పశ్చిమలో భారీ చోరీ
Published Fri, Oct 21 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
– 139 కాసుల బంగారం, 9.5 కేజీల వెండి అపహరణ
నిడమర్రు : పశ్చిమగోదావరిజిల్లా గణపవరం మండలం పిప్పరలో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. 139 కాసుల (1,112 గ్రాములు) బంగారం, 9.5 కేజీల వెండి అపహరణకు గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. పిప్పరకు చెందిన తుమ్మల వీరభద్రరావు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి గ్రామాంతరం వెళ్లారు. దీంతో పనిమనిషి రోజూ వచ్చి ఇంటి ఆవరణ శుభ్రం చేసేది. యథావిధిగా శుక్రవారం వచ్చిన పనిమనిషి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో వీరభద్రరావు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వారు హుటాహుటిన పిప్పర వచ్చి బీరువాలో ఉన్న 1,112 గ్రాముల బంగారం, 9.5 కేజీల వెండి మాయమైనట్టు గుర్తించారు. గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
Advertisement
Advertisement