విజయ బ్యాంక్ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: విజయ బ్యాంకు క్యూ4లో నష్టాలనుంచి కోలుకుని మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. గతేడాది(2017-18) చివరి త్రైమాసికంలో విజయా బ్యాంకు నికర లాభం స్వల్పంగా 1.6శాతం పుంజుకుని రూ. 207 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 3,728 కోట్లకు పెరింగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో విజయా బ్యాంకు వెల్లడించింది. గత ఏడాది ఇది 3504 కోట్ల రూపాయలుగా ఉంది.
నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) కూడా 21 శాతం పుంజుకుని రూ. 1196 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు రూ. 345 కోట్ల నుంచి రూ. 553 కోట్లకు ఎగశాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 6.17 శాతం నుంచి 6.34 శాతానికి స్వల్పంగా పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 3.99 శాతం నుంచి 4.32 శాతానికి పెరిగాయి. మరోవైపు ప్రతి ఈక్విటీ షేరుకు 1.20 రూపాయల డివిడెండ్ చెల్లించాలని బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించారని కంపెనీ వెల్లడించింది. ఈ ఫలితాల నేపథ్యంలో విజయా బ్యాంకు షేరు 2శాతం లాభపడి 61 రూపాయల వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment