ఎస్‌బీఐ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. అన్ని కాలపరిమితులకు గాను మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ను 15 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంకులో తీసుకున్న రుణాలు మరింత భారం కానున్నాయి. ఈ పెంచిన రేట్లు నవంబర్ 15, 2022 నుండి అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. వాహన, వ్యక్తిగత, గృహ రుణాల రేట్లు ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ ఆధారంగా నిర్ణయించబడతాయి.
అయితే ఎస్‌బీఐ ఏడాది ఎంసీఎల్‌ఆర్ రేట్లు అంతకుముందు 7.95 శాతం నుండి 10 బేసిస్ పాయింట్లు (bps) 8.05 శాతానికి పెంచింది
అలాగే, రెండేళ్లు , మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌లను ఒక్కొక్కటి 10 బేసిస్ పాయింట్లు వరుసగా 8.25 శాతం, 8.35 శాతానికి పెంచినట్లు ఎస్‌బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌లను ఒక్కొక్కటి 15 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతానికి చేర్చింది.
6 నెలల ఎంసీఎల్‌ఆర్ రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెరిగి 8.05 శాతానికి, ఓవర్‌నైట్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 7.60 శాతానికి చేరుకుంది.
ఎంసీఎల్‌ఆర్ అంటే
కస్టమర్లు తీసుకునే రుణాలపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీరేటే ..ఎంసీఎల్‌ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ అంటారు. రుణంపై వడ్డీరేటు పెరిగితే ఎంసీఎల్‌ఆర్ ఆటోమేటిక్‌గా రుణాల కాస్ట్‌పై ప్రభావం చూపుతుంది. రుణాలపై వడ్డీరేటు పెరిగితే నెలవారీ ఈఎంఐలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఎంసీఎల్‌ఆర్ లింక్డ్ రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలు ఎక్కువ ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంసీఎల్‌ఆర్‌పై ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపైనా ఈఎంఐ ప్రభావం పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment