కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు డీలా పడిన సంగతి తెలిసిందే. భారత్‌లో చూస్తే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం కట్టడికై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు సవరిస్తోంది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారంగా మారుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మరో రెండు బ్యాంకులు జత చేరాయి. ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్, ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ రుణ రేట్లు పెంచి తమ కస్టమర్లకు షాకిచ్చాయి.
బాదుడే బాదడు!
బ్యాంకులు వరుసపెట్టి వారి రుణ రేట్లు పెంచుతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ కూడా రుణ రేట్లు పెంచింది. తాజాగా ఇండియన్ బ్యాంకు తమ రుణ రేటును (MCLR) 35 బేసిస్ పాయింట్ల, ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటును (MCLR) 20 పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో లోన్ ఈఎంఐలు పెరగడంతో పాటు రుణాలపై వడ్డీ రేట్లు కూడా పైకి ఎగబాకుతాయి. పెంచిన వడ్డీ రేటు ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ 7.4 శాతానికి చేరగా, ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.3 శాతానికి చేరింది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ పెంపు నిర్ణయం నవంబర్ 1 నుంచే అమలులోకి రాగా, ఇండియన్ బ్యాంక్ రుణ రేటు పెంపు నవంబర్ 3 నుంచి అమలులోకి రానుంది.
చదవండి: యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి!
Comments
Please login to add a commentAdd a comment