moody
-
చిన్న పిల్లల్లో కూడా డిప్రెషన్..?
పిల్లలంటే ఆడుతూ పాడుతూ హాయిగా ఉంటారు... అంతేగానీ పెద్దవాళ్లకు ఉండే సాధారణ బాధలూ, వాటి కారణంగా కుంగుబాటు వంటి సమస్యలు వాళ్లకు ఉండవని చాలామంది అనుకుంటారు. కానీ... చిన్నపిల్లలకూ డిప్రెషన్ రావచ్చు. అందరు పిల్లలూ ఒకేలా ఉండరు. కొంతమంది సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వాళ్లు త్వరగా డిప్రెషన్‌కు లోనవుతారు. పిల్లలు ఒంటరిగా ఉండటం, స్నేహితులు బాధపెట్టినప్పుడు ఏడ్వటం వంటి లక్షణాలతోనే పిల్లలు డిప్రెషన్‌కు లోనయ్యారని అనుకోకూడదు. చదువులపైనా, ఆటపాటలపై శ్రద్ధ చూపకుండా, ప్రతిదానికీ నిరుత్సాహంగా, ఎప్పుడూ నిరాశతోనే ఉంటే అది డిప్రెషన్ కావచ్చేమోనని అనుమానించాలి. డిప్రెషన్‌కు లోనైన పిల్లలందరూ ఏడుస్తూ ఉండరు. తమ బాధను కోపం, చిరాకు రూపంలో వ్యక్తపరుస్తారు. ఇలాంటి పిల్లలు త్వరగా నీరసపడతారు. తీవ్రంగా ఆకలి ఉండటం లేదా అస్సలు ఆకలి లేకపోవడం, చాలా ఎక్కువగా నిద్రపోవడం లేక తీవ్రమైన నిద్రలేమి వంటి లక్షణాలు ఉంటే అది చిన్నపిల్లల్లో డిప్రెషన్‌కు సూచన కావచ్చు. అందుకే డిప్రెషన్‌తో బాధపడే పిల్లల్లో ఒబేసిటీ లేదా తక్కువ బరువు ఉండటం వంటి బాధలు వస్తాయి. డిప్రెషన్‌తో బాధపడే పిల్లలు తమకు రకరకాల శారీరక సమస్యలు ఉన్నాయంటూనో లేదా దేహంలో అనేక చోట్ల నొప్పిగా ఉందనో మాటిమాటికీ ఫిర్యాదు చేస్తారు. యుక్తవయసులోకి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా మూడ్స్‌లో మార్పులు (మూడ్ స్వింగ్స్) వచ్చి వాళ్లలో భావోద్వేగాలు త్వరత్వరగా మారిపోతూనే అవి తీవ్రంగా చెలరేగిపోతున్నట్లుగా వ్యక్తమయ్యే అవకాశాలూ ఉంటాయి. ఇలాంటి పిల్లలను ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్లో రెండు మూడు వారాలకు పైగా డిప్రెషన్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటే వైద్యుల సలహా మేరకు చికిత్స చేయించాల్సి ఉంటుంది. చికిత్సతో పాటు తల్లిదండ్రులు పిల్లలకు తగిన ప్రోత్సాహాన్ని ఇస్తూ కుటుంబంలో వారికి అనువైన వాతావరణం కల్పించాలి. బైపోలార్ డిజార్డర్, అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివ్ డిజార్డర్, ఆటిజమ్, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, యాంగై్జటీ వంటి మానసిక సమస్యలు ఉన్న పిల్లల్లో వాటితో పాటు డిప్రెషన్ లక్షణాలు కలిపిపోయి కనిపిస్తాయి. టీనేజ్‌లో ఉన్న పిల్లల ఎదుగుదల సమయంలో పేరెంట్స్ తగిన శ్రద్ధ తీసుకోవాలి. వాళ్లు భవిష్యత్తులో ఎదుర్కొనే అనారోగ్య సమస్యలను, మానసిక సమస్యలను నివారించాలంటే వారికి తగిన సమయంలో ఆప్యాయతతో కూడిన కౌన్సెలింగ్, మంచి చికిత్స ఇప్పించాలి. -
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రేటింగ్స్ కోత
ముంబై: గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐబీహెచ్) దీర్ఘకాలిక కార్పొరేట్ రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2కి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వెల్లడించింది. అలాగే భవిష్యత్ అంచనాలను కూడా ’స్థిర’ స్థాయి నుంచి ’నెగటివ్’ స్థాయికి తగ్గించినట్లు తెలిపింది. దేశీయంగా ఐబీహెచ్‌తో పాటు ఇతరత్రా ఫైనాన్స్ సంస్థలు.. నిధుల లభ్యత, నిధుల సమీకరణ వ్యయాలపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఈ డౌన్‌గ్రేడ్ సూచిస్తుందని మూడీస్ పేర్కొంది. -
మెరుగుపడనున్న కంపెనీల రేటింగ్
ముంబై: భారత కంపెనీల క్రెడిట్ రేటింగ్ వచ్చే ఏడాది మెరుగుపడే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ,మూడీస్ తెలిపింది. జీఎస్టీ సంబంధిత సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతున్నాయని, ఆర్థిక కార్యకలాపాలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయని, దీంతో కంపెనీల పరపతి రేటింగ్ మెరుగుపడుతుందని మూడీస్ పేర్కొంది. కంపెనీల స్థూల లాభం 5–6 శాతం వృద్ధి ! వచ్చే ఏడాది జీడీపీ 7.6 శాతంగా ఉండనున్నదని, ఫలితంగా అమ్మకాలు పుంజుకుంటాయని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ ఎనలిస్ట్ కౌస్తుభ్ చౌబల్ చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగుపడటం, కమోడిటీ ధరలు తగిన స్థాయిలోనే ఉండటం, వంటి కారణాల వల్ల 12–18 నెలల కాలంలో భారత కంపెనీల స్ఠూల లాభం 5–6 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. ఆయిల్, రియల్టీ, వాహన, వాహన విడిభాగాలు, ఐటీ సర్వీసుల కంపెనీలకు నిలకడ అవుట్‌లుక్‌ను ఇస్తున్నామని తెలిపారు. తీవ్రమైన పోటీ కారణంగా ఆదాయం, మార్జిన్లపై ఒత్తిడి నెలకొంటుందని, అందుకని టెలికం కంపెనీలకు మాత్రం ‘ప్రతికూలం’ అవుట్‌లుక్‌ను ఇస్తున్నామని పేర్కొన్నారు. రుణ పరిస్థితులు మెరుగుపడతాయ్.. వచ్చే ఏడాది పలు కంపెనీలు తమ రుణ పునర్వ్యవస్థీకరణ అవసరాలను సులభంగానే నిర్వహించుకోగలవని చౌబల్ వివరించారు. జీఎస్టీ పన్ను రేట్లలో మరింతగా సరళీకరణ, ఇతర సంస్థాగత సంస్కరణలు, తదితర అంశాల కారణంగా కంపెనీల నిర్వహణ లాభం పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో కంపెనీల రుణ పరిస్థితులు మెరుగుపడతాయని వివరించారు. ఆస్తుల వేల్యూయేషన్లు మెరుగుపడటం కూడా కొన్ని కంపెనీల రుణ పరిస్థితులు మెరుగుపడటటనికి దారితీస్తుందని పేర్కొన్నారు. అయితే వృద్ధి 6 శాతం కంటే తక్కువగా ఉండటం, కమోడిటీ ధరలు తగ్గడం వంటి ప్రతికూలతలు చోటు చేసుకుంటే మాత్రం కంపెనీల స్థూల లాభాల్లో వృద్ధి తక్కువగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
మూడీగా ఉండటం అందుకు మంచిదే!
లండన్: మూడీగా ఉండటంవల్ల కొన్ని దుష్ప్రభావాలు సంభవించవచ్చేమోగానీ, దానివల్ల వ్యక్తిగతంగా సత్వర మార్పు మాత్రం పొందడం ఖాయం అంటున్నారు లండన్‌కు చెందిన కొందరు ప్రముఖ పరిశోధకులు. మూడీగా ఉన్నవారు జీవితానికి సంబంధించిన సానుకూల అంశాలుగానీ, ప్రతికూల అంశాలుగానీ తొందరగా స్వాగతిస్తారని, వారిలో సత్వర మార్పును తెచ్చుకుంటారని ఎరాన్ ఎల్దార్ అనే యూనివర్సిటీ ఆఫ్ లండన్ కు చెందిన పరిశోధనకారుడు తెలిపారు. 'మూడీనెస్ వ్యక్తిగతంగా సత్వర మార్పులను ఆహ్వానించడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిని పాజిటివ్‌గా తీసుకోవాలనుకున్నా, నెగిటివ్‌గా తీసుకోవాలనుకున్నా వారి ఇష్టం. అయితే, ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉన్నందున నైపుణ్యాలు పెంచుకోవడం, సామాజిక లక్ష్యాలు పెట్టుకోవడం, హుందాను, హోదాను కోరుకోవడంలాంటి పాజిటివ్ లక్ష్యాలను పెట్టుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.