విజయ బ్యాంక్ లాభం 26 శాతం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని విజయ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 26 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.97 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2015-16) క్యూ4లో రూ.71 కోట్లకు తగ్గిందని విజయ బ్యాంక్ తెలిపింది.
మొత్తం ఆదాయం రూ.3,408 కోట్ల నుంచి రూ.3,228 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.382 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.439 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.13,152 కోట్ల నుంచి రూ.12,957 కోట్లకు తగ్గాయని వివరించింది. స్థూల మొండి బకాయిలు 2.78 శాతం నుంచి 6.64 శాతానికి, నికర మొండి బకాయిలు 1.92 శాతం నుంచి 4.81 శాతానికి పెరిగాయని విజయ బ్యాంక్ వెల్లడించింది.