Five times
-
టాటా ఏఐజీ నుంచి హెల్త్ సూపర్ చార్జ్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్.. ‘హెల్త్ సూపర్ చార్జ్’ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని కింద పాలసీదారులు ఐదు రెట్లు అధికంగా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందొచ్చు. ఏటా 50 శాతం రెన్యువల్ బోనస్ చొప్పున గరిష్టంగా 500 శాతం (ఐదు రెట్లు) కవరేజీని పెంచుకోవచ్చు. టైర్–1 నుంచి టైర్–4 వరకు పట్టణాల్లో నివసించే వారి భిన్న రకాల ఆరోగ్య సంరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్, సమ్ ఇన్సూర్డ్ అపరిమిత రీస్టోరేషన్ సదుపాయం, ముందు నుంచి ఉన్న వ్యాధుల వేచి ఉండే కాలాన్ని నాలుగేళ్ల నుంచి 30 రోజులకు తగ్గించుకునే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద రూ.5–20 లక్షల కవరేజీని పొందొచ్చు. ఏటా ఉచిత హెల్త్ చెకప్ సదుపాయం కూడా ఉంది. -
ఐదింతలు పెరిగిన రైళ్లల్లో చోరీ కేసులు
న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో రైళ్లలో దొంగతనం కేసులు ఐదింతలు పెరిగాయి. రైళ్లల్లో దొంగతనం ఘటనలకు సంబంధించి 2009 నుంచి 2018 వరకూ 1,71,015 కేసులు నమోదైనట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందులో 2018లో అత్యధికంగా 36,584 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు పీటీఐ వార్తా సంస్థకు చెందిన ఓ పాత్రికేయుడు ఆర్టీఐ ద్వారా రాసిన లేఖకు రైల్వే సమాధానమిచ్చింది. రైల్వే శాఖ సమాచారం ప్రకారం రైళ్లల్లో దొంగతనం ఘటనలకు సంబంధించి 2017లో 33,044, 2016లో 22,106, 2015లో 19,215, 2014లో 14,301, 2013లో 12,261, 2012లో 9,292, 2011లో 9,653, 2010లో 7,549, 2009లో 7,010 కేసులు నమోదయ్యాయి. -
ఏటీఎం బంపర్ బొనాంజా?
జైపూర్: సికార్ జిల్లాలోని అజిత్ ఘడ్ ప్రాంతంలోని యాక్సీస్ బ్యాక్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఖాతాదారులకు సోమవారం బంపర్ బొనాంజా తగిలింది. ఎందుకంటే...ఆ ఏటీఎం భారీ ఆఫర్ ఇచ్చింది. అడిగిన దానికంటే అయిదు రెట్టు డబ్బులు ఖాతాదారుల పాలిట కామధేనువు లాంటి మారిపోయింది. వంద రూపాయలకు బదులుగా 500 రూపాయలు, ఐదు వందల రూపాయలు డ్రా చేస్తే వెయ్యి రూపాయలు నోట్లు వచ్చాయి. ఇక వినియోగదారులు ఈ అవకాశాన్ని వదులుకుంటారా... ఆ నోటా.. ఈనోటా ఈ వార్త దావాలనంలా వ్యాపించింది. డబ్బు డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు క్యూ కట్టారు. నేను ముందు అంటే.. నేను ముందు అంటూ ఎగబడ్డారు. తోపులాట జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటా హుటిన రంగంలోకి దిగారు. ఎటీఎంకు తాళం వేసి రక్షణ ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి నిపుణుల బృందం స్పాట్‌కు చేరుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమైందని వివరించారు. విచారణకు ఆదేశించారు. ఎంతమందికి అదనంగా డబ్బులు అందాయో ఆరా తీసి, ఆ సొమ్మును రాబడతామన్నారు. -
ఈ నెలలో 5 శుక్ర, శని, ఆదివారాలు
826 ఏళ్లకోసారి జరిగే అరుదైన సంఘటన ఆదిలాబాద్: ఈ ఏడాది ఆగస్టు నెలకు ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఇంగ్లిష్ క్యాలెండర్ ఏ నెలలోనైనా రెండు వారాలు మాత్రం ఐదుసార్లు వస్తుంటాయి. అయితే, ఈ నెలలో ఐదు శుక్రవారాలు, ఐదు శనివారాలు, ఐదు ఆదివారాలు వస్తున్నాయి. ఇలా 826 ఏళ్లకోసారి మాత్రమే జరుగుతుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.