యాక్సిస్ బ్యాంకు (ఫైల్ ఫోటో)
ముంబై : యాక్సిస్ బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్(ఎంసీఎల్‌ఆర్)ను మరోసారి పెంచింది. మూడు నెలల కాలం నుంచి మూడేళ్ల కాలం వరకున్న రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వచ్చిందని కూడా పేర్కొంది. దీంతో బ్యాంకు మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ ప్రస్తుతం 8.15 శాతంగా, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.30 శాతంగా, ఏడాది రేటు 8.40 శాతంగా ఉన్నట్టు బ్యాంకు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
రెండు నెలల కాలంలోనే వడ్డీరేట్లను పెంచడం ఇది రెండోసారి. జనవరిలో ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఎక్కువ ఎంసీఎల్‌ఆర్, బ్యాంకు డిపాజిట్ రేట్లు పెరగడానికి సూచిస్తుందని తెలుస్తోంది. గత రెండు నెలల కాలంలో బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ పెరిగినట్టు తెలిసింది. బ్యాంకులు తమ డిపాజిట్లపై వ్యయాలు చెల్లించడం ఎంసీఎల్‌ఆర్‌తోనే ముడిపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment