హీరో మోటొకార్ప్ నికర లాభం రూ.814 కోట్లు | Hero MotoCorp's Q4 net profit up 71 percent | Sakshi
Sakshi News home page

హీరో మోటొకార్ప్ నికర లాభం రూ.814 కోట్లు

Published Fri, May 6 2016 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

హీరో మోటొకార్ప్ నికర లాభం రూ.814 కోట్లు

హీరో మోటొకార్ప్ నికర లాభం రూ.814 కోట్లు

క్యూ4లో 71 శాతం వృద్ధి
షేర్‌కు రూ.32 (1600 శాతం) డివిడెండ్

 న్యూఢిల్లీ: హీరో మోటొకార్ప్ నికర లాభం(స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 71% పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015-16) క్యూ4లో రూ.477 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.814 కోట్లకు పెరిగిందని హీరో మోటొకార్ప్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో అత్యుత్తమ అమ్మకాలు సాధించామని అందుకే నికర లాభం బాగా పెరిగిందని హీరో మోటొకార్ప్ సీఎండీ పవన్ ముంజాల్ చెప్పారు.

ఆ క్వార్టర్‌లో 17,21,240 వాహనాలను విక్రయించామని, దీనికి తోడు మార్జిన్లు పెంచుకోవడానికి పలు చర్యలు తీసుకున్నామని, వీటి ఫలితంగా లాభాలు పెరిగాయన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,695 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 10 శాతం వృద్ధితో రూ.7,385 కోట్లకు పెరిగాయని తెలిపారు. టూవీలర్ల విక్రయాలు 15,75,501 నుంచి 9% వృద్ధితో 17,21,240కు పెరిగాయని పేర్కొన్నారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.32 తుది డివిడెండ్(1,600 శాతం)ను ఇస్తామని పేర్కొన్నారు.

 రూ.3,132 కోట్ల నికర లాభం: ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015-16లో రూ.2,386 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధితో రూ.3,132 కోట్లకు పెరిగిందని పవన్ ముంజాల్ తెలిపారు. అలాగే నికర అమ్మకాలు రూ.27,351 కోట్ల నుంచి రూ.28,160 కోట్లకు ఎగిశాయని చెప్పారు. మొత్తం వాహన విక్రయాలు 66,31,826 నుంచి 66,32,322కు పెరిగాయని వివరించారు.

 ఐదోసారి అగ్రస్థానంలోనే..: గత ఆర్థిక సంవత్సరాన్ని కూడా కలుపుకుంటే టూవీలర్ల అమ్మకాల్లో వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంలో నిలిచామని చెప్పారు. అమ్మకాల పరంగా అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా మరింతగా లాభాలను సాధించామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హీరో మోటొకార్ప్ షేర్ స్వల్పంగా నష్టపోయి రూ.2,894 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement