- విజయా బ్యాంకులో టికెట్ల కేటాయింపు
- చంటి బిడ్డ తల్లిదండ్రులు, వికలాంగులు, వృద్ధులకూ సుపథం ప్రవేశం
- ఈవో, జేఈవో వెల్లడి
తిరుమల: తిరుమల ఆలయంలో శ్రీవారి ఆర్జిత సేవలు బుధవారం పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 11వ తేదీ మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగియనున్నాయి. ఈ తొమ్మిది రోజులూ అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశారు. మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు ముగియనున్నాయి. ఆ తర్వాత బుధవారం నుండి ఆలయంలో ఆయా రోజుల్లో నిర్వహించే ఆర్జిత సేవలు యథావిధిగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా మంగళవారం నుండే ఇక్కడి విజయాబ్యాంకులో అందుబాటులోని వివిధ ఆర్జిత సేవా టికెట్లు భక్తులు పొందవచ్చు. ఇక్కడే లక్కీడిప్ కింద కేటాయించే టికెట్లు కూడా మంగళవారం నుండే విజయా బ్యాంకులో కేటాయించనున్నారు. ఇప్పటికే ఇంటెర్నెట్ ద్వారా ముందస్తు రిజర్వు చేసుకున్న ఆర్జిత సేవా గృహస్తులు యథావిధిగా ఆయా సేవల్లో స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే వికలాంగులు, వృద్ధులు, చంటి బిడ్ద తల్లిదండ్రులకు సుపథం ప్రవేశ మార్గంలో బుధవారం నుంచి పునః ప్రారంభించి శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు.
12 నుంచి శ్రీవారి ఆర్జిత సేవల పునరుద్ధరణ
Published Mon, Oct 10 2016 7:42 PM | Last Updated on Mon, Aug 20 2018 4:09 PM
Advertisement
Advertisement