స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), బేస్ రేటును పెంచుతూ కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఈ కథనంలో పెరిగిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే వివరాలు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ బేస్ రేటు ఇప్పుడు 10.10 శాతం నుంచి 10.25 శాతానికి పెరిగింది. అంటే కొత్త బేస్ రేటు గతం కంటే కూడా 0.15 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. పెరిగిన వడ్డీ రేట్లు ఈ రోజు (డిసెంబర్ 15) నుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం.
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ విషయానికి వస్తే.. ఇది 8 శాతం నుంచి 8.55 శాతం వరకు ఉంది. ఓవర్ నైట్ ఎమ్‌సీఎల్ఆర్ రేటు 8.0 శాతం వద్ద ఉంది. ఒక నెల, మూడు నెలల కాలవ్యవధికి 8.15 శాతం నుంచి 8.20 శాతానికి పెరిగింది.
ఇదీ చదవండి: బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే?
ఆరు నెలలకు 8.45 శాతం నుంచి 8.55 శాతానికి, సంవత్సర కాల వ్యవధికి 8.55 శాతం నుంచి 8.65 శాతానికి, రెండు సంవత్సరాలకు 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, మూడు సంవత్సరాల కాల వ్యవధికి 8.75 నుంచి 8.85 శాతానికి పెరిగింది. ఇవన్నీ ఈ రోజు నుంచే అమలులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment