హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రూ.776.64 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో సంస్థ రూ.375 కోట్ల నికర లాభం ఆర్జించింది. నిర్వహణ లాభం 36 శాతంపైగా వృద్ధిచెంది రూ.1,101 కోట్లుగా ఉందని ఎస్‌బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ తెలిపారు. వసూలు కాని మొండి బకాయిలకు చేసిన కేటాయింపులు రూ.2,258 కోట్లు ఉం డడం వల్లే నష్టం వాటిల్లినట్టు చెప్పారు. నికర వడ్డీ ఆదాయం 1.38 శాతం తగ్గి రూ.1,111 కోట్లు నమోదు చేసింది. బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.2,53,411 కోట్లు ఉంది. మొత్తం అడ్వాన్సులు 6.6 శాతం అధికమై రూ.1,12,249 కోట్లకు చేరాయి. మొత్తం డిపాజిట్లు 7.20 శాతం పెరిగి రూ.1,40,489 కోట్లుగా నమోదయ్యాయి.
రుణ రేటు తగ్గింపు..
ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణ రేటును 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గిస్తున్నట్లు ఎస్‌బీహెచ్ ప్రకటించింది. నవంబర్ ఒకటవ తేదీ నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో ఏడాది కాలానికి రేటు 9.55 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గింది. హౌసింగ్ రుణ రేటు వార్షికంగా 9.45 శాతానికి తగ్గుతుంది.
ఎస్‌బీహెచ్‌కు రూ.776 కోట్ల నష్టం
Published Tue, Nov 1 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
Advertisement
Advertisement