net profit financial year
-
భారీగా తగ్గిన కోల్ ఇండియా లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ, కోల్ ఇండియా నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 77 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.2,654 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.600 కోట్లకు తగ్గిందని కోల్ ఇండియా తెలిపింది. అమ్మకాలు తగ్గడం, వ్యయాలు పెరగడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని పేర్కొంది. ఈ క్యూ2లో నికర అమ్మకాలు 8 శాతం తగ్గి రూ.15,645 కోట్లకు పడిపోయాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.17,490 కోట్ల నుంచి రూ.16,213 కోట్లకు తగ్గగా, మొత్తం వ్యయాలు రూ.14,733 కోట్ల నుంచి రూ.16,162 కోట్లకు పెరిగాయని పేర్కొంది. స్టాండోలోన్ ప్రాతిపదికన గత క్యూ2లో రూ.1,246 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,098 కోట్లకు తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.49 కోట్ల నుంచి రూ.81 కోట్లకు పెరిగిందని పేర్కొంది. -
ఇండియా బుల్స్ హౌసింగ్ లాభం 23% వృద్ధి
ముంబై: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి 23 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.511 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.630 కోట్లకు పెరిగిందని సంస్థ తెలిపింది. రుణ వృద్ధి 31 శాతం పెరగడం వల్ల ఈ స్థాయి నికర లాభం వచ్చిందని కంపెనీ డిప్యూటీ ఎండీ అశ్వినీ హుడా తెలిపారు. గత క్యూ1లో రూ.54,000 కోట్లుగా ఉన్న రుణాలు ఈ క్యూ1లో రూ.71,000 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.821 కోట్ల నుంచి 28 శాతం వృద్ధితో రూ.1,053 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ బీఎస్ఈలో 1 శాతం పెరిగి రూ.742 వద్ద ముగిసింది. -
విజయ బ్యాంక్ లాభం 26 శాతం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని విజయ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 26 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.97 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2015-16) క్యూ4లో రూ.71 కోట్లకు తగ్గిందని విజయ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,408 కోట్ల నుంచి రూ.3,228 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.382 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.439 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.13,152 కోట్ల నుంచి రూ.12,957 కోట్లకు తగ్గాయని వివరించింది. స్థూల మొండి బకాయిలు 2.78 శాతం నుంచి 6.64 శాతానికి, నికర మొండి బకాయిలు 1.92 శాతం నుంచి 4.81 శాతానికి పెరిగాయని విజయ బ్యాంక్ వెల్లడించింది. -
హీరో మోటొకార్ప్ నికర లాభం రూ.814 కోట్లు
♦ క్యూ4లో 71 శాతం వృద్ధి ♦ షేర్‌కు రూ.32 (1600 శాతం) డివిడెండ్ న్యూఢిల్లీ: హీరో మోటొకార్ప్ నికర లాభం(స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 71% పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015-16) క్యూ4లో రూ.477 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.814 కోట్లకు పెరిగిందని హీరో మోటొకార్ప్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో అత్యుత్తమ అమ్మకాలు సాధించామని అందుకే నికర లాభం బాగా పెరిగిందని హీరో మోటొకార్ప్ సీఎండీ పవన్ ముంజాల్ చెప్పారు. ఆ క్వార్టర్లో 17,21,240 వాహనాలను విక్రయించామని, దీనికి తోడు మార్జిన్లు పెంచుకోవడానికి పలు చర్యలు తీసుకున్నామని, వీటి ఫలితంగా లాభాలు పెరిగాయన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,695 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 10 శాతం వృద్ధితో రూ.7,385 కోట్లకు పెరిగాయని తెలిపారు. టూవీలర్ల విక్రయాలు 15,75,501 నుంచి 9% వృద్ధితో 17,21,240కు పెరిగాయని పేర్కొన్నారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.32 తుది డివిడెండ్(1,600 శాతం)ను ఇస్తామని పేర్కొన్నారు. రూ.3,132 కోట్ల నికర లాభం: ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015-16లో రూ.2,386 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధితో రూ.3,132 కోట్లకు పెరిగిందని పవన్ ముంజాల్ తెలిపారు. అలాగే నికర అమ్మకాలు రూ.27,351 కోట్ల నుంచి రూ.28,160 కోట్లకు ఎగిశాయని చెప్పారు. మొత్తం వాహన విక్రయాలు 66,31,826 నుంచి 66,32,322కు పెరిగాయని వివరించారు. ఐదోసారి అగ్రస్థానంలోనే..: గత ఆర్థిక సంవత్సరాన్ని కూడా కలుపుకుంటే టూవీలర్ల అమ్మకాల్లో వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంలో నిలిచామని చెప్పారు. అమ్మకాల పరంగా అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా మరింతగా లాభాలను సాధించామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హీరో మోటొకార్ప్ షేర్ స్వల్పంగా నష్టపోయి రూ.2,894 వద్ద ముగిసింది. -
హిందుస్తాన్ జింక్ లాభం రూ.2,149 కోట్లు
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో తైమాసిక కాలానికి రూ.2,149 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో సాధించిన నికర లాభం(రూ.1,997కోట్లు)తో పోల్చితే 8 శాతం వృద్ధి సాధించామని హిందుస్తాన్ జింక్ వెల్లడించింది. 2014-15 క్యూ4లో రూ.4,126 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 20 శాతం తగ్గి రూ.3,132 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్ జింక్ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు. కమోడిటీ ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు, మార్కెట్ సెంటిమెంట్ కుదేలై ఉండడం వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, మంచి పనితీరు కనబరిచామని వివరించారు. గత నెలలో తమ వాటాదారులకు ప్రత్యేక స్వర్ణోత్సవ డివిడెండ్‌ను చెల్లించామని పేర్కొన్నారు. కాగా ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు 0.4 శాతం నష్టపోయి రూ.174 వద్ద ముగిసింది.