సాక్షి, ముంబై: భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి వినియోగదారులకు ఊరటనిచ్చింది. గృహ, వాహన రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 10 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు రేపటి (సెప్టెంబరు 10) నుంచి అమల్లోకి రానున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎస్‌బిఐ నుండి ఎంసిఎల్‌ఆర్ కోత పెట్టడం వరుసగా ఇది మూడవసారి. దీంతో ఒక ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీరేటు 8.15 శాతం. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 20-25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అన్ని బల్క్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటులో 10-20 శాతం కోత పెట్టింది. గృహ రుణాలు , ఆటో రుణాల వాటా వరుసగా 35, 36 శాతంగా ఉందని ఎస్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment