
న్యూఢిల్లీ: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎంసీఎల్‌ఆర్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓవర్‌నైట్, ఒక నెల మినహా మిగిలిన అన్ని రుణాలకు తగ్గింపు అమలవుతుందని, నూతన రేట్లు ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్ రేటు 0.10% తగ్గి 8.70%కి చేరుకుంది.
కన్జ్యూమర్ రుణాలన్నీ ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్ రేటు ప్రకారం జారీ చేసేవే. రెండు, మూడేళ్ల కాల ఎంసీఎల్‌ఆర్ రేటు సైతం 0.10 శాతం తగ్గి 8.80 శాతం, 8.90 శాతానికి చేరాయి. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ రేటు 8.5 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గించింది.