లండన్: మూడీగా ఉండటంవల్ల కొన్ని దుష్ప్రభావాలు సంభవించవచ్చేమోగానీ, దానివల్ల వ్యక్తిగతంగా సత్వర మార్పు మాత్రం పొందడం ఖాయం అంటున్నారు లండన్కు చెందిన కొందరు ప్రముఖ పరిశోధకులు. మూడీగా ఉన్నవారు జీవితానికి సంబంధించిన సానుకూల అంశాలుగానీ, ప్రతికూల అంశాలుగానీ తొందరగా స్వాగతిస్తారని, వారిలో సత్వర మార్పును తెచ్చుకుంటారని ఎరాన్ ఎల్దార్ అనే యూనివర్సిటీ ఆఫ్ లండన్ కు చెందిన పరిశోధనకారుడు తెలిపారు.
'మూడీనెస్ వ్యక్తిగతంగా సత్వర మార్పులను ఆహ్వానించడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిని పాజిటివ్గా తీసుకోవాలనుకున్నా, నెగిటివ్గా తీసుకోవాలనుకున్నా వారి ఇష్టం. అయితే, ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉన్నందున నైపుణ్యాలు పెంచుకోవడం, సామాజిక లక్ష్యాలు పెట్టుకోవడం, హుందాను, హోదాను కోరుకోవడంలాంటి పాజిటివ్ లక్ష్యాలను పెట్టుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
మూడీగా ఉండటం అందుకు మంచిదే!
Published Wed, Nov 4 2015 4:37 PM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM
Advertisement