విజయ బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం | try to robery in vijaya bank | Sakshi
Sakshi News home page

విజయ బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం

Published Sun, Aug 28 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

try to robery in vijaya bank

ఉండి : కోలమూరు విజయబ్యాంకును దోచుకునేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కోలమూరులోని విజయబ్యాంకులో శుక్రవారం రాత్రి దొంగలు దోపిడీకి యత్నించారు. బ్యాంకు వెనక వైపున ఉన్న కిటికీని బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించేందకు యత్నించారు. వీలుకాకపోవడంతో వదిలి వెళ్లిపోయారు. శనివారం బ్యాంకు మేనేజర్‌ తిర్కువల్లూరి మోహ¯Œæలక్షీ్మనారాయణ కిటీకీలు  బద్దలు కొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఈ బ్యాంకు సమీపంలోనే ఉన్న ఉండి కో–ఆపరేటివ్‌ రూరల్‌ బ్యాంకు బ్రాంచి పక్క ఇంటిలో దుండగులు రూ.45వేల విలువైన బంగారువస్తువులు దోచుకెళ్లారు. దీంతో ఇంటి యజమానురాలు పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎం.రవివర్మ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement