
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును తగ్గించింది. ఎంసీఎల్‌ఆర్ ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు శుక్రవారం ప్రకటించింది. సవరించిన ఈ కొత్త రేట్లు నవంబర్ 10 నుండి వర్తిస్తాయని తెలిపింది. దీంతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీ రేట్లను కూడా ఎస్‌బీఐ భారీగా తగ్గించింది.
తాజా తగ్గింపుతో మూడేళ్ల కాలానికి ఎంసీఎల్‌ఆర్ 8.25 శాతం నుంచి 8.20 శాతానికి దిగి వచ్చింది. వార్షిక ఎంసీఎల్‌ఆర్‌ను 8.05 శాతం నుంచి తగ్గి 8శాతంగా ఉంది. ఓవర్ నైట్, ఒక నెల కాలానికి సంబంధించిన ఎంసీఎల్ఆర్ 7.65 శాతంగా ఉంది. మూడు నెలలకు ఇది 7.70 శాతంగా ఉంది. అలాగే ఆరు నెలల, రెండేళ్ల రేటు వరుసగా 7.85 శాతం 8.10 శాతానికి తగ్గింది. వ్యవస్థలో తగినంత ద్రవ్యత దృష్ట్యా, నవంబరు 10 నుంచి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్టు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రిటైల్ టిడి వడ్డీ రేటును 1-2 సంవత్సరాల కన్నా తక్కువ పరిమితి గల డిపాజిట్లపై రేటును 15 బీపీఎస్ పాయింట్లు తగ్గించింది. బల్క్ టిడి వడ్డీ రేటును 30 - 75 బీపీస్‌ల వరకు తగ్గించిట్టు చెప్పింది. కాగా ప్రైవేట్ రుణదాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా వడ్డీరేటును తగ్గిస్తూ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కొత్త రేట్లు నవంబర్ 7 నుండి అమలులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment