హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పెదవేములలోని విజయా బ్యాంక్లో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంక్లోని గోడకు రంధ్రం పెట్టి లోపలకు వెళ్లేందుకు దుండగులు యత్నించారు. రంజాన్ సందర్భంగా చుట్టుపక్కలవారు ఈరోజు తెల్లవారుజామునే ప్రార్థన్ల కోసం వెళుతుండగా బ్యాంక్లో అలికిడి వినిపించింది. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
దాంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ... దుండగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బ్యాంక్లో ఉన్నవారిని ఎట్టకేలకు బయటకు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో ఈ దుండగులు ఇదే బ్యాంక్లో రెండుసార్లు చోరీకి యత్నించినట్లు సమాచారం. ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడించారు. దాంతో పోలీసులు బ్యాంక్లో భద్రతపై ఆరా తీస్తున్నారు.