
సాక్షి, ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేటులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది 5 బీపీఎస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రుణాలపై వార్షిక ఎంసీఎల్‌ఆర్ 8.5 శాతంనుంచి 8.45 శాతానికి దిగి వచ్చింది.
ఈ తగ్గించిన రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. సవరించిన రేట్ల ప్రకారం ఒక నెల కాల పరిమితి రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 8.15 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గింది. మూడు నెలల, ఆరు నెలల రుణ వడ్డీ రేటు వరుసగా 8.15 , 8.30 శాతానికి తగ్గాయి. రెండు, మూడు సంవత్సరాల రేట్లు 8.55 శాతం, 8.65 శాతంగా ఉంటాయి.
కాగా గత నెల రోజుల తరువాత ఇది రెండవ తగ్గింపు. మానిటరీ పాలసి రివ్యూ అనంతరం ఏప్రిల్ మాసంలో ఎంసీఎల్‌ఆర్‌ను 5 బీపీఎస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. మరోవైపు క్యూ 4లో ఎస్‌బీఐ ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ నికర లాభం రూ.838.4 కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment