
నేడు అందుబాటులో టీటీడీ సేవా టికెట్లు
లక్కీడిప్ ద్వారా భక్తులకు కేటాయించటానికి మేల్‌చాట్ వస్త్రం, అభిషేకం టికెట్లు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ పేర్కొంది.
తిరుమల: లక్కీడిప్ ద్వారా భక్తులకు కేటాయించటానికి మేల్‌చాట్ వస్త్రం, అభిషేకం టికెట్లు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ పేర్కొంది. శుక్రవారం నిర్వహించే సేవలో మేల్‌చాట్ వస్త్రం-01, సుప్రభాతం-100, కల్యాణోత్సవం-80 టికెట్లను గురువారం మధ్యాహ్నం స్థానిక విజయా బ్యాంక్‌లో లక్కీడిప్ ద్వారా కేటాయిస్తారు. భక్తులు తమ సెల్ నంబర్, ఫొటోతో పాటు వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలి.
సాయంత్రం 5 గంటల తర్వాత కంప్యూటర్ ద్వారా ర్యాండం పద్ధతిలో ఎంపిక చేసి సెల్‌ఫోన్‌కు సందేశాన్ని పంపిస్తారు. సెల్ ఫోన్ లో సమాచారం అందుకున్న భక్తులు విజయాబ్యాంక్‌లో టికెట్లు పొంది శుక్రవారం సేవల్లో పాల్గొనవచ్చని టీటీడీ పేర్కొంది.