న్యూవెల్మల్ బొప్పారం ఉన్నత పాఠశాల , వేలాడుతున్న వైర్లు
సోన్: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు త క్కువ కాదని, విద్యార్థుల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. వీటి ద్వారానే నేరాలు అదుపు, విద్యార్థుల పర్యవేక్షణ సులువు కావడంతో అందరూ వాటినే ఏర్పాటు చేసుకుంటున్నారు. సోన్ మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎంలు, గ్రామాభివృద్ధి కమిటీ రూ.20 వేల ఆర్థికసాయంతో సెప్టెంబర్‌లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఫర్నిచర్, ఫ్యాన్లు ధ్వంసం
న్యూ వెల్మల్ బొప్పారం జెడ్పీ సెకండరీ పాఠశాలకు ఓ వైపు ప్రహరి ఉండి, మరోవైపు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు సెలవుదినాల్లో, రాత్రివేళ పాఠశాలలోకి చొరబడి ఫర్నిచర్, ఫ్యాన్లును గతంలో ధ్వంసం చేశారు. కిటికీలను పగలగొట్టారు. తరగతి గదుల్లో మద్యం సీసాలు, సిగరెట్లు దర్శనమిస్తున్నాయి.
సెలవుల్లో ఎత్తుకెళ్లారు...
రెండు గ్రామాల మధ్య ఉన్న ఉన్నత పాఠశాల పర్యవేక్షణకు గ్రామాభివృద్ధి కమిటీ ఆర్థికసాయంతో సెప్టెంబర్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్టోబర్‌లో దసరా సెలవులు రావడంతో గు ర్తుతెలియని వ్యక్తులు మూడు కెమెరాలను ఎత్తుకెళ్లినట్లు హెచ్‌ఎం మురళీధర్ తెలిపారు. దీనిపై సోన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment