ముంబై: గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐబీహెచ్) దీర్ఘకాలిక కార్పొరేట్ రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2కి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వెల్లడించింది. అలాగే భవిష్యత్ అంచనాలను కూడా ’స్థిర’ స్థాయి నుంచి ’నెగటివ్’ స్థాయికి తగ్గించినట్లు తెలిపింది. దేశీయంగా ఐబీహెచ్‌తో పాటు ఇతరత్రా ఫైనాన్స్ సంస్థలు.. నిధుల లభ్యత, నిధుల సమీకరణ వ్యయాలపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఈ డౌన్‌గ్రేడ్ సూచిస్తుందని మూడీస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment