
న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో రైళ్లలో దొంగతనం కేసులు ఐదింతలు పెరిగాయి. రైళ్లల్లో దొంగతనం ఘటనలకు సంబంధించి 2009 నుంచి 2018 వరకూ 1,71,015 కేసులు నమోదైనట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందులో 2018లో అత్యధికంగా 36,584 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు పీటీఐ వార్తా సంస్థకు చెందిన ఓ పాత్రికేయుడు ఆర్టీఐ ద్వారా రాసిన లేఖకు రైల్వే సమాధానమిచ్చింది. రైల్వే శాఖ సమాచారం ప్రకారం రైళ్లల్లో దొంగతనం ఘటనలకు సంబంధించి 2017లో 33,044, 2016లో 22,106, 2015లో 19,215, 2014లో 14,301, 2013లో 12,261, 2012లో 9,292, 2011లో 9,653, 2010లో 7,549, 2009లో 7,010 కేసులు నమోదయ్యాయి.