ఇల్లు, కారు కొనాలనుకునేవారికి తీపికబురు | Home and auto loans to be cheaper as RBI lowers repo rate ensuring easy liquidity for banks | Sakshi
Sakshi News home page

ఇల్లు, కారు కొనాలనుకునేవారికి తీపికబురు

Published Tue, Apr 5 2016 3:48 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

ఇల్లు,  కారు కొనాలనుకునేవారికి  తీపికబురు

ఇల్లు, కారు కొనాలనుకునేవారికి తీపికబురు

ముంబై: కొత్త ఇళ్లుగాని, కొత్త కారుగాని కొనాలని అనుకుంటున్నారా? అయితే నిశ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటారా! వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తూ  వినియోగదారులకు  శుభవార్త అందించింది ఆర్బీఐ.  గృహ, కారు రుణాలకు మేలు చేకూరేలా  కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో  తక్కువ వడ్డీ రేట్లకే గృహ, వాహన రుణాలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకునే రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన రాజన్, ఆర్బీఐ దగ్గర ఉంచే నగదు నిల్వలపై వడ్డీరేట్లను పావు శాతం పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించారు. అంచనాల కనుగుణంగానే రెపో రేటు ను పావు శాతం తగ్గించిన  రాజన్ రివర్స్ రెపోను పావు శాతం పెంచి విశ్లేషకులను  ఆశ్చర్యపరిచారు.

రాజన్ తీసుకున్న ఈ నిర్ణయంతో  వినియోగదారులకు రుణాలివ్వడానికి మరిన్ని నిల్వలు తక్కువ వడ్డీకి అందుబాటులోకి  రానున్నాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు అందేలా బ్యాంకులు వెంటనే చర్యలు చేపట్టాలని రాజన్ ఆదేశించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement