పెద్దేముల్ (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ విజయా బ్యాంకులో ఒక మహిళ తన అకౌంట్‌లో జమచేసేందుకు నకిలీ నోట్లు తీసుకురావడంతో బ్యాంకు సిబ్బంది కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పెద్దేముల్‌లో పాలిష్ కంపెనీలో పనిచేస్తున్న అలివేలు అనే మహిళ తన అకౌంట్‌లో జమ చేసేందుకు రూ. 40 వేలు విలువైన వెయ్యిరూపాయల నోట్లు తెచ్చింది.
వాటిని పరిశీలించిన బ్యాంకు అధికారులు అవి నకిలీవని గుర్తించారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు తాను పనిచేసే యజమాని ఈ నోట్లు ఇచ్చాడని అలివేలమ్మ పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీనోట్లతో బ్యాంకుకు వెళ్లిన మహిళ
Published Thu, Mar 10 2016 3:42 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement