Indiabulls Housing Finance
-
’జీ’ సుభాష్ చంద్రపై దివాలా చర్యలకు ఎన్సీఎల్టీ ఆదేశాలు
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం, జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) గౌరవ చైర్మన్ సుభాష్ చంద్రపై దివాలా చట్టం కింద ప్రొసీడింగ్స్ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ వివేక్ ఇన్ఫ్రాకాన్ తీసుకున్న రుణాలకు గ్యారంటార్‌గా ఉన్న చంద్రపై ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్ఎల్) దాఖలు చేసిన పిటీషన్ మీద ఎన్సీఎల్టీ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మరో రెండు సంస్థలు (ఐడీబీఐ ట్రస్టీíÙప్, యాక్సిస్ బ్యాంక్) దాఖలు చేసిన ఇదే తరహా పిటీషన్లను తోసిపుచి్చంది. ఓపెన్ కోర్టులో ఎన్సీఎల్టీ ఈ ఆర్డరులివ్వగా పూర్తి వివరాలతో కూడిన తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. వివరాల్లోకి వెడితే చంద్రా ప్రమోట్ చేస్తున్న ఎస్సెల్ గ్రూప్‌లో భాగమైన వివేక్ ఇన్ఫ్రాకాన్ సంస్థ 2022లో ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ. 170 కోట్ల రుణం డిఫాల్ట్ అయ్యింది. దీనిపైనే ఐహెచ్ఎఫ్ఎల్ .. ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వ్యక్తిగత గ్యారంటార్లు.. దివాలా ప్రొసీడింగ్స్ పరిధిలోకి రారని, తనపై చర్యలు తీసుకునేందుకు ఎన్సీఎల్టీకి ఎలాంటి అధికారాలు ఉండవని చంద్రా వాదనలు వినిపించారు. అయితే, దీన్ని ఎన్సీఎల్టీ తిరస్కరించగా .. చంద్రా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించుకోవడంతో కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా బకాయిలను తీర్చకపోవడంతో ఐహెచ్ఎఫ్ఎల్ ఈ ఏడాది ప్రారంభంలో కేసును తిరగదోడింది. -
లక్ష్మీ విలాస్ విలీన స్కీమ్‌పై రగడ
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను (ఎల్వీబీ) డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీనం చేసే అంశం కొత్త మలుపు తిరిగింది. ఈ విలీన స్కీమ్‌పై స్టే విధించాలంటూ ఎల్వీబీ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, వాటాదారైన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ .. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాయి. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, డీబీఎస్ బ్యాంక్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నాయి. అయితే, విలీనంపై స్టే విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది. ‘విలీనంపై స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 14నకు వాయిదా వేస్తున్నాం. అప్పట్లోగా ప్రతివాదులు (ఆర్బీఐ, ఎల్వీబీ, డీబీఎస్ బ్యాంక్ ఇండియా) తమ అఫిడవిట్లు దాఖలు చేయాలి‘ అని జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విలీనంతో తాము రూ. 188 కోట్లు నష్టపోనున్నట్లు కేసు విచారణ సందర్భంగా ఇండియాబుల్స్ వాదించింది. అయితే, ప్రజలు, డిపాజిటర్లు, ఎల్వీబీ ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో విలీన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్బీఐ తరఫు న్యాయవాది రవి కదమ్ తెలిపారు. నవంబర్ 27 నుంచే విలీనం అమల్లోకి రానుండగా, సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, విలీన పథకంలో భాగంగా సుమారు రూ. 320 కోట్ల విలువ చేసే టియర్2 బాండ్లను కూడా రైటాఫ్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. పథకం ఏంటంటే..: విలీనానికి సంబంధించిన తుది స్కీమ్ ప్రకారం ఎల్వీబీ పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తం రైటాఫ్ చేయనున్నారు. దీంతో వాటాదారులకు దక్కేదేమీ లేదన్న నేపథ్యంలోనే తమ పెట్టుబడంతా కోల్పోనున్న ప్రమోటర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా.. చట్టపరమైన చర్యలపై దృష్టి పెట్టారు. ప్రమోటర్ గ్రూప్‌నకు ఎల్‌వీబీలో 6.8% వాటాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ ఆఖరు నాటికి ఎల్‌వీబీలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌కు 4.99%, ప్రొలిఫిక్ ఫిన్‌వెస్ట్‌కు 3.36%, శ్రేయి ఇన్ఫ్రాకు 3.34%, ఎంఎన్ దస్తూర్ అండ్ కో సంస్థకు 1.89%, క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ 1.82%, క్యాప్రి గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్ 2%, బయాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 1.36%, ట్రినిటీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు 1.61% వాటాలు ఉన్నాయి. -
అరబిందో- ఐబీ హౌసింగ్- క్యూ2 ఖుషీ
ముంబై: ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ల 8 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం సెన్సెక్స్ 292 పాయింట్లు పతనమై 43,301కుచేరింది. నిఫ్టీ సైతం 62 పాయింట్లు క్షీణించి 12,687 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ హైదరాబాద్ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఫలితాలు అంచనాలను చేరడంతో ఎన్బీఎఫ్సీ.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అరబిందో ఫార్మా ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో అరబిందో ఫార్మా నికర లాభం 26 శాతం ఎగసి రూ. 806 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 6,483 కోట్లను అధిగమించాయి. వాటాదారులకు సైతం షేరుకి రూ. 1.25 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో అరబిందో ఫార్మా షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 7 శాతం దూసుకెళ్లి రూ. 864ను తాకింది. ప్రస్తుతం 5.3 శాతం జంప్‌చేసి రూ. 854 వద్ద ట్రేడవుతోంది. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో ఐబీ హౌసింగ్ నికర లాభం 54 శాతం క్షీణించి రూ. 323 కోట్లకు పరిమితమైంది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే 18.5 శాతం పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 26 శాతం తక్కువగా రూ. 2,581 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 174కు చేరింది. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 171 వద్ద ట్రేడవుతోంది. -
2 ట్రేడింగ్ సెషన్‌ల్లోనే 50శాతం ర్యాలీ
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్(ఐబీహెచ్ఎఫ్) షేరు కేవలం 2ట్రేడింగ్ సెషన్‌ల్లోనే 50శాతం పెరిగింది. గడచిన రెండురోజుల్లో ఇన్వెస్ట్మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీతో సహా అనేక సంస్థలు బల్క్‌డీల్స్ ద్వారా ఐబీహెచ్ఎఫ్ లో వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్చ్సేంజ్ గణాంకాలు చెబుతున్నాయి. ఎన్ఎస్ఈలో గణాంకాల ప్రకారం సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ గతవారంలో చివరి ట్రేడింగ్ సెషన్లో ఐబీహెచ్‌ఎఫ్‌కి చెందిన ప్రతి ఈక్విటీ షేరును రూ.184.76 చొప్పున మొత్తం 45.22లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ డీల్ మొత్తం విలువ సుమారు రూ.83.50కోట్లుగా ఉంది. ఈ ఒప్పందం తరువాత, ఇండియా బుల్స్ హౌసింగ్ షేరు శుక్రవారం 31 శాతం, సోమవారం 19శాతం చొప్పును మొత్తం 50శాతం లాభపడింది. కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా వేతనాల కోత, ఉద్యోగాలు పోయే పరిస్థితితో నెలకొనడంతో ఈఎంఐలు డిఫాల్ట్ అవుతాయనే భయాలతో ఇన్వెసర్లు ఈ షేర్ల అమ్మకాలు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు 23శాతం క్షీణించింది. కరోనా మహమ్మారి ప్రభావం రుణగ్రహీత జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, తద్వారా ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల అసెట్ క్వాలిటీలను దెబ్బతీస్తుందని దేశీయ రేటింగ్ సంస్థ ఇక్రా అభిప్రాయపడింది. సోమవారం మార్కెట్ ముగిసే సరికి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 19శాతం లాభంతో రూ.242.20 వద్ద స్థిరపడింది. -
ఐబీ హౌసింగ్- ఐసీఐసీఐ.. స్పీడ్
ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎన్బీఎఫ్సీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్‌కు మరోసారి భారీ డిమాండ్ కనిపిస్తోంది. గత వారాంతాన ఎఫ్‌పీఐలు కంపెనీలో వాటా కొనుగోలు చేసిన వార్తలు ఈ కౌంటర్‌కు జోష్నిస్తుంటే.. బీమా అనుబంధ విభాగంలో వాటా విక్రయ వార్తలతో ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం.. ఐబీ హౌసింగ్ బల్క్ డీల్ ద్వారా గత వారాంతాన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో విదేశీ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) 1.05 శాతం వాటాకు సమానమైన దాదాపు 45.23 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. షేరుకి రూ. 184.76 సగటు ధరలో వీటిని కొనుగోలు చేయగా.. యూకే సంస్థ బ్లాక్‌రాక్ అడ్వయిజర్స్‌కు చెందిన ఐషేర్స్ 1.66 శాతం వాటాను రెండు ఈటీఎఫ్‌ల ద్వారా కొనుగోలు చేసింది. ఐబీ హౌసింగ్‌లో ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ UCITS 25.69 లక్షల షేర్లు, ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ 45.59 లక్షల షేర్లను.. షేరుకి 189.51 సగటు ధరలో సొంతం చేసుకున్నాయి. షేరు దూకుడు విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) వాటా కొనుగోలు వార్తలతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐబీ హౌసింగ్ షేరు 21 శాతం దూసుకెళ్లి రూ. 246 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 254 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమానం 2.9 కోట్ల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5.24 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఎఫ్‌పీఐల వాటా కొనుగోలు వార్తలతో శుక్రవారం సైతం ఐబీ హౌసింగ్ కౌంటర్లో భారీ ట్రేడింగ్ నమోదైంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ. 202 ఎగువన ముగిసింది. ఈ నెల 26 నుంచీ ఐబీ హౌసింగ్ షేరు నిఫ్టీ మిడ్‌క్యాప్-100 ఇండెక్స్‌లో చోటు దక్కించుకోనుంది. గత మూడు నెలల్లో ఈ షేరు ఏకంగా 160 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఐసీఐసీఐ బ్యాంక్ బీమా అనుబంధ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో 1.5 శాతం వాటాను విక్రయించినట్లు మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. తద్వారా సుమారు రూ. 840 కోట్లను సమీకరించినట్లు తెలియజేసింది. దీంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో బ్యాంక్ వాటా 51.4 శాతానికి పరిమితమైనట్లు పేర్కొంది. ఇక మరో అనుబంధ సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్‌లోనూ 3.96 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 2250 కోట్లను సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 371 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 375 వరకూ పెరిగింది. వెరసి వరుసగా మూడో రోజు లాభాలతో కదులుతోంది. కాగా.. మరోపక్క ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేరు సైతం 4 శాతం జంప్‌చేసి రూ. 406 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 419 వరకూ ఎగసింది. ఐసీఐసీఐ లంబార్డ్ షేరు 0.5 శాతం పుంజుకుని రూ. 1277 వద్ద కదులుతోంది. -
ఐబీ హౌసింగ్ దూకుడు- ఎఫ్‌పీఐల పుష్
వారాంతాన దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. సెన్సెక్స్ 524 పాయింట్లు పెరిగి 34,792 వద్ద నిలవగా.. 153 పాయింట్లు జంప్‌చేసిన నిఫ్టీ 10,244 వద్ద స్థిరపడింది. కాగా.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడైన వార్తల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కౌంటర్ లాభాలతో దూసుకెళ్లగా.. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో యూనికెమ్ లేబొరేటరీస్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వివరాలు చూద్దాం.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా శుక్రవారం ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఎఫ్‌పీఐలు 2.6 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజీల డేటా పేర్కొంది. ఐబీ హౌసింగ్‌లో మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) 1.05 శాతం వాటాకు సమానమైన దాదాపు 45.23 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. షేరుకి రూ. 184.76 సగటు ధరలో వీటిని కొనుగోలు చేయగా.. యూకే సంస్థ బ్లాక్‌రాక్ అడ్వయిజర్స్‌కు చెందిన ఐషేర్స్ 1.66 శాతం వాటాను రెండు ఈటీఎఫ్‌ల ద్వారా కొనుగోలు చేసింది. ఐబీ హౌసింగ్‌లో ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ UCITS 25.69 లక్షల షేర్లు, ఐషేర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ డివిడెండ్ ఈటీఎఫ్ 45.59 లక్షల షేర్లను.. షేరుకి 189.51 సగటు ధరలో సొంతం చేసుకున్నాయి. అయితే ఇంటిగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్(ఏషియా) రూ. 202 ధరలో 21.69 లక్షలకుపైగా షేర్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో వారాంతాన ఐబీ హౌసింగ్ కౌంటర్లో భారీ ట్రేడింగ్ నమోదైంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు 30 శాతంపైగా దూసుకెళ్లి రూ. 202 ఎగువన ముగిసింది. ఇంట్రాడేలో రూ. 209ను సైతం అధిగమించింది. యూనికెమ్ క్యూ4 వీక్ హెల్త్‌కేర్ రంగ కంపెనీ యూనికెమ్ ల్యాబొరేటరీస్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో కంపెనీ రూ. 17 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 38 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 15 శాతం క్షీణించి రూ. 320 కోట్లకు పరిమితమయ్యాయి. వారాంతాన సమావేశమైన బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4 డివిడెండ్‌ను సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎన్ఎస్ఈలో యూనికెమ్ ల్యాబ్ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 159 వద్ద ముగిసింది. తొలుత ఒక దశలో రూ. 150 వరకూ దిగజారింది. -
ఎల్వీబీ, ఇండియాబుల్స్ హౌసింగ్ విలీనానికి ఆర్బీఐ నో
న్యూఢిల్లీ: లక్ష్మీ విలాస్ బ్యాంకు(ఎల్వీబీ)లో, గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ ఫైనాన్స్ విలీన ప్రతిపాదనకు ఆర్బీఐ అనుమతిని నిరాకరించింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ కమర్షియల్ క్రెడిట్లను లక్ష్మీ విలాస్ బ్యాంకులో స్వచ్ఛంద విలీనానికి చేసుకున్న దరఖాస్తును ఆమోదించడం లేదంటూ ఆర్బీఐ ఈ నెల 9న(బుధవారం) లేఖ ద్వారా తెలియజేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు లక్ష్మీ విలాస్ బ్యాంకు తెలియజేసింది. విలీనానికి అనుమతి కోరుతూ ఎల్వీబీ ఈ ఏడాది మే 7న దరఖాస్తు చేయడం గమనార్హం. కాగా, భారీగా ఎగబాకిన మొండిబకాయిలు, తగినంత మూలధనం లేకపోవడం వంటి ప్రతికూలతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎల్వీబీపై ఇటీవలే ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రేటింగ్స్ కోత
ముంబై: గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐబీహెచ్) దీర్ఘకాలిక కార్పొరేట్ రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2కి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వెల్లడించింది. అలాగే భవిష్యత్ అంచనాలను కూడా ’స్థిర’ స్థాయి నుంచి ’నెగటివ్’ స్థాయికి తగ్గించినట్లు తెలిపింది. దేశీయంగా ఐబీహెచ్‌తో పాటు ఇతరత్రా ఫైనాన్స్ సంస్థలు.. నిధుల లభ్యత, నిధుల సమీకరణ వ్యయాలపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఈ డౌన్‌గ్రేడ్ సూచిస్తుందని మూడీస్ పేర్కొంది. -
ఇండియా బుల్స్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: సోమవారం నాటి నష్టాల మార్కెట్లో ఇండియా బుల్స్ గ్రూపునకు భారీ షాక్ తగిలింది. పలు షెల్ కంపెనీలద్వారా ఇండియాబుల్స్ గ్రూప్ రూ. లక్ష కోట్లకు పైగా నిధులను అక్రమంగా దారి మళ్లించిందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు దీనిపై సిట్ ద్వారా దర్యాప్తు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివారం లేఖ రాసినట్టుగా వార్తలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో దాదాపు100 షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. దీంతో ఈ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంకు(ఎన్‌హెచ్‌బీ) నుంచి షెల్ కంపెనీల ద్వారా నిధులను సమీకరించి ఇండియాబుల్స్ గ్రూప్ అక్రమంగా మళ్లించినట్లు సుబ్రమణ్యన్ స్వామి ఆరోపించారు. మనీలాండరింగ్ స్కామ్ కింద సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐవో, ఐటీ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయవలసిందిగా ప్రధాని మోదీని కోరినట్టు సమాచారం. ట్రేడింగ్‌లో ఇండియాబుల్స్ గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్ కంపెనీల కౌంటర్లలో అమ్మకాల వెల్లువ కురిసింది. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ 10 శాతానికిపైగా పడిపోయి టాప్‌లూజర్‌గా నమోదైంది. ఐబీ వెంచర్స్ 5 శాతం, ఐబీ కన్జూమర్ ఫైనాన్స్ 3 శాతం ఇండియాబుల్స్ రియల్టీ 8.4 శాతం పతనమయ్యాయి. ఐబీ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ షేరు 5శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి రూ. 121.55 వద్ద ఫ్రీజ్ అయింది. మరోవైపు బీజేపీ నేత ఆరోపణలను ఇండియా బుల్స్ హౌసింగ్ బీఎస్ఈ ఫైలింగ్‌లో తీవ్రంగా ఖండించింది. జూన్ 28నాటి సుబ్రమణియన్ స్వామి ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను హైలైట్ చేయాలనుకుంటున్నామంటూ వివరణ ఇచ్చింది. ఎన్‌హెచ్‌బి నుంచి ఇండియాబుల్స్ హౌసింగ్‌కు ఎలాంటి రుణాలులేవని కంపెనీ సీఈవో గగన్ బాంగా స్పష్టం చేశారు. అసలు తమ చరిత్రలో ఎన్‌బీహెచ్ నుంచి లోన్స్ గానీ, రీఫైనాన్సింగ్ నిధులను గానీ తీసుకోలేదన్నారు. తమ మొత్తం లోన్‌బుక్ సుమారు రూ.87,000 కోట్లుగా ఉందని వివరించారు -
ఇండియాబుల్స్ హౌసింగ్ లాభం రూ.1,006 కోట్లు
ముంబై: దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాభం మార్చి త్రైమాసికంలో 2 శాతం తగ్గింది. రూ.1,006 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.3,658 కోట్ల నుంచి రూ.4,091 కోట్లకు పెరిగింది. 2017–18లో మొత్తం ఆదాయం రూ.14,959 కోట్లుగా ఉంటే, 2018–19లో రూ.17,027 కోట్లకు వృద్ధి చెందాయి. తిరిగి వృద్ధి పథంలోకి ప్రవేశించామని, రుణ వితరణ సాధారణంగానే కొనసాగుతోందని కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ గగన్‌బంగా తెలిపారు. 2019–20లో రుణాల్లో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రుణ పుస్తక వృద్ధి నిదానంగానే ఉండాలని తాము తీసుకున్న నిర్ణయం వల్లే రుణాల వితరణ తక్కువగా ఉండడానికి కారణమని గగన్‌బంగా తెలిపారు. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూ.10ను మధ్యంతర డివిడెండ్‌గా ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఇక ఈ ఫలితాలను 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూడరాదని కంపెనీ కోరింది. 2017 నవంబర్‌లో ఓక్నార్త్ బ్యాంకులో వాటాను జీఐసీ సింగపూర్‌కు విక్రయించడం వల్ల రూ.524 కోట్లు గడించినట్టు తెలిపింది. -
ఇండియాబుల్స్ హౌసింగ్ లాభం రూ.1,030 కోట్లు
ముంబై: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,030 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.840 కోట్లు)తో పోల్చితే 23 శాతం వృద్ధి సాధించామని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. రుణ వృద్ధి మెరుగుపడడం, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం, ఫీజు ఆదాయం పెరగడం వల్ల లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ వైస్–చైర్మన్, ఎమ్డీ గగన్ బంగా చెప్పారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పుణే తదితర నగరాల్లో గృహ రుణాలకు డిమాండ్ బాగా ఉందని పేర్కొన్నారు. తగ్గిన మొండి బకాయిలు.. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,906 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధితో రూ.3,847 కోట్లకు పెరిగిందని గగన్ బంగా తెలిపారు. వ్యాపారం రూ.1,03,705 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.1,31,903 కోట్లకు పెరిగిందని వివరించారు. స్థూల మొండి బకాయిలు 0.85 శాతం నుంచి 0.77 శాతానికి, నికర మొండి బకాయిలు 0,36 శాతం నుంచి 0.34 శాతానికి తగ్గాయని తెలిపారు. ఆదాయానికి, వ్యయానికి గల నిష్పత్తి 13.3 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ షేర్ 1 శాతం నష్టంతో రూ.1,355 వద్ద ముగిసింది. ఇంట్రేడేలో ఈ షేర్ 1 శాతానికి పైగా లాభపడి రూ.1,385ను తాకింది. -
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఆదాయం రూ.3,342 కోట్లు
న్యూఢిల్లీ: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.686 కోట్లుగా ఉన్న కంపెనీ నికర లాభం ఈ క్యూ2లో రూ.852 కోట్లకు వృద్ధి చెందిందని కంపెనీ పేర్కొంది. గత క్యూ2లో రూ.2,875 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 16 శాతం వృద్ధితో రూ.3,342 కోట్లకు పెరిగిందని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.9 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ షేర్ సోమవారం ఆల్‌టైమ్ హై రూ.1,375ను తాకింది. చివరకు 1.4% నష్టంతో రూ.1,343 వద్ద ముగిసింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.616గా ఉంది. -
ఇండియాబుల్స్ లాభం రూ.751 కోట్లు
• రూ. లక్ష కోట్లకు చేరిన బ్యాలెన్స్ షీట్ • ఒక్కో షేర్‌కు రూ.9 మధ్యంతర డివిడెండ్ ముంబై: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.751 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో రూ.602 కోట్లుగా ఉన్న నికర లాభంతో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.1261 కోట్లకు చేరడంతో నికర లాభంలో ఈ స్థాయి వృద్ధి సాధించామని కంపెనీ వైస్–చైర్మన్, ఎండీ గగన్ బంగా పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.9 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. నిలకడగా రుణ నాణ్యత: అందుబాటు ధరల గృహ రుణాల జోరుతో మొత్తం గృహ రుణాలు 30 శాతం వృద్ధి సాధించడంతో తమ బ్యాలెన్స్ షీట్ ఈ క్యూ3లోనే రూ. లక్ష కోట్ల (1 ట్రిలియన్)ను మించిందని బంగా వివరించారు. 2019–19 కల్లా రూ. లక్షన్నర కోట్ల మైలురాయిని అందుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తమపై పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం లేదని, అందుబాటు ధరల గృహ రుణాలు రూ.6,000 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఆదాయ, వ్యయ నిష్పత్తి 14.3 శాతం నుంచి 13.8 శాతానికి తగ్గడం వల్ల కూడా నికర లాభం పెరిగిందని చెప్పారు. రుణ వ్యయాలు 74 బేసిస్ పాయింట్ల స్థాయిలోనే నిలకడగా ఉన్నాయని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 0.85 శాతంగా, నికర మొండి బకాయిలు 0.36 శాతంగా ఉన్నాయని వివరించారు. -
హెచ్డీఎఫ్సీ, కార్పొరేషన్ బ్యాంక్ రేట్ల కోత
న్యూఢిల్లీ: వడ్డీరేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల వరుసలో తాజాగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్డీఎఫ్సీ, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నిలిచాయి. దీనితోపాటు కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు కూడా తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణ రేటును తగ్గించాయి. వేర్వేరుగా చూస్తే... హెచ్డీఎఫ్సీ: మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌ను 0.45% వరకూ తగ్గించింది. రూ.75 లక్షల వరకూ రుణ రేటు వార్షికంగా 8.7%గా ఉంటుంది. అంతకుమించి మొత్తాలపై రేటు 8.75%. మహిళా రుణ గ్రహీతలకు మరో 0.05% వరకూ రాయితీ ఉంది. ఇండియా బుల్స్: ఇక ఇండియా బుల్స్ కూడా రుణ రేటును 0.45% వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కార్పొరేషన్ బ్యాంక్: వార్షిక రేటును 0.7% తగ్గించింది. దీనితో ఈ రేటు 8.75 శాతానికి చేరింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: బ్యాంక్ వార్షిక ఎంసీఎల్ఆర్ రేటు 0.8 శాతం తగ్గి, 8.75 శాతానికి దిగింది. డీమోనిటైజేషన్ నేపథ్యంలో బ్యాంకింగ్ వద్ద పెద్ద ఎత్తున లిక్విడిటీ నేపథ్యంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌సహా ఇప్పటికే పలు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేటును తగ్గించడం తెలిసిందే. -
ఇండియా బుల్స్ హౌసింగ్ లాభం 23% వృద్ధి
ముంబై: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి 23 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.511 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.630 కోట్లకు పెరిగిందని సంస్థ తెలిపింది. రుణ వృద్ధి 31 శాతం పెరగడం వల్ల ఈ స్థాయి నికర లాభం వచ్చిందని కంపెనీ డిప్యూటీ ఎండీ అశ్వినీ హుడా తెలిపారు. గత క్యూ1లో రూ.54,000 కోట్లుగా ఉన్న రుణాలు ఈ క్యూ1లో రూ.71,000 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం రూ.821 కోట్ల నుంచి 28 శాతం వృద్ధితో రూ.1,053 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ బీఎస్ఈలో 1 శాతం పెరిగి రూ.742 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.722 టార్గెట్ ధర: రూ.840 ఎందుకంటే: ప్రైవేట్ రంగంలో రెండో అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. కంపెనీ ఆస్తులు రూ.57,231 కోట్లుగా ఉన్నాయి. 220 బ్రాంచీలతో 2,000 మంది శిక్షణ పొందిన ఉద్యోగులతో హౌసింగ్ ఫైనాన్స్ సేవలందిస్తోంది. వేతనాలు పొందే ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందేవారికి, వ్యాపారస్తులకు త్వరితగతిన, సౌకర్యవంతమైన తగిన రీతి వడ్డీరేట్లతో గృహరుణాలనందిస్తోంది. ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,901 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.511 కోట్లకు, ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.1,828 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి నగదు, నగదు సమాన నిల్వలు, ఇన్వెస్ట్మెంట్స్ కలిపి రూ.9,552 కోట్లుగా ఉన్నాయి. బెస్ట్ అఫర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అసోచామ్ హౌసింగ్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఈ ఏడాది ఈ కంపెనీకే లభించింది. కంపెనీ షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.59గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.68గానూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నికర అమ్మకాలు 17 శాతం, నికర లాభం 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మార్కెట్ ధరకు, పుస్తక ధరకు మధ్య నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 2.9గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.3గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.840 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. ఆర్థిక సెంటిమెంట్ పుంజుకుంటుండటం, రుణగ్రస్తుల ఆదాయ స్థాయిలు పెరుగుతుండడం, ప్రాపర్టీల ధరలు తగ్గుతుండడం, వడ్డీరేట్లు దిగివస్తుండడం, చౌక ధరల్లో గృహాలందించడానికి జోరుగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుండడం... ఇవన్నీ కంపెనీకి కలిసివచ్చే అంశాలు. జస్ట్ డయల్: కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.990 టార్గెట్ ధర: రూ.1,200 ఎందుకంటే: భారత్‌లో అతిపెద్ద లోకల్ సెర్చ్ ఇంజిన్ కంపెనీ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థల, ఉత్పత్తుల, సేవల సమాచారాన్ని, సమీక్షలను వినియోగదారులకు అందిస్తోంది. ఇంటర్నెట్, మొబైల్ ఇంటర్నెట్, టెలిఫోన్(వాయిస్), ఎస్ఎంఎస్... ఇలా విభిన్నమైన ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వినియోగదారులకు ఆ వివరాలనందిస్తోంది. లోకల్ సెర్చ్ బిజినెస్‌లో అగ్రస్థానం ఈ కంపెనీదే. 2,000 నగరాల్లో కోటిన్నరకు పైగా లిస్టింగ్స్(వ్యాపార సంస్థల, ఉత్పత్తుల వివరాలు) ఉన్నాయి. 9,500 మంది ఉద్యోగుల సేవలతో ఈ డేటాబేస్‌ను జస్ట్ డయల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది. ఈ కంపెనీ అందిస్తున్న సెర్చ్ ప్లస్ ఫీచర్ ద్వారా లోకల్ సెర్చింగ్ కంపెనీ నుంచి లావాదేవీలు నిర్వహించే కంపెనీగా రూపాంతరం చెందనున్నది. పూర్తి ప్రయోజనాలు రానున్న 2-3 ఏళ్లలో కనిపిస్తాయని అంచనా. ఈ ఏడాది అక్టోబర్‌లో సెర్చ్ ప్లస్‌కు సంబంధించిన ప్రచారాన్ని మరింత విస్తృతంగా తీసుకురానున్నది. సినిమా టికెట్ల బుకింగ్, క్యాబ్, బస్, విమానటికెట్ల బుకింగ్, రెస్టారెంట్లకు సంబంధించి ఆర్డరింగ్, టేబుల్ బుకింగ్స్, ఆన్లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపు వంటి సేవలను సెర్చ్ ప్లస్ ఆఫర్ చేస్తోంది. జేడీ సెర్చ్‌ప్లస్ ప్లాట్‌ఫారమ్ కింద ఆన్లైన్ ఫుడ్ డెలివరి,వైన్ డెలివరి, డాక్టర్ అపాయింట్మెంట్, ట్యాక్స్ బుకింగ్స్ వంటి 57 రకాల ప్రొడక్ట్‌లను ఆఫర్ చేస్తోంది. లిస్టింగ్స్, లావాదేవీలను కలగలిపిన సేవలను సెర్చ్‌ప్లస్ అందించనున్నది. ఆర్బీఐ నుంచి కొన్ని అనుమతులు రావలసి ఉన్నం దున జేడీ వాలెట్‌ను వాయిదా వేసిన కంపెనీ యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి కో-బ్రాండెడ్ వాలెట్‌ను అందించాలని యోచిస్తోంది. జస్ట్ డయల్ గ్యారంటీడ్, జస్ట్ డయల్ క్యాష్, ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ వంటి కొత్త సర్వీసులను అందుబాటులోకి తేనున్నది. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. APPకీ కహానీ... డైలీ ఎక్స్పెన్సెస్ ఖర్చులుపెరిగిపోతున్నాయనో, వాటిపై నియంత్రణ తప్పిపోతోందనో, మీకు తెలియకుండానే ఖర్చు పెట్టేస్తున్నారనో ఇక ఎలాంటి దిగులూ అవసరం లేదు. ఎందుకంటే మీ మొబైల్లోనే మీ ఆర్థిక లావాదేవీల నిర్వహణ ఎంచక్కా ఈజీగా చేసేసుకోవటానికి చక్కని యాప్ రెడీగా ఉంది. అదే ‘డైలీ ఎక్స్పెన్సెస్’. ఇది మీ ఆదాయానికి తగినట్లుగా ఖర్చులెలా చేయాలో చెబుతుంది. తగిన సూచనలిస్తుంది. ఖర్చులను నియంత్రించి, డబ్బును పొదుపు చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై లభిస్తున్న ఈ యాప్‌ను యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవీ ప్రత్యేకతలు * ఆదాయ, వ్యయాలను పరిశీలించి బడ్జెట్‌ను రూపొందిస్తుంది. * మీ ఆదాయాలకు, ఖర్చులకు సంబంధించిన లావాదేవీలను కేటగైరె జ్ చేస్తుంది. * ఆదాయ, వ్యయాలకు సంబంధించి క్రియేట్ చేసిన రికార్డులను తొలగించవచ్చు కూడా. * భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బిల్స్ రిమైండ ర్లను, బిల్స్ అలర్ట్స్‌ను సెట్ చేసుకోవచ్చు. * ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ఇంటర్నెట్ లేనపుడు ఆఫ్‌లైన్‌లో కూడా చూసుకోవచ్చు. * పాస్వర్డ్ పెట్టుకునే వీలున్న ఈ యాప్‌లో యూజర్ల సమాచారానికి కంపెనీ భరోసా ఇస్తోంది. * ఆదాయం ఎన్ని మార్గాల్లో వస్తుందో, అది ఏ విధంగా ఖర్చు అవుతుందో, ఏ ప్రాంతంలో వెచ్చిస్తున్నామో వంటి అంశాలను రోజూ వారీగా, వారం వారీగా, నెల వారీగా, నెలల వారీగా, ఏడాది వారీగా చూసుకోవచ్చు. బ్రీఫ్స్ అవైవా ధన్వృద్ధి ప్లస్ ప్రైవేటు రంగ బీమా కంపెనీ అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ ధన్వృద్ధి ప్లస్ పేరుతో పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించే ఎండోమెంట్ పాలసీని మార్కెట్లోకి విడుదల చేసింది. 20 ఏళ్ల కాలపరిమితి గల ఈ పాలసీకి ప్రీమియం 5 లేదా 7 లేదా 11 ఏళ్లు చెల్లిస్తే సరిపోతుంది. పాలసీ కాలపరిమితి తర్వాత 100 శాతం ప్రీమియంతో పాటు బోనస్‌లు చెల్లించడం జరుగుతుంది. ఈ పాలసీని 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు తీసుకోవచ్చు. కోటక్ ఇండియా గ్రోత్ ఫండ్ కోటక్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘ఇండియా గ్రోత్’ సిరీస్-2 ఈక్విటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ ఆర్థిక వృద్ధిరేటుకు దోహదం చేసే రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇది క్లోజ్డ్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే 1,095 రోజుల వరకు వైదొలగడానికి ఉండదు. సెప్టెంబర్ 22న ప్రారంభమైన ఎన్ఎఫ్వో అక్టోబర్ 6తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్మెంట్ విలువ రూ. 5,000గా నిర్ణయించారు.