ఇండియా బుల్స్ హౌసింగ్ లాభం 23% వృద్ధి | Indiabulls Housing Finance Q1 cons net profit at Rs.630 crore | Sakshi
Sakshi News home page

ఇండియా బుల్స్ హౌసింగ్ లాభం 23% వృద్ధి

Published Tue, Jul 26 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

ఇండియా బుల్స్ హౌసింగ్ లాభం 23% వృద్ధి

ఇండియా బుల్స్ హౌసింగ్ లాభం 23% వృద్ధి

ముంబై: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నికర లాభం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి 23 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.511 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.630 కోట్లకు పెరిగిందని సంస్థ తెలిపింది. రుణ వృద్ధి 31 శాతం పెరగడం వల్ల ఈ స్థాయి నికర లాభం వచ్చిందని కంపెనీ డిప్యూటీ ఎండీ అశ్వినీ హుడా తెలిపారు.

గత క్యూ1లో రూ.54,000 కోట్లుగా ఉన్న రుణాలు ఈ క్యూ1లో రూ.71,000 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.821 కోట్ల నుంచి 28 శాతం వృద్ధితో రూ.1,053 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ బీఎస్‌ఈలో 1 శాతం పెరిగి రూ.742 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement