
న్యూఢిల్లీ: విజయా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.207 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.204 కోట్ల నికర లాభం వచ్చిందని, 2% వృద్ధి సాధించామని బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,505 కోట్ల నుంచి రూ.3,728 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.345 కోట్ల నుంచి రూ.553 కోట్లకు పెరిగాయి. ఒక్కో షేర్‌కు రూ.1.20 డివిడెండ్‌ను బ్యాంకు ప్రకటించింది.
తగ్గిన మొండి బకాయిలు...
ఇక 2016–17లో రూ.750 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.727 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.14,031 కోట్ల నుంచి రూ.14,190 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 6.59 శాతం నుంచి 6.34 శాతానికి, నికర మొండి బకాయిలు 4.36 శాతం నుంచి 4.32 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో విజయా బ్యాంక్ షేర్ 2% లాభంతో రూ.61 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment