అల్లాదుర్గం రూరల్(మెదక్): తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి దొంగతనాలు చోటు చేసుకున్నాయి.
అల్లాదుర్గం రూరల్(మెదక్): తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి దొంగతనాలు చోటు చేసుకున్నాయి. ఆ గ్రామానికి చెందిన బండారి దుర్గమ్మ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.12వేల నగదు ఎత్తుకుపోయారు. రుబెల్ కిరాణ డబ్బా షట్టర్ తాళాలు పగులగొట్టి రూ.10 వేల నగదు, ఐదువేల విలువైన సామగ్రిని మాయం చేశారు. అలాగే, జ్యోతి మహిళా మండలికి చెందిన వ్యవసాయ సామాగ్రిని, కరీం అనే వ్యక్తికి చెందిన పాన్‌డబ్బాలో రూ.ఐదు వేల విలువగల వస్తువులను చోరీ చేశారు. మరో మూడిళ్లలో తాళాలు పగులగొట్టి చొరబడిన దొంగలకు ఏమీ లభించలేదు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.