న్యూఢిల్లీ: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.686 కోట్లుగా ఉన్న కంపెనీ నికర లాభం ఈ క్యూ2లో రూ.852 కోట్లకు వృద్ధి చెందిందని కంపెనీ పేర్కొంది.
గత క్యూ2లో రూ.2,875 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 16 శాతం వృద్ధితో రూ.3,342 కోట్లకు పెరిగిందని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.9 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పేర్కొంది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ షేర్ సోమవారం ఆల్‌టైమ్ హై రూ.1,375ను తాకింది. చివరకు 1.4% నష్టంతో రూ.1,343 వద్ద ముగిసింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.616గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment