గృహ రుణ వినియోగదారులకు వడ్డీ ఊరట స్వల్పమే | MCLR:Icra sees limited gains for home loan buyers,bank margins | Sakshi
Sakshi News home page

గృహ రుణ వినియోగదారులకు వడ్డీ ఊరట స్వల్పమే

Published Thu, Apr 7 2016 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

MCLR:Icra sees limited gains for home loan buyers,bank margins

ముంబై: ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్స్) విధానంలో గృహ రుణ వినియోగదారులకు పెద్దగా ప్రయోజనముండదని ఇక్రా రేటింగ్స్ వెల్లడించింది. ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఖరే దీనికి ప్రధాన కారణమని వివరించింది. ఒక ఏడాది కాలపరిమితి ఉన్న ఎంసీఎల్‌ఆర్ గృహ రుణ రేట్లు 9.2 శాతంగా ఎస్‌బీఐ నిర్ణయించిందని, దీనికి 0.25 శాతం స్ప్రెడ్‌ను కలుపుకుంటే రూ.20 లక్షల గృహ రుణానికి వడ్డీరేటు 9.45 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతమున్న బేస్‌రేట్ విధానంలో వడ్డీరేటు 9.55 శాతంగా ఉందని, దీనితో పోల్చితే ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేటు కొద్దిగానే తక్కువని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement