
బ్యాంకాక్: మీరు ‘అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి’ అనే సామెత వినే ఉంటారు. దీన్ని, మనం ఒకటి ఊహించి పనిచేస్తే.. దానికి పూర్తి వ్యతిరేకంగా దాని ఫలితం ఉంటున్నదన్నమాట. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడో వ్యక్తికి అలాంటి పరిస్థితే ఎదురైంది. వివరాలు..ఈ సంఘటన థాయిలాండ్‌లో చోటుచేసుకుంది. ఛోబూరి పట్టణానికి చెందిన సుఫాచాయ్ పాంథాంగ్‌కు 27 ఏళ్లు. ఇతను గత కొంత కాలంగా చోరీలకు అలవాటుపడ్డాడు.దీంతో, ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. బంగారం చాలా విలువైంది.. దాన్ని చోరీచేస్తే కొంత కాలం హయిగా ఉండోచ్చని అనుకున్నాడు.
ఒక రోజు ఛోబూరిలోని ఒక బంగారు దుకాణంలో కస్టమర్‌లా వెళ్లి అక్కడి ఆభరణాలను చూశాడు. అదునుకోసం ఎదురు చూశాడు. ఆ దుకాణంలో రద్దీ కూడా లేదు. కాసేపటికి మెల్లగా, అటూ.. ఇటూ చూసి చైన్‌ను ట్రయల్ చేస్తున్నట్లు మెడలో వేసుకున్నాడు. ఆ షాపు యజమాని వేరే పనిలో ఉండటాన్ని గమనించాడు. అప్పుడు, మెల్లగా జారుకుని.. షాపు నుంచి బయటకు వెళ్లే మార్గం వైపుకు పరిగెత్తాడు. వెంటనే హడవుడిగా డోర్ తెరవడానికి ప్రయత్నించాడు.
పాపం.. అక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అతను ఎంత గింజుకున్నా ఆ తలుపు తెరుచుకోలేదు. దీంతో అతగాడికి చెమటలు పట్టాయి. నిజానికి ఆ దుకాణం తలుపు రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. కాసేపటికి, ఆ యువకుడు ఏమికానట్లు ఆ చైన్‌ను షాపు యజమానికి తిరిగి ఇచ్చేశాడు. అయితే, ఆ యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో ఆ యువకుడు, ‘నన్ను ఒక కంపెనీవారు ఉద్యోగం నుంచి తొలగించారు. కేవలం, ఆర్థిక సమస్యల వలన చోరీ చేశానని తెలిపాడు. ఈ వీడియో గతంలోనే జరిగింది. ప్రస్తుతం తిరిగి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. అతని మాస్టర్ ప్లాన్ ఫెయిలయ్యింది..’, ‘అయ్యో.. అతను ఉద్యోగం లేకపోవడంతోనే ఇలాచేశాడు..’ ‘ ఏదైన.. అతను చేసింది తప్పే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
— people who died but are doing well (@jamorreram0) June 27, 2021