మహిళను హత్య చేసి రూ.70 లక్షల దోపిడీ | Women strangulated by robbers | Sakshi
Sakshi News home page

మహిళను హత్య చేసి రూ.70 లక్షల దోపిడీ

Published Thu, May 29 2014 7:55 PM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

Women strangulated by robbers

ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్ లో బర్గాదియా ఘాట్ లో నివాసం ఉంటున్న వ్యాపారస్తుల ఇంటిలోకి  ప్రవేశించిన కొంతమంది దుండగులు ఒక మహిళను హత్య చేసి రూ.70 లక్షల నగదుతో పాటు, కేజీన్నర బంగారం దోచుకెళ్లారు.  గురువారం పట్టపగలే జితేందర్ సింగ్ అనే వ్యాపారస్తుని ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు భారీ నగదును అపహరించడమే కాకుండా అతని భార్య అమితను దారుణంగా హత్య చేశారు.   జితేందర్ సింగ్ భార్య అమిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి ప్రవేశించి ఆమెను కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదును, బంగారాన్ని దోచుకెళ్లారు.

 

దీనికి సంబంధించి సమాచారం అందుకున్న జితేందర్ సింగ్ హుటాహుటినా ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పోలీసులకు సవాల్ గా మారిన ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవర్నీ అరెస్టు చేయలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement