సాంకేతిక శిక్షణ, ఐటీ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్లు అందించే విన్సిస్ ఐటీ సర్వీసెస్ ఇండియా ఈ ఏడాది(2024–25) తొలి ఆరు నెలల్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. చిన్న సంస్థల కోసం ఏర్పాటైన ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయిన కంపెనీ నికర లాభం ఏప్రిల్–సెప్టెంబర్‌లో 36 శాతం జంప్‌చేసి రూ. 11 కోట్లకు చేరింది.
గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం ఎగసి రూ. 92 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. నిర్వహణ లాభం(ఇబిటా) 53% జంప్‌చేసి రూ. 15 కోట్లను దాటింది.
"ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. ముఖ్యంగా భారత్‌లో డిమాండ్ మందగించడం, సిబ్బంది వ్యయం పెరగడం వంటి ఇబ్బందులు పడ్డాం. అయితే మా సామర్థ్యాలు, భౌగోళికాలు, సౌకర్యాలపై సకాలంలో పెట్టుబడి పెట్టగలిగినందున అటువంటి అనిశ్చితులను ఎదుర్కొనేందుకు బలమైన పునాదిని ఏర్పాటు చేశాం" అని విన్సిస్ చైర్మన్, ఎండీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment