robery
-
పిల్లల కథ: దొంగ చెప్పిన తీర్పు!
పూర్వం అవంతీపురంలో రామగుప్తుడు, ధనగుప్తుడు అనే వర్తకులు ఉండేవారు. వ్యాపార నిమిత్తం డబ్బులు అవసరమై ధనగుప్తుడు రామగుప్తుని దగ్గరకు వెళ్ళి వెయ్యి వరహాలు అప్పుగా ఇవ్వమని అడిగాడు. తోటి వర్తకుని మాట కాదనలేక రామగుప్తుడు వెయ్యి వరహాలు ధనగుప్తుడికి అప్పుగా ఇచ్చాడు. చాలాకాలం గడిచింది. అయినా ధనగుప్తుడు రామగుప్తునికి ఇవ్వవలసిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఇక లాభం లేదు అనుకుని రామగుప్తుడు స్వయంగా ధనగుప్తుడిని కలసి తాను ఇచ్చిన వెయ్యి వరహాలు ఇవ్వమని అడిగాడు. రేపు, మాపు అంటూ మాట దాటవేశాడు తప్ప అప్పు తీర్చలేదు ధనగుప్తుడు. అటు తర్వాత ధనగుప్తుడు ఆ ప్రాంతంలో కనిపించనేలేదు. చేసేదేమీ లేక బాధపడ్డాడు రామగుప్తుడు. ఓసారి వ్యాపార నిమిత్తం చంద్రగిరికి వెళ్ళాడు రామగుప్తుడు. పనులన్నీ ముగించుకుని పూటకూళ్లవ్వ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తారసపడ్డాడు ధనగుప్తుడు. వెతకబోయిన తీగ కాళ్ళకి తగినట్లు సంబరపడ్డాడు రామగుప్తుడు. ‘మిత్రమా బాగున్నావా?’ అని పలకరించాడు. రామగుప్తుణ్ణి చూడగానే గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది ధనగుప్తుడికి. ‘ఏం బాగు? వ్యాపారం దివాళా తీసింది. దేశ దిమ్మరిలా తిరుగుతున్నాను’ అన్నాడు. ‘నీ మాటలు నేను నమ్మను. ఇప్పటికే చాలా కాలమైంది. నా వెయ్యి వరహాలు ఇస్తావా? ఇవ్వవా? స్నేహితుడివని వడ్డీ కూడా అడగలేదు. అసలు కూడా ఇవ్వకపోతివి’ అని గట్టిగా నిలదీశాడు రామగుప్తుడు. ‘ఏంటి మీ గొడవ?’ అంటూ పూటకూళ్ళవ్వ అడిగింది. జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రామగుప్తుడు. ‘సరే! ఏదో పని మీద మా మంత్రి గారు ఈ ఊరు వచ్చారు. మీరిద్దరూ మంత్రి సులోచనుడి దగ్గరికి వెళ్ళండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది’ అని సలహా ఇచ్చింది పూటకూళ్ళవ్వ. సరేనని ఇద్దరూ మంత్రి సులోచనుడి వద్దకు వెళ్ళారు. ‘అయ్యా మా ఇద్దరిదీ అవంతీపురం. చాలా కాలం క్రితం వ్యాపార నిమిత్తం నా దగ్గర వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నాడు ఈ ధనగుప్తుడు. నా అప్పు తీర్చమంటే తీర్చడం లేదు’ అని ఫిర్యాదు చేశాడు రామగుప్తుడు. ‘అదంతా వట్టి అబద్ధం. నేను ఇతని వద్ద అప్పు తీసుకోలేదు. తీసుకుంటే వడ్డీ ఎంత? పత్రం ఏదీ?’ అని బుకాయించాడు ధనగుప్తుడు. మంత్రి సులోచనుడు కాసేపు ఆలోచించి.. ‘రామగుప్తా నువ్వు అప్పు ఇచ్చినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా?’ అడిగాడు. ‘నా దగ్గర ఏ ఆధారాలు లేవు’ అని జవాబిచ్చాడు రామగుప్తుడు. ‘ఆధారాలు లేనప్పుడు ఎలా శిక్షించగలను? నువ్వు అప్పు ఇవ్వడం నిజమే అయినా నీ సొమ్ము ఎలా ఇప్పించగలను?’ అన్నాడు మంత్రి. చేసేదేమీ లేక దిగాలుగా రామగుప్తుడు, ‘నన్నేమీ చేయలేవు’ అనే అహంభావంతో ధనగుప్తుడు పూటకూళ్లవ్వ ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనాలయ్యాయి. అందరూ కబుర్లు చెప్పుకుని హాయిగా పడుకున్నారు. రెండో ఝాము అయ్యింది. ‘ధడేల్’మని చప్పుడు అయ్యింది. భయపడుతూ అందరూ ఒక్కసారి నిద్రలేచారు. ఏమయ్యిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ‘ఎవ్వరైనా కదిలారో చంపేస్తా’ అన్న మాటలు గట్టిగా వినిపించాయి. లాంతరు వెలుగులో అతని ఆకారాన్ని బట్టి గజదొంగ అని గుర్తించి భయం భయంగా కూర్చున్నారు అందరూ. ఆ గజదొంగ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ‘మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం మాట్లాడకుండా ఇచ్చేయండి లేదా పీక కోస్తా’ అని బెదిరించాడు. ‘బతికుంటే బలుసాకైనా తినవచ్చు’ అనుకుని ఒంటి మీద ఉన్న బంగారం, సంచిలో ఉన్న డబ్బులు ఒక్కొక్కరుగా ఇవ్వసాగారు. ఇది గమనించిన ధనగుప్తుడు.. తన దగ్గర ఉన్న వెయ్యి వరహాల సంచిని రామగుప్తుడి చేతిలో పెట్టి ‘నీ అప్పు తీరిపోయింది.. తీసుకో’ అన్నాడు. ఇప్పుడు తీసుకుంటే దొంగ పాలు అవుతుందని గ్రహించిన రామగుప్తుడు ఆ వరహాలను తీసుకోలేదు. ఆ గజదొంగ నేరుగా ధనగుప్తుడి దగ్గరికి వచ్చి ‘నీ దగ్గర ఉన్న డబ్బులు, బంగారం బయటకి తియ్’ అని గద్దించాడు. ‘ఈ వెయ్యి వరహాలు ఇతనికి అప్పు తీర్చవలసినవి. నా దగ్గర మరేమీ లేవు’ అన్నాడు ధనగుప్తుడు వణుకుతూ. ‘అయితే నీకు ఏ శిక్ష వెయ్యాలో నువ్వే చెప్పు’ అన్నాడు గజదొంగ. గజదొంగ వేషంలో ఉన్నది సులోచనుడని గ్రహించి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు ధనగుప్తుడు. ‘ఆధారం లేకపోతే అన్యాయం చేస్తావా? నీతిగా బతకడం నేర్చుకో’ అని మందలించి విడిచిపెట్టాడు సులోచనుడు. తన తప్పును మన్నించమని రామగుప్తుణ్ణి కోరాడు ధనగుప్తుడు. -కాశీ విశ్వనాథం పట్రాయుడు -
జగ్గంపేటలో భారీ చోరీ
గండేపల్లి/జగ్గంపేట: ఒక విశ్రాంత ఉద్యోగి ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి దుండగులు ప్రవేశించి రూ.12 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, ఒక బైక్‌ను దొంగిలించుకుపోయారు. జగ్గంపేట బాలాజీనగర్‌లోని ఘటనా స్థలాన్ని సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్ఐ సీహెచ్ విద్యాసాగర్ పరిశీలించారు. వారి వివరాల మేరకు ఉప్పలపాడుకు చెందిన బుర్రి వెంకటరమణ ఉద్యోగ రీత్యా బాలాజీనగర్‌లో ఇటీవల నిర్మించుకున్న మూడు అంతస్తుల భవనంలో రెండవ అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆయన బంధువైన విశ్రాంత ఉద్యోగి (బీఎస్ఎన్ఎల్) పుర్రె సూరన్న, ఉమాదేవి మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. సూరన్న, ఉమాదేవి బుధవారం మధ్యా«హ్నం కాకినాడ వెళ్లి రాత్రికి అక్కడ ఉన్న తమ సొంత ఇంట్లో ఉండిపోయారు. తెల్లావారేసరికి జగ్గంపేటలో వారు ఉంటున్న ఇంటి తలుపు తాళాలతోపాటు బీరువా తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంటి యజమాని బుర్రి వెంకటరమణ గమనించి సమాచారం అందించడంతో వారు వెంటనే జగ్గంపేట చేరుకున్నారు. ఇంట్లో గల బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దుస్తులు, వెండి వస్తువులు చెల్లా చెదురు అయ్యాయి. లాకర్లో ఉన్న 26 కాసుల బంగారు వస్తువులు చోరీ అయినట్టు గుర్తించారు. మూడు ఉంగరాలు, నక్లెస్, కాసులపేరు, ఏడు జతల చెవి దుద్దులు, నాలుగు లాకెట్స్, నల్లపూసల గొలుసు, పూజా పుష్పం, గోల్డ్ బిస్కెట్, మూడు గొలుసులతోపాటు మోటార్ సైకిల్ చోరీకి గురైనట్టు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కాకినాడ క్రైం డీఎస్పీ రాంబాబు, పెద్దాపురం ఇన్చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, జగ్గంపేట సీఐ, ఎస్ఐ బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించగా డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. చోరీ జరిగిన ఇంటికి సమీపంలో గల ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో బుధవారం అర్ధరాత్రి 1.16 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై తచ్చాడటాన్ని గుర్తించారు. నీలాద్రిరావుపేట, తదితర చోట్ల గల సీసీ కెమెరాలను పోలీసు బృందాలు తనిఖీ చేస్తున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
గచ్చి బౌలి దొంగతనం కేసును చేధించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గచ్చి బౌలి టెలికాం నగర్లో నివాసం ఉంటున్న గోవిందరావ్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నిందితులు నేపాల్‌కు చెందిన లంక బహదూర్ సాహి అతని భార్య పవిత్రగా గుర్తించారు. వీరిని సోలాపూర్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల వద్ద నుంచి ఏడు లక్షల ఇరవై మూడు వేల రూపాయల నగదుతో పాటు 61 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. నిందితులు గత ఐదు నెలల క్రితం గోవింద రావ్ అనే వ్యక్తి ఇంట్లో పని మనుషులుగా చేరారు. ఆపై ఇద్దరు చాలా నమ్మకంగా యజమానితో వ్యవహరించారు. ఈ నెల 18న గోవింద రావు అతని ఫ్రెండ్‌తో కలిసి శ్రీశైలంకు వెళ్లగా ఆ సమయంలో అతని ఇంట్లో దొంగతనం జరిగింది. గోవింద్ రావ్ ఈ నెల 19న శ్రీశైలం నుంచి తిరిగి వచ్చే సరికి అక్కడ దొంగతనం జరగడం వీటితో పాటు పని వాళ్లు కనపడకపోవడంతో అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో నిందితులను పట్టుకోవడం కోసం పోలీసులు నాలుగు టీంలను ఏర్పాటు చేయగా ఎట్టకేలకు ఇద్దరిని పక్కా సమాచారం ప్రకారం సోలాపూర్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. నేరుగా నేపాల్‌కు వెళ్లకుండా సోలాపూర్ లో కొంతకాలం ఉండి ఆపై నేపాల్ వెళ్లాలని వారు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యమ్లాల్ అనే వ్యక్తి ఈ నిందితులిద్దరిని గోవింద్ దగ్గర పనికి కుదిర్చినట్టు తెలిపారు. యమ్లాల్ అనే వ్యక్తి పాత్రపై కూడా విచారణ చేస్తున్నట్లు, అతను నేపాల్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అంత్యక్రియలకు డబ్బుల్లేక దుప్పట్లో భార్య మృతదేహాన్ని.. -
పాపం.. దొంగొడి మాస్టర్ ప్లాన్ .. ట్విస్ట్ ఏంటంటే..
బ్యాంకాక్: మీరు ‘అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి’ అనే సామెత వినే ఉంటారు. దీన్ని, మనం ఒకటి ఊహించి పనిచేస్తే.. దానికి పూర్తి వ్యతిరేకంగా దాని ఫలితం ఉంటున్నదన్నమాట. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడో వ్యక్తికి అలాంటి పరిస్థితే ఎదురైంది. వివరాలు..ఈ సంఘటన థాయిలాండ్‌లో చోటుచేసుకుంది. ఛోబూరి పట్టణానికి చెందిన సుఫాచాయ్ పాంథాంగ్కు 27 ఏళ్లు. ఇతను గత కొంత కాలంగా చోరీలకు అలవాటుపడ్డాడు.దీంతో, ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. బంగారం చాలా విలువైంది.. దాన్ని చోరీచేస్తే కొంత కాలం హయిగా ఉండోచ్చని అనుకున్నాడు. ఒక రోజు ఛోబూరిలోని ఒక బంగారు దుకాణంలో కస్టమర్లా వెళ్లి అక్కడి ఆభరణాలను చూశాడు. అదునుకోసం ఎదురు చూశాడు. ఆ దుకాణంలో రద్దీ కూడా లేదు. కాసేపటికి మెల్లగా, అటూ.. ఇటూ చూసి చైన్‌ను ట్రయల్ చేస్తున్నట్లు మెడలో వేసుకున్నాడు. ఆ షాపు యజమాని వేరే పనిలో ఉండటాన్ని గమనించాడు. అప్పుడు, మెల్లగా జారుకుని.. షాపు నుంచి బయటకు వెళ్లే మార్గం వైపుకు పరిగెత్తాడు. వెంటనే హడవుడిగా డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. పాపం.. అక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అతను ఎంత గింజుకున్నా ఆ తలుపు తెరుచుకోలేదు. దీంతో అతగాడికి చెమటలు పట్టాయి. నిజానికి ఆ దుకాణం తలుపు రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. కాసేపటికి, ఆ యువకుడు ఏమికానట్లు ఆ చైన్‌ను షాపు యజమానికి తిరిగి ఇచ్చేశాడు. అయితే, ఆ యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆ యువకుడు, ‘నన్ను ఒక కంపెనీవారు ఉద్యోగం నుంచి తొలగించారు. కేవలం, ఆర్థిక సమస్యల వలన చోరీ చేశానని తెలిపాడు. ఈ వీడియో గతంలోనే జరిగింది. ప్రస్తుతం తిరిగి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. అతని మాస్టర్ ప్లాన్ ఫెయిలయ్యింది..’, ‘అయ్యో.. అతను ఉద్యోగం లేకపోవడంతోనే ఇలాచేశాడు..’ ‘ ఏదైన.. అతను చేసింది తప్పే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. pic.twitter.com/dZFHz5NtqS — people who died but are doing well (@jamorreram0) June 27, 2021 -
ఐదింతలు పెరిగిన రైళ్లల్లో చోరీ కేసులు
న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో రైళ్లలో దొంగతనం కేసులు ఐదింతలు పెరిగాయి. రైళ్లల్లో దొంగతనం ఘటనలకు సంబంధించి 2009 నుంచి 2018 వరకూ 1,71,015 కేసులు నమోదైనట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందులో 2018లో అత్యధికంగా 36,584 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు పీటీఐ వార్తా సంస్థకు చెందిన ఓ పాత్రికేయుడు ఆర్టీఐ ద్వారా రాసిన లేఖకు రైల్వే సమాధానమిచ్చింది. రైల్వే శాఖ సమాచారం ప్రకారం రైళ్లల్లో దొంగతనం ఘటనలకు సంబంధించి 2017లో 33,044, 2016లో 22,106, 2015లో 19,215, 2014లో 14,301, 2013లో 12,261, 2012లో 9,292, 2011లో 9,653, 2010లో 7,549, 2009లో 7,010 కేసులు నమోదయ్యాయి. -
ఇది ఉందంటే దొంగతనాలు జరగవు!
ఈ మధ్య ఊరెళ్లాలంటేనే హడలెత్తుతున్నారు ప్రజలు. దొంగల బెడద అలా ఉంది మరి.. కానీ నిశ్చింతగా ఊరెళ్లండంటూ పోలీసులు అభయమిస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసే ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో దొంగతనాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు. సాక్షి, అద్దంకి రూరల్ : తాళం వేసి ఉన్న ఇంటిలో జరిగే దొంగతనాలు చేసే దొంగలకు ఎల్‌హెచ్‌ఎంఎస్( లాక్హౌస్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా చెక్ పెట్టవచ్చని సీఐ హైమారావు అన్నారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల పట్టణంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయని వాటిని నిరోధించటానికి ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. ఎవరైనా ఒకటి రెండు రోజుల ఊరువిడిచి వెళ్లాల్సి వచ్చినా పోలీస్ వారికి తెలియచేస్తే ఆ ఇంటిలో ఎల్‌హెచ్‌ఎంఎస్ ఎర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సిస్టమ్ ద్వారా ఇంటిలో ఒక మూలన రహస్య కెమెరాను అమర్చుతారన్నారు. ఆ కెమెరా ఇంటిలోకి దొంగ ప్రవేశించగానే ఆటోమాటిక్‌గా పనిచేయటం ప్రారంభించి సంబంధిత పోలీస్ స్టేషన్లో అలారం మోగుతుందని వివరించారు. దీంతో ఇంటిలోకి దొంగ ప్రవేశించిన 5 నిమిషాల లోపే పట్టుకునే అవకాశం ఉటుందన్నారు. ఈ సిస్టమ్‌ను ప్రజలు వినియోగించుకుని దొంగతనాల బారి నుంచి తప్పించుకొవచ్చన్నారు. ప్రజలు సామాజిక బాధ్యతగా భావించి ఈ పద్ధతి అనుసరించాలని కోరారు. పెరిగిన గస్తీ... పట్టణంలో దొంగతనాలను అరికట్టటానికి గస్తీని పెంచుతున్నట్లు సీఐ తెలిపారు. పట్టణాన్ని 8 బీట్ ప్రాంతాలుగా విభజించి గస్తీలను ముమ్మరం చేస్తామన్నారు. ఇంటిలోపల లైట్లు వెలిగి ఉండి బయట తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, యజమానుల పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. పట్టణంలో పనిచేయని సీసీ కెమెరాలను గుర్తించి బాగు చేయిస్తామని చెప్పారు. ఇటీవలే చోటుచేసుకున్న దొంగతనాలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎస్సై సుబ్బరాజు పాల్గొన్నారు. -
పర్హీన్ ప్రభాకర్‌పై దోపిడీ ముఠా దాడి
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య, బాలీవుడ్ నటి పర్హీన్ ప్రభాకర్‌పై దేశ రాజధానిలో దోపిడీ దొంగల ముఠా దాడికి పాల్పడింది. థక్ థక్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ దాడికి తెగబడినట్టు పోలీసులు పేర్కొన్నారు. పర్హీన్ దక్షిణ ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని సర్వప్రియ విహార్‌లో ఉండే పర్హీన్ తన కారులో సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌కు వెళుతుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద దోపిడీ ముఠా అడ్డగించిందని పోలీసులు చెప్పారు. ఆమె తన కారును పార్క్ చేసి వారితో మాట్లాడుతుండగా దాడికి దిగి ఆమె వద్దనున్న రూ 16,000 నగదు, డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కుని రోడ్డుకు ఎదురుగా పార్క్ చేసిన వారి కారులో పరారయ్యారు. దోపిడీ ముఠా దాడికి గురైన పర్హీన్ రోడ్డుపై కుప్పకూలారు. ఓ ఆర్మీ అధికారి ఆమెకు సాయం అందించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పోలీసులకు అందచేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తిస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని దక్షిణ ఢిల్లీ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. -
నిఘానేత్రాలను ఎత్తుకెళ్లారు
సోన్: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు త క్కువ కాదని, విద్యార్థుల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. వీటి ద్వారానే నేరాలు అదుపు, విద్యార్థుల పర్యవేక్షణ సులువు కావడంతో అందరూ వాటినే ఏర్పాటు చేసుకుంటున్నారు. సోన్ మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో హెచ్ఎంలు, గ్రామాభివృద్ధి కమిటీ రూ.20 వేల ఆర్థికసాయంతో సెప్టెంబర్‌లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫర్నిచర్, ఫ్యాన్లు ధ్వంసం న్యూ వెల్మల్ బొప్పారం జెడ్పీ సెకండరీ పాఠశాలకు ఓ వైపు ప్రహరి ఉండి, మరోవైపు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు సెలవుదినాల్లో, రాత్రివేళ పాఠశాలలోకి చొరబడి ఫర్నిచర్, ఫ్యాన్లును గతంలో ధ్వంసం చేశారు. కిటికీలను పగలగొట్టారు. తరగతి గదుల్లో మద్యం సీసాలు, సిగరెట్లు దర్శనమిస్తున్నాయి. సెలవుల్లో ఎత్తుకెళ్లారు... రెండు గ్రామాల మధ్య ఉన్న ఉన్నత పాఠశాల పర్యవేక్షణకు గ్రామాభివృద్ధి కమిటీ ఆర్థికసాయంతో సెప్టెంబర్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్టోబర్‌లో దసరా సెలవులు రావడంతో గు ర్తుతెలియని వ్యక్తులు మూడు కెమెరాలను ఎత్తుకెళ్లినట్లు హెచ్ఎం మురళీధర్ తెలిపారు. దీనిపై సోన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
నంద్యాలలో దారి దోపిడి
-
మాటలు కలిపి..మత్తు మందు ఇచ్చి ...
వృద్ధులే టార్గెట్ పట్టుబడ్డ నిందితుడు రూ.ఆరు లక్షల సొత్తు స్వాధీనం అమలాపురం టౌన్ : బంగారు నగలు కాజేసేందుకు అతడి టార్గెట్ ఎప్పుడూ వృద్ధురాళ్లపైనే ఉంటుంది. బస్ స్టేషన్లలో, ఆటో స్టాండ్‌ల్లో 70 ఏళ్లు వయసు దాటి ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధులు ధరించే బంగారు నగలపై అతడి కన్ను పడుతుంది. ముందు మాటలు కలపి...తర్వాత బంధుత్వాలు చెప్పి...ఆపై మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌లు ఇచ్చి మత్తులోకి వెళ్లాక వారి ఒంటిపై బంగారు నగలు కాజేసి అదృశ్యమయ్యే కిలాడీ అతడు. అమలాపురం డివిజన్లో ఈ తరహాలో గత ఆరేళ్ల నుంచి అనేక నేరాలు చేస్తూ ఎందరో వృద్ధరాళ్ల నుంచి బంగారు నగలు కాజేసిన అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన కంఠంశెట్టి శ్రీనును అమలాపురం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అతను చేసిన నేరాల చిట్టాను చెప్పించటమే కాకుండా రూ.ఆరు లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ అరెస్ట్ చేసిన నిందితుడు శ్రీనును ప్రవేశపెట్టి అతను నుంచి స్వాధీనం చేసుకున్న 203.5 గ్రాములు బంగారు నగలు, 67 గ్రాముల వెండి వస్తువులు, 83 మత్తు బిళ్లలను చూపించారు. నిందితుడు జిల్లాలోని అంబాజీపేట, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం, ముమ్మిడివరం, కొత్తపేట, అమలాపురం ఇలా అనేక ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్టు తెలిపారు. సోమవారం ఉదయం అమలాపురంలోని నల్లా సూర్యచంద్రరావు ఘాట్ వద్ద శ్రీను బంగారు నగలు, మత్తు బిళ్లలతో అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతడిని అరెస్ట్ చేసి విచారించగా నేరాలు అంగీకరించాడని తెలిపారు. రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్సు ఆరేళ్ల నుంచి నేరాలు చేస్తున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసి అతడి నుంచి బంగారు నగలు రికవరీ చేసిన పట్టణ సీఐ శ్రీనివాస్, ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుళ్లు అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు, హోంగార్డు సుందర అనిల్‌ను డీఎస్పీ ప్రసన్నకుమార్ అభినందించారు. వీరికి రివార్డులు ప్రకటించేందకు జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
పామిడిలో చోరీ
పామిడి : పామిడి దత్తాత్రేయ కాలనీలో కాపురముంటున్న నబీసాబ్ అనే వ్యాపారి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారని ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. పెద్దవడుగూరు మండలం మల్లేలపల్లిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి నబీసాబ్ కుటుంబం వెళ్లింది. దీన్ని పసిగట్టిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి రూ.45 వేల నగదు సహా రెండు తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఇంటికొచ్చిన నబీసాబ్‌కు తలుపుల బీగాలు ధ్వంసమై ఉండగా, ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన దుస్తులు, వస్తువులు చెల్లాచెదరుగా పడి ఉండడాన్ని గమనించారు. చోరీ జరిగినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పశ్చిమలో భారీ చోరీ
– 139 కాసుల బంగారం, 9.5 కేజీల వెండి అపహరణ నిడమర్రు : పశ్చిమగోదావరిజిల్లా గణపవరం మండలం పిప్పరలో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. 139 కాసుల (1,112 గ్రాములు) బంగారం, 9.5 కేజీల వెండి అపహరణకు గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. పిప్పరకు చెందిన తుమ్మల వీరభద్రరావు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి గ్రామాంతరం వెళ్లారు. దీంతో పనిమనిషి రోజూ వచ్చి ఇంటి ఆవరణ శుభ్రం చేసేది. యథావిధిగా శుక్రవారం వచ్చిన పనిమనిషి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో వీరభద్రరావు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వారు హుటాహుటిన పిప్పర వచ్చి బీరువాలో ఉన్న 1,112 గ్రాముల బంగారం, 9.5 కేజీల వెండి మాయమైనట్టు గుర్తించారు. గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
గంటల మారెమ్మ హుండీ చోరీ
పుట్టపర్తి అర్బన్: మండలంలోని బత్తలపల్లి సమీపంలోని కనుమలో వెలసిన గంటల మారెమ్మ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీ ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి నెలా హుండీని లెక్కించి బ్యాంకులో పొదుపు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈనెల ఇంకా లెక్కించక పోవడంతో సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ కానుకలు ఉండవచ్చన్నారు. చోరీపై పుట్టపర్తి రూరల్‌పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరంలో ఆలయంలో రెండో సారి చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు. -
ఊరెళ్లి వచ్చేసరికి చోరీ
కావలి మద్దూరుపాడులో ఘటన బంగారు, వెండి వస్తువుల అపహరణ కావలిరూరల్ : పక్క ఊరిలోని బంధువుల ఇంటికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలుపడి దోచుకెళ్లిన సంఘటన మద్దూరుపాడులో జరిగింది. రూరల్ పోలీసుల వివరాలమేరకు.. స్థానిక మద్దూరుపాడుకు చెందిన నాగూరి కష్ణారెడ్డి కుటుంభసభ్యులతో కలిసి ఆదివారం నెల్లూరులో ఉన్న కుమార్తె దగ్గరకు వెళ్లారు. తిరిగి సోమవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి లోపలికెళ్లి చూశారు. బీరువా పగులగొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. వెంటనే కష్ణారెడ్డి పోలీసులకు సమాచారమందించారు. ఒకటోపట్టణ సీఐ ఎన్.వెంకటరావు, రూరల్ ఎస్సై పుల్లారావులు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించి, బాధితుల నుంచి వివరాలను సేకరించారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం వేలిముద్రలు, ఆధారాలు సేకరించింది. ఈఘటనలో బీరువాలో ఉన్న బ్రాస్లెట్, గాజులు, కమ్మలు తదితర 6 సవర్ల బంగారు వస్తువులు, దేవుడి గదిలో ఉన్న అష్టలక్ష్మి కలశం, హారతి పళ్లెం, కుందెలు, ప్రమిదలు నాలుగు ప్లేట్లు, నాలుగు గ్లాసులు తదితర వెండి వస్తువులు చోరీకి గురైనట్లు తెలిపారు. కాగా ఆదివారం రాత్రి రెండుగంటల సమయంలో కష్ణారెడ్డి ఇంటి ఎదురుగావున్న పులి చక్రపాణి తండ్రి పులి సుబ్బరాయుడుకు చెందిన బైక్ చోరీకి గురైంది. దీంతో ఈ రెండు చోరీలు చేసింది ఒక్కరేనని పోలీసులు భావిస్తున్నారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విజయ బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం
ఉండి : కోలమూరు విజయబ్యాంకును దోచుకునేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కోలమూరులోని విజయబ్యాంకులో శుక్రవారం రాత్రి దొంగలు దోపిడీకి యత్నించారు. బ్యాంకు వెనక వైపున ఉన్న కిటికీని బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించేందకు యత్నించారు. వీలుకాకపోవడంతో వదిలి వెళ్లిపోయారు. శనివారం బ్యాంకు మేనేజర్ తిర్కువల్లూరి మోహ¯Œæలక్షీ్మనారాయణ కిటీకీలు బద్దలు కొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఈ బ్యాంకు సమీపంలోనే ఉన్న ఉండి కో–ఆపరేటివ్ రూరల్ బ్యాంకు బ్రాంచి పక్క ఇంటిలో దుండగులు రూ.45వేల విలువైన బంగారువస్తువులు దోచుకెళ్లారు. దీంతో ఇంటి యజమానురాలు పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎం.రవివర్మ తెలిపారు. -
ఎంపీపీ ఇంట్లో చోరీ
12తులాల బంగారు నగలు, రూ.1.1లక్షల అపహరణ జడ్చర్ల : పట్టపగలే ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల పట్టణం కేకేనగర్‌లో ఎంపీపీ లక్ష్మి కుటుంబంతో కలిసి సొంతింట్లో నివాసముంటున్నారు. సోమవారం ఉదయం బాదేపల్లిలోని దయానంద విద్యామందిర్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె తాళం వేసి వెళ్లారు. అంతకుముందే భర్త శంకర్‌నాయక్ పనిమీద బయటకు, పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారు. ఇదే అదనుగా భావించిన దుండగులు మధ్యాహ్నం తలుపులను బలంగా వెనక్కి నెట్టడంతో తెరుచుకున్నాయి. లోపలికి చొరబడి బీరువాలోని 12తులాల బంగారు నగలు, రూ.1.1లక్షలను అపహరించుకెళ్లారు. సాయంత్రం తిరిగొచ్చిన ఎంపీపీ విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని సీఐ గంగాధర్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
చిన్నతనం నుంచే చోరీల బాట
కారు, బైక్‌లు, వెండి వస్తువులు స్వాధీనం సొత్తు విలువ రూ.2.50 లక్షలు రావులపాలెం : బోస్టన్ స్కూలుకు వెళ్లొచ్చినా.. అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. చోరీలనే వృత్తిగా ఎంచుకుని అనేకచోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి, కారు, బైక్‌లు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెం సీఐ పీవీ రమణ బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో విలేకరులకు వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని లజపతిరాయ్ పేటకు చెందిన జక్కంపూడి రాధాకృష్ణ చిన్నతనం నుంచి దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. పోలీసులు బోస్టన్ స్కూల్‌కు పంపినా, అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. 2015 మార్చి 2న కొత్తపేటలోని కొప్పిశెట్టివారి వీధిలో ఉన్న ఓ ఇంట్లో వెండి వస్తువులు, కొంత నగదు చోరీ చేశాడు. 2016 ఫిబ్రవరి 24న రావులపాడులోని ఓ బైక్ షోరూంలో కొత్త మోటార్ సైకిల్‌ను, ఏప్రిల్ 4న ఊబలంకలో ఓ స్కూటర్‌ను, జూన్ 21న అమలాపురంలోని విద్యుత్ నగర్లో కారు, ఈ నెల ఒకటిన హెచ్‌బీ కాలనీలో స్కూటర్‌ను చోరీ చేశాడు. ఆయా పోలీసు స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం ఈతకోట సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్సై పీవీ త్రినాథ్‌కు అనుమానాస్పదంగా తచ్చాడుతున్న రాధాకృష్ణ తారసపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, ఆయా చోరీ కేసుల వివరాలు తెలిశాయి. ఆయా కేసుల్లో కారు, మూడు బైక్‌లు, 12 తులాల వెండి వస్తువులను పోలీసులు రికవరీ చేశారు. చోరీ సొత్తు విలువ రూ.2.50 లక్షలు ఉంటుంది. నిందితుడిపై పాలకొల్లు పోలీసు స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. నిందితుడిని కొత్తపేట జేఎఫ్సీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన ఎస్సై పీవీ త్రినాథ్, అడిషనల్ ఎస్సై పి.శోభన్‌కుమార్, పీఎస్సై జి.సురేంద్ర, ఏఎస్సైలు ఆర్వీ రెడ్డి, రామచంద్రరావు, కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు. -
సత్తుపల్లిలో భారీ దొంగతనం
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సోమవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నేత గాదిరెడ్డి సుబ్బారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలో ఉంచిన నాలుగు తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.80 వేల నగదును ఎత్తుకు పోయారు. మంగళవారం ఉదయం చూసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ కవిత సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను తో ఆధారాలు సేకరిస్తున్నారు. -
విద్యార్థులను దోచుకున్నారు
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో కొందరు దుండగులు ముగ్గురు విద్యార్థులను దోచుకున్నారు. వారు ప్రయాణీస్తున్న కారును ఎత్తుకెళ్లిపోయారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాకు చెందిన న్యాయశాస్త్రం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు డెహ్రాడూన్-న్యూఢిల్లీ జాతీయ రహదారి గుండా డెహ్రాడూన్‌కు వస్తుండగా సిసోనా అనే గ్రామ శివారులోని ఓ డాబా వద్ద కారును ఆపారు. విశ్రాంతి తీసుకొని బయలుదేరుతుండగా ఆయుధాలతో వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. వారి ఆయుధాలతో బెదిరించి బలవంతంగా కిందికి దించారు. అనంతరం వద్ద నుంచి విలువైన వస్తువులు తీసుకొని కారును కూడా ఎత్తుకెళ్లిపోయారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా రెచ్చిపోయారు
అల్లాదుర్గం రూరల్(మెదక్): తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి దొంగతనాలు చోటు చేసుకున్నాయి. ఆ గ్రామానికి చెందిన బండారి దుర్గమ్మ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.12వేల నగదు ఎత్తుకుపోయారు. రుబెల్ కిరాణ డబ్బా షట్టర్ తాళాలు పగులగొట్టి రూ.10 వేల నగదు, ఐదువేల విలువైన సామగ్రిని మాయం చేశారు. అలాగే, జ్యోతి మహిళా మండలికి చెందిన వ్యవసాయ సామాగ్రిని, కరీం అనే వ్యక్తికి చెందిన పాన్‌డబ్బాలో రూ.ఐదు వేల విలువగల వస్తువులను చోరీ చేశారు. మరో మూడిళ్లలో తాళాలు పగులగొట్టి చొరబడిన దొంగలకు ఏమీ లభించలేదు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళను హత్య చేసి రూ.70 లక్షల దోపిడీ
ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్ లో బర్గాదియా ఘాట్ లో నివాసం ఉంటున్న వ్యాపారస్తుల ఇంటిలోకి ప్రవేశించిన కొంతమంది దుండగులు ఒక మహిళను హత్య చేసి రూ.70 లక్షల నగదుతో పాటు, కేజీన్నర బంగారం దోచుకెళ్లారు. గురువారం పట్టపగలే జితేందర్ సింగ్ అనే వ్యాపారస్తుని ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు భారీ నగదును అపహరించడమే కాకుండా అతని భార్య అమితను దారుణంగా హత్య చేశారు. జితేందర్ సింగ్ భార్య అమిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి ప్రవేశించి ఆమెను కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదును, బంగారాన్ని దోచుకెళ్లారు. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న జితేందర్ సింగ్ హుటాహుటినా ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పోలీసులకు సవాల్ గా మారిన ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవర్నీ అరెస్టు చేయలేదు.