Home and auto loans
-
పండుగ సీజన్ : రుణాలపై గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి వినియోగదారులకు ఊరటనిచ్చింది. గృహ, వాహన రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 10 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు రేపటి (సెప్టెంబరు 10) నుంచి అమల్లోకి రానున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎస్బిఐ నుండి ఎంసిఎల్ఆర్ కోత పెట్టడం వరుసగా ఇది మూడవసారి. దీంతో ఒక ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీరేటు 8.15 శాతం. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 20-25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అన్ని బల్క్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటులో 10-20 శాతం కోత పెట్టింది. గృహ రుణాలు , ఆటో రుణాల వాటా వరుసగా 35, 36 శాతంగా ఉందని ఎస్బీఐ తెలిపింది. -
ఇల్లు, కారు కొనాలనుకునేవారికి తీపికబురు
ముంబై: కొత్త ఇళ్లుగాని, కొత్త కారుగాని కొనాలని అనుకుంటున్నారా? అయితే నిశ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటారా! వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తూ వినియోగదారులకు శుభవార్త అందించింది ఆర్బీఐ. గృహ, కారు రుణాలకు మేలు చేకూరేలా కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేట్లకే గృహ, వాహన రుణాలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకునే రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన రాజన్, ఆర్బీఐ దగ్గర ఉంచే నగదు నిల్వలపై వడ్డీరేట్లను పావు శాతం పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించారు. అంచనాల కనుగుణంగానే రెపో రేటు ను పావు శాతం తగ్గించిన రాజన్ రివర్స్ రెపోను పావు శాతం పెంచి విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు. రాజన్ తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులకు రుణాలివ్వడానికి మరిన్ని నిల్వలు తక్కువ వడ్డీకి అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు అందేలా బ్యాంకులు వెంటనే చర్యలు చేపట్టాలని రాజన్ ఆదేశించారు.